నిరంతర మనశాంతి

శని, 01/27/2018 - 15:56

.రాత్రి, భార్య, గృహం మరియు ప్రోత్సాహం మనశాంతికి కారణం కాని ఇవి కొద్దికాలం వరకే మనశాంతిని ఇస్తాయి. నిరంతర మనశాంతి కేవలం అల్లాహ్ స్మరణలోనే ఉంది.

నిరంతర మనశాంతి

ఖుర్ఆన్ నాలుగు వాటిని శాంతి, విశ్రాంతి మరియు మనశాంతికి కారణంగా సూచించెను. అవి: 1.రాత్రి, 2.భార్య, 3.గృహం, 4.ప్రోత్సాహం.
1. రాత్రి:
ఖుర్ఆన్ ప్రవచనం: “మీరు విశ్రాంతి తీసుకునేందుకు ఆయనే మీ కోసం రాత్రిని చేశాడు”.[యూనుస్,67].
2. భార్య:
ఖుర్ఆన్ ప్రవచనం: “ఆయన సూచనల నుండి ఒకటి; ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృష్టించాడు. మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి!”[అల్ రూమ్:21].
3. గృహం:
ఖుర్ఆన్ ప్రస్తావనం: “అల్లాహ్ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు”.[నహ్ల్:80]
4. ప్రోత్సాహం:
ఖుర్ఆన్ ప్రస్తావనం: (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధపరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో. వారి బాగోగుల కోసం ప్రార్థించు. నిస్సందేహంగా నీ ప్రార్థన(దుఆ) వల్ల వారికి శాంతి లభిస్తుంది.
అల్లాహ్ ఈ నాలుగింటిలో శాంతి, విశ్రాంతి మరియు మనశాంతిని పెట్టాడు కాని ఇవి కొంత కాలం మరియు కొంత సమాయానికి మాత్రమే మనశాంతిని ఇస్తాయి. నిరంతర మనశాంతి కోసం సూచించబడిన అంశం వేరే ఉంది. అది అల్లాహ్ స్మరణ. ఖుర్ఆన్ ప్రవచనం: “విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి”.[అల్ రఅద్,28].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11