దైవప్రవక్త(స.అ) యొక్క మొదటి ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) జీవిత చరిత్ర సంక్షిప్తంగా...
దైవప్రవక్త(స.అ) బెఅసత్‌కు 10 సంవత్సరాల ముందు అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) జన్మించారు, ఇస్లాం చరిత్రలో సంభవించిన సంఘటనల లో నిత్యం దైవప్రవక్త(స.అ) ప్రక్కనే ఉన్నారు. దైవప్రవక్త(స.అ) మరణానంతరం వారు 30 సంవత్సరాలు జీవించి ఉన్నారు.
మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం, ఆత్మ శిక్షణకు అత్యుత్తమకాలం, మొదటి దశ. ఆ కాలంలో అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) ఇంట్లో వారి శిక్షణలో పెరిగారు.
బెఅసత్ నుంచి మదీనహ్‌కు హిజ్రత్ చేసిన 13 సంవత్సరాల జీవిత కాలంలో ఇస్లాం యొక్క అభివృద్ధి కోసం వారు ఎన్నో సేవలు అందించారు, కృషి చేశారు మరియు గొప్ప గొప్ప చర్యలు చేపట్టారు. ఇలాంటి చర్యలు ఇస్లాం చరిత్రలో వారికి తప్ప మరొకరికి సొంతం కాలేదు.
దైవప్రవక్త(స.అ) మూడు సంవత్సరముల వరకు, బహిరంగంగా ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించలేదు. మూడు సంవత్సరాల తర్వాత ప్రజలందరిని ఆహ్వానించే చర్యను ముందుగా నీ బంధుమిత్రుల నుంచి మొదలు పెట్టు అని అల్లాహ్ ఆదేశం[సూరయె షుఅరా, ఆయత్214-216] వచ్చిన తరువాత దైవప్రవక్త(స.అ) తన ప్రచారాన్ని మొదలు పెట్టారు వారికి సహాయంగా ఉంటాను అని హజ్రత్ అలీ(అ.స) తన మద్దత్తును తెలిపారు.
బెఅసత్ యొక్క 13వ సంవత్సరంలో యస్రబ్(మదీనహ్) వాసులు దైవప్రవక్త(స.అ)తో మేము మీకు మద్దత్తు తెలుపుతామనీ మరియు మీ తరపు నుంచి పోరాడతామని చెప్పి యస్రబ్‌కు రమ్మని ఆహ్వానించారు. ఖురైష్‌కు చెందిన పెద్దలకు ఇస్లాం ప్రచారం కోసం యస్రబ్‌లో కొత్త కేంద్రం ఏర్పడుతుంది అని తెలిసింది, దాంతో వారి కోసం ఇది ప్రమాధంగా మారుతుంది అని భావించారు. అందుకు ముందు చర్యగా వాళ్లు “దారున్నద్వా” (మక్కా సలహా మండలి)కు చేరి దైవప్రవక్త(స.అ)ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. దైవప్రవక్త(స.అ) ఖురైషీయుల పన్నాగాన్ని అలీ(అ.స)కు వివరించారు. ఆ రాత్రి ఇమామ్ అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) పాన్పుపై పడుకొన్నారు. శత్రువులు సూర్యోదయానికి ముందు ఒరనుంచి కత్తులు తీసుకొని ఇంటిపై దాడి చేశారు. అలీ(అ.స) పాన్పు పైనుండి లేచారు. వాళ్లు తమ పన్నాగంలో సాఫల్యాన్ని పొందలేకపోయారు.[1]
హిజ్రత్ నుంచి దైవప్రవక్త(స.అ) మరణం వరకు గడిచిన హజ్రత్ అలీ(అ.స) జీవిత చరిత్రలో చాలా సంఘటనలు సంభవించాయి ముఖ్యంగా ఎన్నో యుద్ధాలలో వారు ప్రాణాలు లెక్కచేయకుండా చేసిన యుద్ధాలు. దైవప్రవక్త(స.అ) మదీనహ్ పట్టణానికి వలసి వచ్చిన తర్వాత 27 “గజ్వా”లు(చరిత్ర కారుల భాషలో దైవప్రవక్త(స.అ) స్వయంగా ఆధిపత్యం నిర్వర్తించిన యుద్ధాలను గజ్వా అంటారు.) ముష్రిక్కులతో, యూధులతో మరియు తిరుగుబాటుదారులతో జరిగాయి అందులో 66 గజ్వాలలో అలీ(అ.స) పాల్గొన్నారు కేవలం “తబూక్” యుద్దంలో కొన్ని కారణాల వల్ల పాల్గొలేకపోయారు. దైవప్రవక్త(స.అ) లేని సమయంలో కపటవర్తనులు ఇస్లామీయ కేంద్రాన్ని నాశనం చేయవచ్చు అనే ఆలోచనతో దైవప్రవక్త(స.అ) ఆదేశానుసారం మదీనహ్‌లోనే ఉండిపోయారు.
నాలుగు పెద్ద యుద్ధాల సంక్షిప్త వివరణ:
1. బద్ర్ యుద్ధం బద్ర్ యుద్దం(జంగె బద్ర్) ముస్లిముల మరియు ముష్రికీనుల మధ్య జరిగిన యుద్ధం.[2]
2. ఒహద్ యుద్ధం బద్ర్ యుద్ధంలో అపజయం వల్ల నిరాశకు గురి అయిన ఖురైషీయులు, యుద్ధంలో కోల్పోయిన వారి పగను తీర్చుకోవడానికి ఇంకా ఎక్కువ బలగంతో పూర్తి నాణ్యత గల సైన్యంతో మదీనహ్ పై దాడి చేయాలనుకున్నప్పుడు జరిగిన యుద్ధం.[3]
3. అహ్జాబ్ యుద్ధం ఈ యుద్ధం ఇస్లాం యొక్క శత్రు సమూహాలన్నీ కలిసి ఇస్లాంను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఏకమయ్యారని. కొంతమంది చరిత్రకారులు ఈ యుద్ధంలో కాఫిరుల సైన్యం సంఖ్య పది వేలు అని వ్రాశారు. ఇస్లాం సైన్యం సంఖ్య 3 వేలకు మించి లేదు.
4. ఖైబర్ యుద్ధం దైవప్రవక్త(స.అ) హిజ్రీ యొక్క 7వ సంవత్సరంలో యూధుల కోటను వారి నుంచి కొన్ని కారణాల వల్ల తీసుకోవాలనుకున్నారు. అందుకోసమని ఈ యుద్ధం జరిగింది.[4]
దైవప్రవక్త(స.అ) మరణం నుంచి వారి ఖిలాఫత్ వరకు అనగా హజ్రత్ అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్(ర.అ) యొక్క ఖిలాఫత్ కాలం.
దైవప్రవక్త(స.అ) మరణానంతరం ఇస్లామీయ సమాజాన్ని పరిపాలించే అర్హతగల ఉత్తమవ్యక్తి అలీ(అ.స). ఇస్లాం దృష్టిలో దైవప్రవక్త(స.అ) తరువాత ధర్మనిష్ట పరంగా, అంతర్‌దృష్టి పరంగా, సమస్యతీర్మాన పరంగా, అల్లాహ్ మార్గంలో జిహాద్ మరియు ప్రయత్నం పరంగా అలాగే వేరే ఎన్నో పరిపూర్ణ వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు స్వభావాలు అలీ(అ.స)లో తప్ప మరోకరిలో లేవు. ఈ అర్హతల వలనే, అల్లాహ్ ఆదేశానుసారం దైవప్రవక్త(స.అ) ద్వార ఎన్నో సార్లు అలీ(అ.స) ముస్లిముల నాయకుడిగా పరిచయించబడ్డారు. ఈ క్రమంలో అత్యంత ముఖ్యమైన సంఘటన “గదీర్ సంఘటన”. అందుకని దైవప్రవక్త(స.అ) మరణానంతరం వారి నాయకత్వం అలీ(అ.స)కు చెందాలి. వారే ముస్లిముల సమాజంపై నాయకత్వం వహించాలి. కాని నిజానికి ఇలా జరగలేదు. ఇస్లామీయ ఖిలాఫత్ మార్గం, దైవప్రవక్త తరువాత అడ్డదారి పట్టింది, అలీ(అ.స) నుంచి ఖిలాఫత్ ను చేదించి వారిని ఇస్లాం రాజకీయం మరియు నిర్ణలయాలకు దూరం చేశారు. వారు గనక దైవప్రవక్త(స.అ) తరువాత ఖిలాఫత్ అధికారం పై వచ్చి ఉంటే ఈ రోజు ఇస్లాం పరిస్థితి వేరే స్థితిలో ఉండేది. మనిషి ప్రపంచం వెనక కాకుండా అల్లాహ్ సామిప్యం పొందడానికి పరుగులు తీస్తూ కనబడేవాడు. అందరిలో సమానత్వం ఉండేది, ధనవంతుడు పేదవాడు అనే బేధాలు ఉండేవి కావు.
రిఫరెన్స్
1. ఇబ్నె హిషామ్, అబ్దుల్ మలిక్, అల్ సీరతున్నబవియహ్, తహ్ఖీఖ్: ముస్తఫా అస్సఖా, ఇబ్రాహీమ్ అల్ అబ్యారీ మరియు అబ్దుల్ హఫీజ్ షిబ్లీ, భాగం2, పేజీ124-128; ఇబ్నె అసీర్, అల్ కామిల్ ఫీత్తారీఖ్, భాగం2, పేజీ102; మొహమ్మద్ ఇబ్నె సఅద్, అల్ తబఖాత్ అల్ కుబ్రా, భాగం1, పేజీ228; షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, భాగం3, పేజీ4; అల్ హాకిమ్ అల్ నైషాబూరీ, అల్ ముస్తద్రక్ అలస్సహీహైన్, ఏదాద్: అబ్దుర్రహ్మాన్ అల్ మరఅషీ, భాగం3, పేజీ4; తబరీ, ముహమ్మద్ బిన్ జురైర్, తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్, భాగం2, పేజీ244.
2. అల్ ఇర్షాద్, షేఖ్ ముఫీద్, పేజీ39.
3. అల్ కామిల్ ఫిత్తారీఖ్, భాగం2, పేజీ154.
4. సహీ ముస్లిం, ముస్లిం ఇబ్నె అల్ ఖుషైరీ, భాగం7, పేజీ121.
వ్యాఖ్యానించండి