లైలతుర్రగాయిబ్ గురించి మరియు ఆ రాత్రి చేయవలసిన ఆమాల్ గురించి మరియు ఆ రివాయత్ యొక్క సనద్ గురించి సంక్షిప్త వివరణ...

రజబ్ మాసంలో ప్రత్యేక రాత్రులలో ఒకటి “లైలతుర్రగాయిబ్”. అనగా రజబ్ మాసం యొక్క మొదటి గురువారం రాత్రి. ఈ రాత్రిని “లైలతుర్రగాయిబ్” అని అంటారు. ఆ రాత్రి నిర్వర్తించేందుకు ప్రత్యేక ప్రార్ధనలు ఉల్లేఖించబడి ఉన్నాయి. ఆ ప్రార్ధనల వలన మనిషి పై అనుగ్రాహాల మరియు పుణ్యాల వర్షం కురుస్తుంది. ఒక హదీస్ అనుసారం ఈ మాసం యొక్క మొదటి గురువారం రాత్రంతా జాగారణ మరియు ప్రార్ధనలకు ప్రత్యేకమైన ప్రతిష్టత ఉంది. మరియు మన ప్రభువు అయిన అల్లాహ్ తరపు నుండి అముల్యమైన బహుమతులు మనకు దక్కుతాయి. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం ప్రకారం “ఈ రాత్రికి దైవదూతలు ఈ నామకరణం చేశారు”. ఈ రాత్రి నమాజు గురించి దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “ ‘ఎవరైతే ఈ నమాజ్ ను ఈ రాత్రి చదువుతారో ఈ నమాజ్ యొక్క పుణ్యం మంచి రుపంలో సంతోషమైన ముఖం ద్వారా వెలిసిపోతూ మంచిగా మాట్లాడుతూ మరణించిన మొదటి రాత్రి మన సమాధిలో కనిపిస్తుంది’ మరియు అతడితో ఇలా చెబుతుంది: ‘మిత్రమా! నేను నీకు శుభవార్త ఇస్తున్నాను, నీవు ప్రతీ కష్టం మరియు కఠోరత్వం నుండి విముక్తి చెందావు’. అప్పుడు ఆ మనిషి ఇలా ప్రశ్నిస్తాడు: ‘నీవు ఎవరివి? నేను ఇంత అందమైన ముఖాన్ని ఇంతకు ముందు చూడలేదు, నీ మాటల్లో ఉన్నటువంటి తియ్యదనాన్ని ఇంతకు ముందు ఎన్నడూ వినలేదు, నీ నుండి వచ్చే సుగంధాన్ని ఇంతకు ముందు స్పర్సించలేదు’. అప్పుడు అతను ఇలా జవాబు ఇస్తాడు: ‘నీవు “లైలతుర్రగాయిబ్”లో చదివిన నమాజును నేను. ఈ రాత్రి నీకు తోడుగా ఉందామని వచ్చాను దాంతో నా కర్తవ్యం పూర్తవుతుంది మరియు నీ అడలును దూరం చేయడానికి వచ్చాను. సూర్(ప్రళయ కాలపు రోజున హజ్రత్ “ఇస్రాఫీల్” శవాలనన్నింటినీ బ్రతికించ డానికై సూర్ అనే వాయిద్యాన్ని మ్రోగింప చేస్తారు) మ్రోగినప్పుడు నేను ప్రళయం నాడు నీ పై నీడనౌతాను, అందుకు నీవు సంతోషంగా ఉండు నీవు చేసిన మంచి నీకు తప్పకుండా దక్కుతుంది”.[1]
ఆమాల్
రజబ్ మాసంలో ప్రత్యేక రాత్రులలో ఒకటి “లైలతుర్రగాయిబ్”. అనగా రజబ్ మాసం యొక్క మొదటి గురువారం రాత్రి. ఈ రాత్రిని “లైలతుర్రగాయిబ్” అని అంటారు. ఆ రాత్రి నిర్వర్తించేందుకు ప్రత్యేక ప్రార్ధనలు ఉల్లేఖించబడి ఉన్నాయి. అవి:
1. ఉపవాసం: గురువారం రోజంతా ఉపవాసం ఉండాలి.
2. నమజ్: రాత్రి అయిన తరువాత మగ్రిబ్ మరియు ఇషాఁ నమాజుల మధ్య 12 రక్అత్ల నమాజ్ చదవాలి. ప్రతీ రెండు రక్అత్లలను ఒక సలామ్ ద్వార పూర్తి చేయాలి. నమాజ్ చదివే పద్ధతి: ప్రతీ రక్అత్ లో ఒకసారి “అల్ హంద్” సూరహ్, 3 సార్లు “ఖద్ర్ సూరహ్”(ఇన్నా అన్జల్నా సూరహ్) మరియు 12 సార్లు “ఇఖ్లాస్ సూరహ్”(ఖుల్ హు వల్లాహ్ సూరహ్) చదవాలి. 12 రక్ఆత్ లు పూర్తైన తరువాత 70 సార్లు “అల్లాహుమ్మ స్వల్లి అలా ముహమ్మదిన్నబీయ్యిల్ ఉమ్మీ వ అలా ఆలిహి” అని చెప్పాలి. ఆ తరువాత సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు “సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్” అని చెప్పాలి. సజ్దా నుండి తలను ఎత్తిన తరువాత కూర్చోని 70 సార్లు “రబ్బిగ్ఫిర్ వర్హమ్ వ తజావజ్ అమ్మా తఅలమ్, ఇన్నక అంతల్ అలీయ్యుల్ అజీమ్” అని చెప్పాలి. ఆ తరువాత మరలా సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు “సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్” అని చెప్పాలి. అప్పుడు మీరు అల్లాహ్ తో మీకు కావలసినది కోరుకో వచ్చు. ఇన్షా అల్లాహ్ అవి జరిగి తీరుతాయి.[2]
ముఖ్యమైన మాట:
లైలతుర్రగాయిబ్ ఆమాల్ గురించి ఉల్లేఖించబడిన రివాయత్ యొక్క సనద్ మరియు అందులో చెప్పబడిన విషయం సరైనవి కాదు అని ఉలమాల మధ్య చాలా చర్చలు జరిగాయి చివరికి వారి చెప్పేదేమిటంటే దీని సనద్ (రావీయుల క్రమం) బలహీనమైనది. ఒకవేళ ఎవరైనా అందులో చెప్పబడిన ఆమాల్ చేయాలనుకుంటే అల్లాహ్ సామిప్యం ఉద్దేశంతో చేయావచ్చు. ముందు నుంచి రజబ్ మాసం ప్రతిష్టాత్మకమైన మాసం, అందులో చేసే ప్రతీ మంచి పని రెండింతల పుణ్యం కలిగివుంటుంది. మరో వైపు షబే జుమా కూడా ప్రతిష్టాత్మకమైనది ఆ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు సిఫార్సు చేయబడి ఉన్నాయి. రజబ్ మాసం మరియు షబే జుమా రెండు కలిస్తే దాని ప్రతిష్ఠత ఇంకా పెరుగుతుంది.[3]
రిఫ్రెన్స్
1. షెఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రజబ్ మాసం యొక్క ఆమాల్ అధ్యాయంలో.
2. షెఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రజబ్ మాసం యొక్క ఆమాల్ అధ్యాయంలో.
3. https://hawzah.net/fa/Question/View/65386/میزان-اعتبار-حدیث-لیله-الرغائب
వ్యాఖ్యానించండి