దైవప్రవక్త(స.అ) విధేయత

శని, 01/21/2023 - 15:19

దైవప్రవక్త(స.అ) యొక్క విధేయత గురించి ఖుర్ఆన్ ఏమని ఉపదేశిస్తుంది అన్న విషయంపై సంక్షిప్త వివరణ...

దైవప్రవక్త(స.అ) విధేయత

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

అల్లాహ్ దైవప్రవక్త(స.అ) విధేయతను విధిగా నిర్ధారించెను. ఎందుకంటే ఆయన తప్పులకు దూరంగా ఉన్న పవిత్రులు కాబట్టి. కనుక ఏట్టి పరిస్థితులలో కూడా ఆయనను వ్యతిరేకించడం సరికాదు. ఆయనను వ్యతిరేకించినవారు, అతని వైపు నుండి తమ ముఖాన్ని త్రిప్పుకున్నవారు అల్లాహ్
కు వ్యతిరేకించినవారు. ఇలా అని ఖుర్ఆన్ యొక్క చాలా ఆయత్
లు సూచిస్తున్నాయి. అవి:
وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْ
అనువాదం: "దైవప్రవక్త(స.అ) మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే, దానిని వదిలి పెట్టండి".[సూరయె హష్ర్, ఆయత్7]
وَأَطِيعُواْ ٱللَّهَ وَٱلرَّسُولَ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ
అనువాదం: "విధేయత చూపండి అల్లాహ్
కూ, ప్రవక్తకూ, తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది".[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్132].
قُلۡ إِن كُنتُمۡ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِي يُحۡبِبۡكُمُ ٱللَّهُ
అనువాదం: (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ మిమ్మల్ని ప్రేమిస్తాడు...”[ఆలి ఇమ్రాన్,31]
ముస్లిముల పై దైవప్రవక్త(స.అ) విధేయత విధిగా నిర్ధారించే మరియు అతనిని వ్యతిరేకతను అవిధేయతను నిరాకరించే ఇంకా చాలా ఆయత్
లు ఉన్నాయి.

దైవప్రవక్త[స.అ] పట్ల విధేయత అవసరం
మేము దేనినైతే దైవప్రవక్త(స.అ) సున్నత్ అని అంటామో అవి అల్లాహ్ తరపు నుండి దైవవాణి ద్వార అవతరించబడినవే మరియు అందుకే అల్లాహ్ ఇలా ప్రవచించెను:
وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْۚ
అనువాదం: దైవప్రవక్త(స.అ) మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేదించిన దాని జోలికి పోకండి[సూరయె హష్ర్, ఆయత్7]
వేరే విధంగా చెప్పాలంటే దీనిని ఇలా అర్ధం చేసుకోండి, దైవప్రవక్త(స.అ) దేని గురించైనా ఆదేశించినప్పుడు లేదా నిషేదించినప్పుడు ఇక సహాబీయులకు దైవప్రవక్త(స.అ) తో ఖుర్ఆన్ యొక్క ఏ ఆయత్‌లో ఈ ఆదేశం ఉంది అని అడిగే హక్కు ఉండేది కాదు. ఎందుకంటే దైవప్రవక్త(స.అ) చెప్పేది దైవవాణి అని వాళ్ళకు తెలుసు. అందుకనే ఎటువంటి వాదన లేకుండా అమలు చేసేవారు.

దైవప్రవక్త(స.అ) పట్ల అవిధేయత మార్గభ్రష్టతకు కారణం
ఉసామా నాయకత్వాన్ని నిరాకరించిన సహాబీయులు నిజానికి అల్లాహ్ ఆదేశాన్ని వ్యతిరేకరించారు, నిస్సందేహంగా సహాబీయులు స్పష్టమైన సాక్ష్యాలను వ్యతిరేకించారు, అన్నది యథార్థం, అలా అని ఖుర్ఆన్ పఠించే మరియు దాని ఆదేశాలు తెలిసిన ముస్లిము సమ్మతిస్తాడు; ఎందుకంటే అల్లాహ్ ఇలా ప్రవచించాడు:
1. “దైవప్రవక్త(స.అ) మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికిపోవకండి. అల్లాహ్‌కు భయపడండి, అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు[సూరయె హష్ర్, ఆయత్7]
2. “అల్లాహ్, ఆయన ప్రవక్తా, ఏ విషయంలోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికైనా, విశ్వాసురాలైన ఏ స్త్రీకైనా, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్లీ ఒక నిర్ణయం తీసుకునే హక్కులేదు. ఇంకా ఎవడైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే, అతడు స్పష్టంగా మార్గ భ్రష్టతకు గురి అయినట్లే[సూరయె అహ్జాబ్, ఆయత్36]
మీరే ఆలోచించండి ఉసామా నాయకత్వం విషయంలో దైవప్రవక్త(స.అ) తీర్మానాన్ని నిరాకరించిన ప్రముఖ సహాబీయులు మార్గభ్రష్టతకు గురి అయినట్లేనా కాదా! 

అల్లాహ్ మరియు దైవప్రవక్త పట్ల విధేయత
దైవప్రవక్త(స.అ) పట్ల విధేయత కలిగి ఉండడం అల్లాహ్ పట్ల విధేయత కలిగి ఉండడంతో సమానం అని ఖుర్ఆన్ సూచిస్తుంది. మక్కావాసులు దైవప్రవక్త ముహమ్మద్(స.అ) ను హతమార్చుడం కోసం పన్నిని ఆ కుట్ర గురించి అల్లాహ్ దైవప్రవక్తకు తెలియపరిచిన్నప్పుడు[సూరయె అన్‌ఫాల్, ఆయత్ నెం:30]
హజ్రత్ ముహమ్మద్(స.అ) తన బదులుగా హజ్రత్ అలీ(అ.స) ను తమ పాన్పుపై పరుండ మని చెప్పగా హజ్రత్ అలీ(అ.స): “నేను మీ పాన్పు పై పడుకుంటే మీరు రక్షింపబడతార” అని అడిగారు.
ప్రవక్త ముహమ్మద్(స.అ) “అవును” అన్నారు. హజ్రత్ అలీ(అ.స), ప్రవక్త ముహమ్మద్(స.అ) యొక్క పాన్పుపై పరుండగా శత్రు సైన్యం నలువైపు నుండి చుట్టు ముట్టింది.
ప్రవక్త ముహమ్మద్(స.అ) ఇంటి నుండి బయలుదేరి సూర్ అనే గుహ వైపు వెళ్ళారు.
ముష్రిక్‌లు(శత్రువులు) ప్రవక్త ముహమ్మద్(స.అ) తమ పాన్పుపై విశ్రాంతి తీసుకుంటున్నారు, అని అనుకున్నారు. తెల్లవారు జామున శత్రువులు ప్రవక్త(స.అ)ను హతమార్చుటకు సిద్దం అయిన క్షణమున పాన్పు వద్ద చేరి చూడగా ప్రవక్త బదులు హజ్రత్ అలీ(అ.స) విశ్రమించుట చూసి వారితో “ముహమ్మద్ ఎక్కడ” అని ప్రశ్నించగా హజ్రత్ అలీ(అ.స) “వారిని నాకు అప్పగించారా?” అని ప్రశ్నించారు. ఆ క్షణము నందు అల్లాహ్ హజ్రత్ అలీ(అ.స) యొక్క గొప్పతనాన్ని పొగుడుతు ఇలా సంభోదించెను. وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ [సూరయె బఖరహ్, ఆయత్ నెం:207]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9