అల్లాహ్ యొక్క పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ గురించి ఇస్లామేతరులైన ఓరియంటలిస్టుల ఏమని చెబుతున్నారు అన్న అంశం పై సంక్షిప్త వివరణ...

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఖుర్ఆన్ మజీద్ మానవులను మార్గభ్రష్టత నుండి విముక్తిని ప్రసాదించి మంచి భాగ్యం మరియు ఉత్తమత్వానికి మార్గదర్శిగా నిలిచే ఆకాశ గ్రంథం. ఖుర్ఆన్ మెరిసే సూర్యుడి మాధిరి, దీని కిరణాల వల్ల హృదయాలు మెరుస్తాయి. ఖుర్ఆన్, యదార్థ పరిశోదకుల దప్పికను తీర్చే జ్ఞాన విజ్ఞానాల సముద్రం మాధిరి.
ఈ దైవగ్రంథం గురించి ఏదైనా మాట్లాడడం లేదా వ్రాయడం చాలా కష్టం అయినప్పటికీ దాని గురించి ఆలోచించడం, పరిశీలించడం అసాధ్యం అని ఏమాత్రం కాదు. నిజానికి మనిషి ఖుర్ఆన్ యొక్క ఆయతులను ఎంత పరిశీలిస్తే అంత కొత్త విషయాలు అతడికి తెలుసి వస్తాయి. దీనికి చరిత్రయే నిదర్శనం; ప్రతీ కాలంలో ఉలమాలు మరియు పరిశోధకులు ఖుర్ఆన్ ను పరిశీలించి దాని గొప్పతనం ముందు తమ తలను వొంచారు. ఒకవైపు దాని గొప్పతనం యొక్క అంగీకరణ అయితే మరో వైపు ఖుర్ఆన్ అవతరణకు 14 శతాబ్ధాలు గడిచినా ఈరోజు కూడా కొందరు ఖుర్ఆన్ పట్ల అజ్ఞానం కలిగి ఉండడం ఆశ్చర్యకరమైన విషయం.
ఇంకా ఖేదించదగ్గ విషయమేమిటంటే ఈనాడు ముస్లిములలో కొందరు ఈ దైవగ్రంథం యొక్క యదార్థం మరియు గొప్పతనం పట్ల అజ్ఞానులుగా ఉండడమే కాకుండా ఖుర్ఆన్ కేవలం పుణ్యం కోసం పఠించే గ్రంథంగా భావిస్తున్నారు. నిజానికి ఒకవేళ ముస్లిములు ఖుర్ఆన్ యొక్క గొప్పతనం మరియు దాని యదార్థాలను కొంచమైనా తెలుసుకుంటే ఈ ఆలోచనకు గురి అయ్యేవారు కాదు.
ఖుర్ఆన్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం ఖుర్ఆన్ గురించి ముస్లిమేతరుల భావాలను చదవడం కూడా మంచిదే. వాళ్లు తమ ఆలోచన మరియు ఎరుకతో ఖుర్ఆన్ ను ఎలా భావిస్తారో ఏ విధంగా అర్థం చేసుకున్నారో మరియు దాన్ని ఎలా అంగీకరించారో తెలుసుకోవచ్చు.
ముస్లిం మేతరులలో ఖుర్ఆన్ గొప్పతనం గురించి మాట్లాడినవారు చాలా మంది ఉన్నారు కాని ఇక్కడ కేవలం వారిలో కొందరి అభిప్రాయాలు మాత్రమే ప్రదర్శిస్తున్నాము.
1. Carlton.S Goon (పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రోఫెసర్)
ఇతను ఖుర్ఆన్ యొక్క ప్రభావం ను వివరిస్తూ ఇలా వ్రాశను: “ఖుర్ఆన్ యొక్క ప్రతిష్టతల నుండి ఒకటి దాని వాక్చాతుర్యం (బలాగత్), ఖుర్ఆన్ యొక్క ఖారీ దాన్ని సరిగా పఠించినప్పుడు వినే వాడికి అరబీ భాష తెలిసినా లేదా తెలియకపోయీనా, ఖుర్ఆన్ అర్ధం అవుతున్నా లేదా అర్థం కాకపోయినా ఖుర్ఆన్ అతడి పై ఎలా ప్రభావం చూపిస్తుందంటే; అది అతడి బుద్ధి మరియు హృదయంలో చోటు చేసుకుంటుంది”.[1]
2. Will Durant (ప్రముఖ పశ్చిమ చరిత్రకారుడు)
ఇతడు ఖుర్ఆన్ యొక్క అంశాలను మరియు దాని సమగ్రత గురించి ఇలా అన్నాడు: “ఖుర్ఆన్ మజీద్ లో చట్టం మరియు సద్గుణం ఒకటే, ధర్మం ప్రవర్తనలో ప్రాపంచిక ప్రవర్తన కూడా ఉంటుంది, ఖుర్ఆన్ యొక్క వాక్యాలు(ఆయతులున్నీ) అల్లాహ్ తరపు నుండు దైవవాణి(వహీ) రూపంలో అవతరించబడ్డాయి. ఖుర్ఆన్ లో క్లుప్తంగా అన్నింటి గురించి చర్చించబడి ఉంది ముఖ్యంగా సత్ప్రవర్తన, ఆరోగ్యం, వివాహం, విడాకులు, శిక్షణా, వ్యాపారం, రాజకీయం, లాభం మరియు అప్పు, అన్నీ ఉన్నాయి”.
“ఖుర్ఆన్, చాలా సులభమైన రీతిలో విశ్వాసాలను ఉపదేశిస్తుంది. సమాజాన్ని పూర్వ ఆచారాల మరియు విగ్రాహారాధనల నుండి విముక్తినిచ్చి తన విశ్వాసాలను ప్రదర్శిస్తుంది”
మరో చోట ముస్లిముల అభివృద్ధి విషయంలో ఇస్లాం మరియు ఖుర్ఆన్ యొక్క నిర్మాణ ప్రభావాలనుద్దేశించి ఇలా అన్నాడు: “ఒకవేళ ముస్లిములలో నాగరికత, సంస్కృతి మరియు నైతిక అభివృద్ధి ఉంటే అది ఖుర్ఆన్ కరీమ్ ను అనుచరించడం వలనే. ఖుర్ఆన్ ముస్లిములను ఐక్యమత్యంగా ఉండమని ఆహ్వానిస్తుంది. వారిని పవిత్రత వైపు మక్కువ చూపుతుంది, మూఢ నమ్మకాలు, పక్షపాతాలు మరియు అపోహల నుండి వారి మనస్సులను శుభ్రపరుస్తుంది, అదేవిధంగా, ఇది వారిని క్రూరత్వం మరియు హింస నుండి ఆపుతుంది”[2]
3. Charls Francis(అమెరికన్ ప్రొఫేసర్)
చార్లీస్ ఫ్రాన్సీస్, ఖుర్ఆన్ తో ముస్లిముల లోతైన సంబంధం మరియు క్రైస్తవులు బైబిల్ నుండి దూరం గురించి ఇలా వ్రాసెను: “అమెరికాలో క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ గురించి ప్రతీ క్రైస్తవుడికి తెలియదు కాని ఖుర్ఆన్ ఎలాంటి గ్రంథం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతీ ముస్లిం కు దాని గురించి చాలా బాగా తెలుసు. నా ఈ దావా అబద్ధపు దావా కాదు, ఇది నిరాకరించలేని యదార్థం”[3]
4. Non Gunbeaum (పశ్చిమ విద్వాంసుడు)
ఖుర్ఆన్ నిత్యాద్భుతం (ఇప్పటికీ అది ఒక అద్భుతమే) అన్న దావా కేవలం ముస్లిములే చేయారు, ఇతరులు కూడా దీనిని అంగీకరింస్తారు ఉదాహారణకు పశ్చిమ విధ్వాంసుడైన Non Gunbeaum దీని గురించి ఇలా అన్నాడు: “ఖుర్ఆన్ హజ్రత్ ముహమ్మద్(స.అ) యొక్క స్పష్టమైన అద్భుతం(మోజిజా), ఇదీ చాలా విధాలుగా అద్భుతమైనది ఉదాహారణకు ఇందులో భవిష్యత్తులో సంభవించే వాటి గురించి చెప్పబడి ఉంది, తెలియని వాస్తవాల వెల్లడి, ప్రజలు దాని మాధిరి మరో గ్రంథం తీసుకోని రాలేకపోవడం, మరియు అదేవిధంగా, దాని అందం మరియు వాక్చాతుర్యంలో సాటి లేనిదిగా ఉండడం, అంతేకాకుండా మరెన్నో విధాలుగా కూడా అద్భుతమైనది”[4]
రిఫరెన్స్
1. ఇస్లాం అజ్ దీద్‌గాహె దానిష్‌మందానె జహాన్, పేజీ551.
2. తారీఖె తమద్దున్, వేల్ ద్రాంత్, భాగం1, పేజీ52.
3. ఏతేరాఫాతె దానిష్ మందానె బుజుర్గె జహాన్, పేజీ61.
4. ఏతేరాఫాతె దానిష్ మందానె బుజుర్గె జహాన్, పేజీ61.
వ్యాఖ్యానించండి