పశ్చిమ విద్వాంసుల దృష్టిలో ఖుర్ఆన్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రతిష్టత గురించి సంక్షిప్త వివరణ...

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
5. Houston Smith , (అమెరికా విద్వాంసుడు)
అది (ఖుర్ఆన్) ఒక ఆకాశ పవిత్ర గ్రంథం. దానిని దైవప్రవక్త(స.అ) అల్లాహ్ నుండి తన దౌత్యం పై స్పష్టమైన సాక్ష్యం మరియు సజీవ అద్భుతం గా ప్రదర్శించారు, ఖుర్ఆన్ పఠనం మరియు దాని అనుచరణ ముస్లిము కర్తవ్యాల నుండి ఒక భాగం. భహుశ యావత్ ప్రపంచలో ఖుర్ఆన్ ను చదివేంతగా మరో ఏ గ్రంథం పఠించబడదు.... ముస్లిములు ఈ దైవగ్రంథం పై గట్టి నమ్మకం కలిగి ఉంటారు వీరికి భిన్నంగా క్రైస్తవులు తమ గ్రంథం బైబిల్ పట్ల గౌరవం విషయంలో ముస్లిముల కాళ్ల దూళికి కూడా చేరలేరు.[1]
ఈ అభిప్రాయం ద్వారా తెలిసే విషయమేమిటంటే; ఓరియంటలిస్టులు ఖుర్ఆన్ ను దైవప్రవక్త(స.అ) యొక్క దౌత్యానికి సాక్ష్యం మరియు సజీవ అద్భుతం అని నమ్ముతారు మరియు దానిని ముస్లిముల హిదాయత్ యొక్క మూలం అని భావిస్తారు. ముస్లిములు తమ పవిత్ర గ్రంథాన్ని చాలా గౌరవిస్తారు అన్న విషయాన్ని ప్రశంసనియంగా చూస్తారు.
6. Dr Pnilipe.c Hitta (ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్)
Dr Pnilipe.c Hitta కూడా ఖుర్ఆన్ సాటిలేని గ్రంథం అని ఒప్పుకుంటూ ఇలా అన్నాడు: “ఖుర్ఆన్, అల్లాహ్ వచనలు మరియు దైవవాణి రూపంలో ఆకాశం నుండి అవతరించబడ్డ అంతిమ గ్రంథం. ఈ గ్రంథం శాశ్వతమైనది మరియు సృష్టించబడనిది... ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క అద్భుతాలన్నీంటిలో అతి పెద్ద అద్భుతం. ఒకవేళ యావత్ ప్రపంచం ఏకమై దాని మాధిరి తీసుకొని రావాలనుకున్నా కూడా వారు దాని మాధిరి (గ్రంథం) తీసుకొని రాలేరు... ఖుర్ఆన్ షరీఫ్ లో హృదయం లోతుల్లో మరియు మానవ ఆత్మలలో చొరబడే ప్రభావితమైన ఆయతులు ఉన్నాయి”[2]
7. Kernico (ఇంగ్లాడ్ విద్వాంసుడు)
Kernico తో విధ్వాంసుల విజ్ఞాన సభలో ఖుర్ఆన్ యొక్క వాక్చాతుర్య అద్భుతం గురించి ప్రశ్నించినప్పుడు అతడు ఇలా సమాధానమిచ్చాడు: “ఖుర్ఆన్ కు ఒక తమ్ముడు ఉన్నాడు అతడి పేరు నెహ్జుల్ బలాగహ్, ఎవరికైనా నెహ్జుల్ బలాగహ్ మాధిరి (గ్రంథం) తీసుకొని వచ్చే యోగ్యత ఉందా? దాంతో మేము ఖుర్ఆన్ లాంటి వాక్చాతుర్యం గల నమూనా గురించి మాట్లాడే ధైర్యం చేయగలం”[3]
అంటే నెహ్జుల్ బలాగహ్ సమాధానం తీసుకొని రాలేనివాడు ఎలా ఖుర్ఆన్ సమాధానం తీసుకొని రాగలడు.
8. Rockeston
పశ్చిమ విధ్వాంసుడు తన గుండే లోతుల్లో నుండి యదార్థాన్ని అంగీకరిస్తూ ఇలా అన్నాడు: “చాలా సంవత్సరాల నుండి యదార్థన్వేషణలో ఉన్నాను కాని నేను యదార్థాన్ని ఇస్లాం లో పొందాను, పవిత్ర ఖుర్ఆన్ ను చూశాను దాన్ని చదవడం మొదలు పెట్టాను, దాంతో నా ప్రశ్నలన్నీంటి సమాధానం పొందాను”
9. Rebertson (స్కాట్లాండ్ క్రైస్తవ పండితుడు)
ఖుర్ఆన్, పగా, అహంకారం, అహంభావం మరియు అన్యాయం లాంటి మరెన్నో చెడు చర్యల ను నిషేదిస్తుంది... మరియు సహనం, సత్యం, యదార్థ జ్ఞానం, ధర్మనిష్ట లాంటి కార్యల ను అమలు పరచమని ఆదేశిస్తుంది.[4]
వీళ్ళే కాకుండా పడమర విద్వాంసులలో చాలా మంది ఖుర్ఆన్ గురించి తమ అభిప్రాయాలను వెళ్లడించారు అయితే ఇక్కడ వాటన్నీంటిని ప్రదర్శించడం పాఠకుల సహనానికి పరీక్ష కాకూడదని ఆపుతున్నాము.
పై చెప్పబడిన పశ్చిమ విద్వాంసుల అభిప్రాయాలతో వాళ్లు ఖుర్ఆన్ ను అల్లాహ యొక్క అద్భుతం, దౌత్యం యొక్క నిదర్శనం మరియు మార్గదర్శిక గ్రంథం అని భావిస్తారని తెలుస్తుంది. వాళ్లు ఖుర్ఆన్ ను ముస్లిముల చట్టం మరియు సద్గుణాల గ్రంథం అని అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో ఖుర్ఆన్ విగ్రాహారాధన, బహుదైవారాధన మరియు చెడు అలవాట్ల నుండి ఆపుతుంది. వాళ్లు ముస్లిముల అభివృద్ధి మరియు మిగిలివుండడానికి రహస్యం ఈ గ్రంథం అని, నమ్ముతారు. వాళ్లు ఖుర్ఆన్ పట్ల ముస్లిముల గౌరవం, దాని కంఠస్థం మరియు పఠనం గురించి ప్రశంసిస్తూ తమ సంఘం వారి పట్ల వీళ్లకు బైబిల్ పట్ల గౌరవమూ లేదూ మరియు క్రైస్తవులు తమ పవిత్ర గ్రంథం పట్ల మక్కూవా లేదు అని ఫిర్యాదు చేస్తున్నారు.
ఖేదించదగ్గ విషయమేమిటంటే ఎక్కడైతే ఒకవైపు పశ్చిమ విద్వాంసులు మరియు ఉలమాలు ఖుర్ఆన్ యొక్క గొప్పతనాన్ని ఓప్పుకుంటున్నారో అదే ప్రదేశాలకు చెందిన కొంత మంది రాజకీయ స్వార్థపరులు మరియు స్వమత పక్షపాతులు ఖుర్ఆన్ ను తగలబట్టడం మరియు దాని ఆదేశాలను అవహేళన చేస్తూనే ఉన్నారు.
అల్లాహ్ మనందరికీ ఖుర్ఆన్ యొక్క గొప్పతనం మరియు యదార్థం తెలిసుకొనే యోగ్యత ప్రసాదించు గాక...!
రిఫరెన్స్
1. ఖుర్ఆన్ వ దీగరాన్, పేజీ18.
2. నజరియ ఎ దానిష్ మందానె జహాన్ దర్బారయె ఖుర్ఆన్ వ ముహమ్మద్(స.అ), పేజీ46.
3. ఆన్చే బాయద్ అజా ఖుర్ఆన్ బెదానీమ్, పేజీ62.
4. దర్సహాయీ అజ్ మక్తబె ఇస్లాం, సాల్13, షమారెహ్2.
వ్యాఖ్యానించండి