గొప్ప ప్రత్యేకత

మంగళ, 02/07/2023 - 15:19

హజ్రత్ అబూతాలిబ్ యొక్క కుమారుడు హజ్రత్ అలీ(అ.స) కాబా లో జన్మించారు అన్న విషయం పై కొన్ని నిదర్శనలు...

గొప్ప ప్రత్యేకత

అల్లాహ్ తరపు నుండి నియమించబడ్డ దైవప్రవక్త(స.అ) యొక్క నిజమైన మరియు అర్హత గల ఉత్తరాధికారి అయిన హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స) హిజ్రత్ కన్నా 23 సంవత్సారల క్రితం రజబ్ మాసం 13వ తేదీన అల్లాహ్ గృహం అనగ కాబాలో జన్మించారు. అతను కాబాలో జన్మించిన మొట్టమొదటి మరియు చిట్టచివరి వ్యక్తి, అంతకు ముందు గాని ఆ తరువాత గాని ఎవ్వరూ కాబాలో జన్మించలేదు. చరిత్రే దీనికి నిదర్శనం.
“హాఫిజ్ గంజీ షాఫెయీ” తన “అల్ కిఫాయహ్” అను గ్రంథంలో ఇలా ఉల్లేఖించెను: “అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) మక్కాలో బైతుల్లాహిల్ హరామ్(కాబా)లో, షబే జుమా(గురువారం రాత్రి) రజబ్ మాసం 13వ తేదీన “ఆముల్ ఫీల్ యొక్క” 33వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తప్ప మరెవ్వరూ అల్లాహ్ గృహంలో జన్మించలేదు మరియు జన్మించరు కూడానూ, మరి ఇదే ఆయన అత్యంత ప్రతిష్టకు చాలు”.[1]. కాని కొన్ని గ్రంథాలలో ఆముల్ ఫీల్ 30వ సంవత్సరం అని కూడా వ్రాశారు.
అమీరుల్ మొమినీన్(అ.స) జన్మదిన సందర్భంగా ఆయనని ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

కాబాలో జన్మించింది ఒకేఒక్కడు
అబూతాలిబ్ యొక్క కుమారుడైన హజ్రత్ అలీ(అ.స) కాబాలో జన్మించారు అన్న సంఘటన మరియు అంశం పై కేవలం షియాలే కాకుండా అహ్లె సున్నత్ వర్గానికి చెందిన చాలా మంది చరిత్రకారులు, ముహద్దిసీనులు మరియు ఉలమాలు కూడా ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. మరియు అలీ కాబాలో జన్మించారు మరియు ఆయన తప్ప అల్లాహ్ గృహంలో ఎవ్వరూ జన్మించలేదు మరియు జన్మించరు కూడా, అని సాక్ష్యమిచ్చారు.
ఈ ప్రతిష్టత కూడా మిగిలిన చాలా ప్రతిష్టతల వలే అలీ(అ.స)కే ప్రత్యేకించబడినది, ఇందులో ఎవ్వరూ భాగస్వాములు కాలేరు. ఆయన అల్లాహ్ యొక్క కాంతి, సన్మార్గ ధ్వజం. ఆయన ఈ లోకంలో అల్లాహ్ యొక్క వైఖరి మరియు అన్ని ప్రతిష్టతలకు మరియు అద్భుతాలకు కేంద్రం. దైవప్రవక్త(స.అ) తరువాత భూమి పై ఉన్న మానవులందరిలో ఉత్తములు.[2]

హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించారు
“షైఖ్ సదూఖ్” ఇమామ్ అలీ(అ.స) యొక్క జన్మదినం గురించి ఇలా అనెను: “యజీద్ ఇబ్నె ఖఅనబ్ ఇలా ఉల్లేఖించెను: “నేను అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్ మరియు ‘బనీ అబ్దుల్ ఇజ్జ్’ నుండి ఒక సమూహం కాబాకు ఎదురుగా కూర్చోని ఉండగా అనుకోకుండా ‘ఫాతెమా బింతె అసద్’ అల్లాహ్ గృహం వద్దకు వచ్చారు, అప్పుడు ఆమె అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క 9 నెలల కడుపుతో ఉన్నారు. పురుటి నొప్పులు పడుతూ, తన చేతులను దుఆ కోసం ఎత్తి అల్లాహ్ తో ఇలా దుఆ చేసెను: “ప్రభువా! నేను నిన్నూ, ప్రవక్తలు మరియు నీ తరపు నుండి అవతరించబడ్డ గ్రంథములను విశ్వసిస్తాను. మరియు నా పితామహులైన హజ్రత్ ‘ఇబ్రాహీమ్ ఖలీల్(అ.స)’ మాటలను నిదర్శిస్తున్నాను, అతనే ఈ పవిత్ర గృహాన్ని కట్టారు, అయితే ఈ గృహం కట్టిన వారి మరియు నా గర్భంలో ఉన్న బిడ్డ కారణంగా కాన్పును నా పై శులభం చేయి” యజీద్ ఇబ్నె ఖఅనబ్ ఇంకా ఇలా అనెను: అకశ్మాత్తుగా కాబా యొక్క వెనుక భాగం చీల్చుకుంది, ఫాతెమా బింతె అసద్ అల్లాహ్ గృహం లోపలికి ప్రవేశించారు, మా కళ్ళకు కనబడకుండా పోయారు, ఆ తరువాత కాబా యొక్క గోడ అతుక్కు పోయింది! తాళం తెరిసి యదార్థమేమిటా అని తెలుసుకోవాలని వెళ్ళాము కాని అల్లాహ్ గృహం యొక్క తాళం తెరుచుకోలేదు. అప్పుడు తెలుసుకున్నాము ఇదేదో అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం జరిగినదని”.[3]

హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించడం పై క్రైస్తవ చరిత్రకారుల నిదర్శనలు
అమీరుల్ మొమినీన్(అ.స) స్వమత నమ్మకాల మరియు విశ్వాసాల హద్దులను చేరిపేశారు. అన్ని మతాల, వర్గాల మరియు ఆయనను కోరే హృదయాలను తన వైపుకు ఆకర్షించుకున్నారు. వారిని ఇష్టపడే వారిలో క్రైస్తవుల సంఖ్య ఇతర వర్గాలవారి కన్నా ఎక్కువగా ఉంది.
క్రైస్తవ చరిత్రకారులు ఇమామ్ అలీ(అ.స) గురించి సుదీర్ఘమైన మరియు స్థిరమైన పుస్తకాలు కవిత్వ రూపంలో మరియు రచన రూపంలో వ్రాశారు. వారు కూడా హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) కాబాలో జన్మించారని వివరించారు, వాటి నుండి కొన్ని:
1. జార్జ్ జుర్దాఖ్, ప్రమఖ విద్వాసుడు. గ్రంథం “అల్ ఇమామ్ అలీ సౌతుల్ ఇదాలతిల్ ఇన్సానియ్యహ్”[భాగం1, పేజీ32].
2. రాక్స్ బిన్ జాయిద్ అజీజీ, ప్రముఖ రచయిత. గ్రంథం “అల్ ఇమామ్ అలీ అసదుల్ ఇస్లామ్ వ ఖిద్దీసహ్”[పేజీ25].
3. డాక్టర్ డోనాల్డ్ సన్, ఇతను ఒక Orientalist. గ్రంథం “అఖీదతు అల్ షియా”[పేజీ34].
4. బోల్స్ సలామహ్, ప్రముఖ కవి. గదీర్ గురించి వివరిస్తూ వ్రాసిన కవిత్వంలో ఇమామ్ అలీ[అ.స] కాబాలో జన్మించారు అని వ్రాశారు. [ఈదుల్ గదీర్, పేజీ56].

రిఫరెన్స్
1. గంజీ షాఫెయీ, కిఫాయత్తాలిబ్, పేజీ407.
2. హౌజా నెట్, ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.
3. షేఖ్ సదీఖ్, అమాలీ సదూఖ్, పేజీ80.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9