హజ్రత్ అబూతాలిబ్(అ.స) చరిత్ర-1

మంగళ, 02/14/2023 - 15:58

హజ్రత్ అబూతాలిబ్(అ.స) జీవిత చరిత్ర చరిత్ర గ్రంథాల ఆధారంగా మరియు అహ్లె బైత్(అ.స) రివాయతులనుసారంగా...

హజ్రత్ అబూతాలిబ్(అ.స) చరిత్ర-1

హజ్రత్ అబూతాలిబ్ పేరు “ఇమ్రాన్”, వారి పెద్ద కుమారుడి పేరు “తాలిబ్” అందుకని వారిని అబూతాలిబ్ అని పిలిచేవారు. అబూతాలిబ్ అనగా తాలిబ్ యొక్క తండ్రి. వారు దైవప్రవక్త(స.అ) పుట్టుకకు 35 సంవత్సరాల ముందు మక్కాలో అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగివున్న కుటుంబంలో జన్మించారు. వారు దైవప్రవక్త(స.అ) తండ్రి అయినా అబ్దుల్లాహ్ యొక్క సోదరులు. వారి తండ్రి అబ్దుల్ ముతల్లిబ్., వీరిని అరేబీయ సమూహాలన్నీ గౌరవించేవారు, వీరిని ఇబ్రాహీమ్ విశ్వాసాలను అనుచరించే మరియు తౌహీద్ పట్ల నమ్మకం కలిగినవారుగా గుర్తించేవారు. అబ్దుల్ ముతల్లిబ్ ను మక్కా చుట్టుప్రక్కల వారు “సయ్యదుల బతహా” అనగా మక్కా మరియు చుట్టుప్రక్కల వారి నాయకుడు, “సాఖిల్ హజీజ్” అనగా హాజీయులను నీళ్లు సరఫరా చేయువారు, “అబుస్సాదత్” అనగా గొప్పవాళ్ల పితామహులు, “హాఫిర్ జ్జమ్ జమ్” అనగా జమ్ జమ్ బావి సృష్టికర్త అని పిలిచేవారు. అబ్దుల్ ముతల్లిబ్ నిత్యం దైవప్రవక్త(స.అ) రక్షణ కోసం పాటుపడె వారు. ఈ యదార్థాలను అహ్లె సున్నత్ మరియు షియా వర్గాల వారు విశ్వసిస్తారు.

అబూతాలిబ్ ఇలాంటి గొప్ప ఇంట పుట్టారు మరియు వారి ఇంట్లో శిక్షణ పొందారు. అబూతాలిబ్ కు నలుగురు కుమారుల మరియు ఇద్దరు కుమార్తెలు. కుమారులు 10 సంవత్సరాల తేడాతో జన్మించారు. పెద్ద కుమారుడు తాలిబ్ ఇతని సంతానంలో ఎవరు మిగల లేదు. రెండ  కుమారుడు అఖీల్, మూడవ కుమారుడు జాఫరె తయ్యార్ మరియు నాలుగోవ కుమారుడు హజ్రత్ అలీ(అ.స). ఇద్దరు కుమార్తెల పేర్లు: ఉమ్మె హానీ మరియు రైతా లేదా అస్మా. వీళ్లందరూ ఫాతెమా బింతె అసద్ కు జన్మించారు.[1] 

జనాబె అబూతాలిబ్ ఏకేశ్వరవాధుల ఇంట అబ్దుల్ ముతల్లిబ్ లాంటి ఉత్తమ మరియు ఆధ్యాత్మిక పరమైన గొప్ప వ్యక్తి ఒడిలో శిక్షణ పొందరు. తండ్రి వలే హజ్రత్ ఇబ్రాహీమ్ యొక్క విశ్వాసాల అడుగుజాడలలో నడిచారు. అబూతాలిబ్ పై షిర్క్ మరియు విగ్రాహారాధనల నీడ కూడ పడలేదు అంతే కాదు వారు అజ్ఞానపు ఆచారాలకు ఎదురు తిరిగారు, ప్రతీ అపవిత్రత నుండి దూరంగా ఉన్నారు.[2] వారు తీర్మానం చర్యగా “చావును నిరూపించడానికి చంపబడిన వారి పెద్దలు(ఔలియా) ప్రమాణాన్ని” నిర్ధారించిన మొట్ట మొదటి వ్యక్తి, తరువాత కాలంలో ఇస్లాం కూడా దీనినే “ఖసామహ్” పేరుతో సమ్మతించింది.[3]

చరిత్రకారులు ఇలా రచించారు:  అబూతాలిబ్ దైవప్రవక్త(స.అ) హిజ్రత్ కు మూడు సంవత్సరాల ముందు షవ్వాల్ లేదా జిల్ ఖఅదహ్ నెలలో 84 సంవత్సరాల వయసులో మరణించారు.[4] వారు మరణించినప్పుడు వారు ఒక సంపూర్ణ విశ్వాసిగా మరణించారు. వారిని మక్కాలో హజూన్ అనబడే స్మశానంలో సమాధి చేశారు. తరువాత కాలంలో ఆ స్మశానం పేరు “ఖబ్రిస్తానె అబూతాలిబ్” గా ప్రఖ్యాతి చెందింది. వారి మరణంతో దైవప్రవక్త(స.అ) మరియు అప్పుడు ఉన్న ముస్లిములు వారి సంఖ్య 50 మంది కన్న తక్కువ, వారు తమ సంరక్షకుడిని కోల్పోయారు.
ఇబ్నె కసీర్ కథనం ప్రకారం: “అబూతాలిబ్ మరణాంతరం ఖురైష్ కు చెందిన అవిశ్వాసులు దైవప్రవక్త(స.అ) తల పై మట్టి పోసే వారు”.[5]
దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించెను: “అబూతాలిబ్ ప్రాణాలతో ఉన్నంత వరకు ఖురైషీయులు నన్ను ఎటువంటి కష్టానికి గురిచేయలేకపోయారు”[6].  

జనాబె అబూతాలిబ్(అ.స) విశ్వాసం ఇమామ్ సాదిఖ్[అ.స] దృష్టిలో
దైవప్రవక్త(స.అ) పితామహులైన అబ్దుల్ ముతల్లిబ్ మరణానంతరం వారి పోషణ బాధ్యతను ఇమామ్ అలీ(స.అ) యొక్క తండ్రి జనాబె అబూతాలిబ్ తీసుకున్నారు. దైవప్రవక్త(స.అ) చిన్నతనం నుండే జనాబె అబూతాలిబ్ ఇంట్లో ఉన్నారు. పెద్దవారై ముహమ్మద్ ముస్తఫా(స.అ) అల్లాహ్ ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు మరియు కుమారుడు అలీ దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారిగా ఎన్నుకోబడ్డారు. ఒకవేళ వారే అవిశ్వాసులై ఉంటే వారి పెంపకంలో పెరిగిన పిల్లలు పెద్దవారై అల్లాహ్ మరియు ఆయన పట్ల విశ్వాస ప్రచారం ఎలా చేయగలరు? వారి ఈమాన్ గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్(స.అ) తమ పితామహులైన హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా నుండి హదీస్ ను ఇలా ఉల్లేఖించారు: “నిస్సందేహంగా అబూతాలిబ్ ఉపమానం అస్హాబె కహఫ్ వంటిది, వారు లోపల ఈమాన్ ను దాచిపెట్టి పైకి దానికి వ్యతిరేకంగా వ్యక్తం చేసేవారు, అయితే వారికి అల్లాహ్ రెండు పుణ్యాలు ప్రసాదిస్తాడు”[7]

రిఫరెన్స్
1. ఇబ్నె సబ్బాగె మాలికీ, అల్ ఫుసూలుల్ ముహిమ్మహ్, పేజీ30.
2. అబుల్ ఫరజె నూరుద్దీన్, సీరయె హలబీ, భాగం1, పేజీ184.
3. ఖునైజీ, అబ్దుల్లాహ్, అబూతాలిబ్ మోమినె ఖురైష్, పేజీ116.
4. ఇబ్నె అసీర్, కామిల్, భాగం1, పేజీ507.
5. ఇబ్నె కసీర్, బిదాయహ్ వ నిహాయహ్, భాగం3, పేజీ120., ఇబ్నె అసీర్,అల్ కామిల్, భాగం1, పేజీ507.
6. ఇబ్నె అసీర్,అల్ కామిల్, భాగం1, పేజీ507.
7. కులైనీ, ఉసూలె కాఫీ, భాగం1, పేజీ244, గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ698.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26