అహ్లె బైత్ పట్ల ఇష్టం యొక్క లాభాలు

శుక్ర, 01/20/2023 - 07:32

అహ్లె బైత్(అ.స) ఎవరు మరియు వారి పట్ల ఇష్టం యొక్క ఇహపరలోకాలలో లాభాలేమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ..

అహ్లె బైత్ పట్ల ఇష్టం యొక్క లాభాలు

అల్లాహ్, దైవప్రవక్త(స.అ) దౌత్యనికి మరియు ప్రతిష్టమైన అనుగ్రహాలకు ప్రతిఫలాన్ని అహ్లెబైత్(అ.స)లను ఇష్టపడడాన్ని విధిగా నిర్ధారించాడు, అన్న విషయంలో ఒక్క ముస్లిముకు కూడా సందేహం లేదు. ఎందుకంటే అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా ప్రవచించెను:
قُل لَّآ أَسۡ‍َٔلُكُمۡ عَلَيۡهِ أَجۡرًا إِلَّا ٱلۡمَوَدَّةَ فِي ٱلۡقُرۡبَىٰ
అనువాదం: ఓ ప్రవక్తా! వారికి చెప్పు: మీ నుండి (దౌత్యానికిగాను) ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరను, బంధు(పట్ల) ప్రేమను తప్ప.[షూరా సూరహ్, ఆయత్23]
ఈ ఆయత్, ముస్లిముల పై పవిత్ర ఇత్రత్(అ.స) అనగా అలీ(అ.స), ఫాతెమా జహ్రా(స.అ), హసన్(అ.స) మరియు హుసైన్(అ.స)ను ఇష్టపడడాన్ని వాజిబ్ గా నిర్ధారిస్తుందని అహ్లెసున్నత్ వల్ జమాఅత్ ల ముప్ఫై కన్న ఎక్కువ మూల గ్రంథాలలో వ్రాసి ఉంది.
ఇమామ్ షాపెయీ ఇలా అన్నారు:
یا اهل بیت رسول الله حبکم      فرض من الله فی القرآن انزله
అనువాదం: “ఓ దైవప్రవక్త(స.అ) యొక్క అహ్లెబైత్(అ.స)లారా! మీ పట్ల ప్రేమను ఖుర్ఆన్ వాజిబ్ గా నిర్ధారించింది”.
వారి పట్ల ప్రేమను ఖుర్ఆన్ లో ముస్లిములందరి పై వాజిబ్ గా నిర్ధారించబడింది. ఇమామ్ షాఫెయీ కూడా దానిని అంగీకరించారు, వారి పట్ల ప్రేమ ముహమ్మద్(స.అ) యొక్క దౌత్యప్రతిఫలం అని స్పషంగా చెప్పబడింది. వారి పట్ల ప్రేమ భక్తికి నిదర్శనం, అది అల్లాహ్ సామిప్యానికి కారణంగా నిలుస్తుంది.
మరి కొంతమంది ముస్లిములు అహ్లెబైత్(అ.స)ను ఎందుకని ఇష్టపడరు!, వారి ఇంటిని ఎందుకు నిప్పంటించారు!, వారిని లెక్కచేయకుండా ఎందుకు మిగిలిన సహాబీయులతో సమానంగా భావిస్తారు!, అంతేకాదు కొందరైతే మిగిలిన సహాబీయుల కన్న తక్కువగా చేసి మాట్లాడతారు. ఆలోచించండి!.

అహ్లె బైత్(అ.స) ను ఇష్టపడడం వల్ల కలిగే లాభాలు
అహ్లె బైత్(అ.స) ను ఇష్టపడడం వల్ల కలిగే లాభాలు రెండు రకాలు.. ప్రాపంచిక లాభాలు, పరలోక లాభాలు

మొదటిది: ప్రాపంచిక లాభాలు
1. ప్రాపంచిక ఉత్తమ సవారీ మరియు విముక్తి నౌక పై ఎక్కడం
అహ్లె సున్నత్ మరియు షియా హదీస్ గ్రంథాలలో దైవప్రవక్త(స.అ) నుండి చాలా రివాయతులు అహ్లె బైత్(అ.స) అనగా పవిత్ర మాసూములను “విముక్తి నౌక”గా సూచించారు.[1]

2. ఇష్టపడే వారి పుణ్యం పెరుగుదల
హజ్రత్ అలీ(అ.స) మరణించిన తరువాత ఇమామ్ హసన్(అ.స) ఒక ఉపన్యాసంలో ఇలా అన్నారు.. ..అల్లాహ్ ఎవరి ప్రేమను ప్రతీ ముస్లిం పై విధిగా నిర్థారించి తన ప్రవక్తతో “ఖుల్ లా అస్అలుకుమ్...” అని ఆదేశించిన కుటుంబానికి చెందిన వాడిని, అల్లాహ్ ఎవరి ప్రేమ పట్ల పుణ్యం ఇస్తానని అన్నాడో ఆ హసనహ్ మా అహ్లె బైత్(అ.స) పట్ల ప్రేమ (అని గుర్తుంచుకోండి).[2]

3. దీన్ సంపూర్ణ స్థితికి చేరుతుంది
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నా అహ్లె బైత్(అ.స) పట్ల ప్రేమ దీన్ సంపూర్ణ స్థితికి చేరినట్లు”[3]

4. మార్గదర్శకం మరియు హిదాయత్
అహ్లె బైత్(అ.స) పట్ల ప్రేమ అనగా వారు చూపించిన మార్గం పై నడవడం మరియు వారే దైవప్రవక్త(స.అ) నిజమైన వారసులు.

5. మనశాంతి
ఖుర్ఆన్ ఉపదేశానుసారం, నిస్సందేహంగా విశ్వాసులు వారి హృయాలు అల్లాహ్ స్మరణ ద్వార శాంతి మరియు తృప్తి చెందుతాయి అని ఉంది[సూరయె రఅద్, ఆయత్28]. ఈ ఆయత్ యొక్క వివరణలో కొన్ని రవాయతులలో ఈ ఆయత్ ఉద్దేశించిన వ్యక్తులు దైవప్రవక్త(స.అ) మరియు అహ్లె బైత్(అ.స) ఉంది.[4]

రెండవది: పరలోక లాభాలు
1. పాపముల పట్ల క్షమాబిక్ష[5]
2. గౌరవ ప్రదమైన మృత్యువు మరియు స్వర్గ ప్రవేశం[6] అయితే ఇక్కడ కొన్ని అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. (మరో వ్యాసంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందా)
3. షిఫాఅత్ ను పొందడం.[7]
4. ప్రళయదిన శిక్ష మరియు కష్టాల నుండి దూరం[8]
5. అహ్లె బైత్(అ.స)తో పాటు ప్రళయదినాన ప్రత్యేక్షమవ్వడం.[9]
6. అహ్లె బైత్(అ.స) పట్ల ప్రేమ నిలిచిపోయే ఉత్తమత్వాలు మరియు వాటి నుండి నిత్యం పుణ్యం లభించడానికి కారణం.[10]

చివరిమాట
దైవప్రవక్త[స.అ] ఇలా ఉల్లేఖించారు: నా పట్లా మరియు నా అహ్లెబైత్[అ.స] పట్ల ప్రేమ ఏడు అతి కష్టమైన చోట్లలో లాభాన్ని చేకూరుస్తుంది, అవి:
1. మరణించేటప్పుడు(ప్రాణాలు పోతున్నప్పుడు, ఆత్మ నీ దేశాన్ని వదుతున్నప్పుడు)
2. సమాధిలో(అందరూ నిన్ను మట్టితో కప్పి వెళ్ళిపోయిన తరువాత)
3. సమాధి నుండి నిన్ను లేపబడేటప్పుడు(ప్రళయదినం)
4. నీ కార్యపత్రం నీకు ఇచ్చేటప్పుడు
5. నీ లెక్కలు తెల్చే సమయంలో
6. నీ చర్యలను కొలిచే సమయంలో
7. సిరాత్ ను దాటే సమయంలో[11]

రిఫ్రెన్స్
1. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ408.
2. బహ్రానీ, హాషిమ్, అల్ బుర్హాన్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్, భాగం4, పేజీ820.
3. అరూసీ, హువైజీ, అబ్దె అలీ ఇబ్నె జుముఅహ్, తఫ్సీరె నూరుస్సఖ్లైన్, భాగం1, పేజీ589.
4. సీవ్తీ, జలాలుద్దీన్, అద్దుర్రుల్ మన్సూర్, భాగం4, పేజీ59.
5. సీవ్తీ, జలాలుద్దీన్, అద్దుర్రుల్ మన్సూర్, భాగం1, పేజీ72.
6. జమఖ్షరీ, మహ్మూద్, కష్షాఫ్, భాగం4, పేజీ220-221.
7. అరూసీ, హువైజీ, అబ్దె అలీ ఇబ్నె జుముఅహ్, తఫ్సీరె నూరుస్సఖ్లైన్, భాగం3, పేజీ362.
8. అరూసీ, హువైజీ, అబ్దె అలీ ఇబ్నె జుముఅహ్, తఫ్సీరె నూరుస్సఖ్లైన్, భాగం5, పేజీ292.
9. ఇబ్నె షహ్రె ఆషూబ్, మొహమ్మద్ ఇబ్నె అలీ, మనాఖిబె ఆలె అబీతాలిబ్, భాగం3, పేజీ65.
10. తబర్సీ, ఫజ్ల్ ఇబ్నె హసన్, మజ్మఉల్ బయాన్, భాగం9, పేజీ44.
11. షేఖ్ సదూఖ్, అల్ ఖిసాల్, భాగం2, పేజీ360, కితాబ్ చీ, తెహ్రాన్-ఇరాన్, 1377ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8