షాబాన్ మాసం యొక్క సందర్భాలు మరియు ఈ మాసంలో జరిగిన సంఘటనల సంక్షిప్త వివరణ...

ఇస్లామీయ క్యాలండరు ప్రకారం షాబాన్ మాసం 8వ మాసం. ఇది చాలా ప్రాముఖ్యతగల మాసం. ఈ మాసం గురించి దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “شَعْبانُ شَهری; షాబాన్ నా మాసము” దైవప్రవక్త(స.అ) ఈ హదీస్ ద్వారానే మీరు ఈ మాసం ప్రత్యేకతను అర్ధంచేసుకోగలరు. ఈ మాసంలో కొంతమంది ప్రముఖులు జన్మించారు, వాటి వివరణ:
2వ తారీఖు: హిజ్రీ యొక్క 2వ సంవత్సరంలో రమజాన్ మాసం యొక్క ఉపవాస దీక్షలు వాజిబ్‌గా నిర్ధారించబడినవి. ఇదే రోజు హిజ్రీ యొక్క 255వ సంవత్సరంలో మోతజె అబ్బాసీ నరకవాసుడయ్యాడు. ఇతడి ఆదేశం వలనే ఇమామ్ అలీ నఖీ(అ.స)కు విషమివ్వడం జరిగింది.
3వ తారీఖు: హిజ్రీ యొక్క 4వ సంవత్సరంలో ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) జన్మించారు.
4వ తారీఖు: హిజ్రీ యొక్క 26వ సంవత్సరంలో ఖమరె బనీ హాషిమ్ హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) జన్మించారు. వారి తండ్రి హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) మరియు తల్లి పేరు హజ్రత్ ఉమ్ముల్ బనీన్ బింతె హిజామ్ కలాబియహ్.
5వ తారీఖు: హిజ్రీ యొక్క 38వ సంవత్సరంలో ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) జన్మించారు.
9వ తారీఖు: హిజ్రీ యొక్క 4వ సంవత్సరంలో అనగా ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ(అ.స) జన్మించిన 7వ రోజు అంటే వారి అఖీఖహ్ జరిగిన రోజు. ఈ రోజు దైవప్రవక్త(స.అ) గొర్రె ను ఇమామ్ హుసైన్(అ.స) అఖీఖహ్ రూపంలో బలిచ్చి వారి శిరాముండన చేసి ఆ వెంట్రుకలకు సమానంగా వెండిని దానం(సద్ఖా) ఇచ్చిన రోజు.
10వ తారీఖు: అబూ జాఫర్ సమరీ, తన మరణానిక ఆరు రోజుల ముందు హజ్రత్ సాహిబుల్ అమ్ర్(అ.స) వద్ద నుండి షియా ల కోసం తౌఖీ తీసుకొని వచ్చారు.
11వ తారీఖు: హిజ్రీ యొక్క 33వ సంవత్సరంలో ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క ప్రియ కుమారుడు, దైవప్రవక్త(స.అ) పోలికలు కలిగి ఉన్నటువంటి హజ్రత్ అలీ అక్బర్(అ.స) జన్మించారు. వారి తల్లి పేరు లైలా బింతె ముర్రహ్ సఖఫీ.
15వ తారీఖు: హిజ్రీ యొక్క 250వ సంవత్సరంలో ఖాతెముల్ ఔసియా, ముంతఖిమే ఆలె ముహమ్మద్(స.అ) మరియు అంతిమ ఇమామ్ హజ్రత్ హుజ్జత్ ఇబ్నిల్ హసన్(అ.స) జన్మించారు. తండ్రి దైవప్రవక్త(స.అ) యొక్క 11వ ఉత్తరాధికారి హజ్రత్ ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) మరియు తల్లి పేరు హజ్రత్ నర్జిస్ ఖాతూన్.
18వ తారీఖు: హిజ్రీ యొక్క 366వ సంవత్సరంలో ఇమామె హుజ్జత్(అ.స) యొక్క 3వ నాయబ్(ప్రతినిధి) జనాబ్ హుసైన్ ఇబ్నె నూహ్(రౌహ్) నౌబఖ్తీ బగ్దాల్ లో మరణించారు. వారిని అక్కడే ఖననం చేశారు.
19వ తారీఖు: హిజ్రీ యొక్క 6వ సంవత్సరంలో ముస్లిములు వెయ్యి మంది సైన్యంతో బనీ ముస్తలఖ్(మదీనహ్ మరియు మక్కా మధ్యలో ఉన్న ఒక ప్రదేశం) యుద్ధానికి వెళ్లారు. ఆ యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చారు.
షబాన్ మాసం లో జరిగిన ఇతర సంఘటనలు
1. హిజ్రీ యొక్క 45వ సంవత్సరంలో హఫ్సా మరణించారు. ఈమె ఉమర్ బిన్ ఖత్తాబ్ కుమార్తె మరియు దైవప్రవక్త(స.అ) యొక్క భార్యలలో ఒకరు. హజ్రత్ ఆయిషా ఆలోచనల మరియు కార్య నిర్వర్తనలలో సహచరురాలు.
2. హిజ్రీ యొక్క 6వ సంవత్సరంలో దైవప్రవక్త(స.అ), హజ్రత్ అలీ(అ.స) తో పాటు వంద మంది సైన్యంతో బనీ సఅద్ సమూహంతో యుద్ధానికి పంపారు, ఇస్లాం సైన్యం యుద్ధాని వస్తుంది అని తెలుసుకున్న ఆ సైన్యం అక్కడ నుండి ఫరారయ్యింది.
3. హిజ్రీ యొక్క 95వ సంవత్సరంలో ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క శిష్యుడు మరియు సహచరుడైన సయీద్ ఇబ్నె జబీరాన్ హజ్జాజ్ బిన్ యూసుఫె సఖఫీ హతమార్చబడ్డారు. సయీద్ చేసిన దుఆ ప్రకారం ఇది హజ్జాజ్ యొక్క చివరి హత్య ఆ తరువాత 15 నుండి 20 లోపే చికిత్స లేని వ్యాధితో నరకవాసుడయ్యాడు.
4. హిజ్రీ యొక్క 50వ సంవత్సరంలో ముగైరహ్ ఇబ్నె షొఅబహ్(లేదా షఅబహ్) నరకవాసుడయ్యాడు. ఇతడు వివరాలు మరియు చేసిన చర్యలు..
A. సహీఫయె మల్ఊనహ్ సహచరుల మరియు దైవప్రవక్త(స.అ) ను హతమార్చాలనుకున్న లైలతుల్ ఉఖబహ్ సమూహానికి చెందినవాడు.
B. సఖీఫహ్ లో ఉన్నటువంటి వాడు.
C. ఇమామ్ అలీ(అ.స) ఇంటి పై దాడి చేసిన వారిలో ఒకడు, ఇంటిని నిప్పంటించడంలో పాల్గొన్నవారిలో ఒకడు, హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పై దాడి చేసి హజ్రత్ మొహ్సిన్ మరణానికి కారణంగా నిలిచిన చర్యలో సహాయం చేసిన వారిలో ఒకడు.
D. ముఆవియహ్ కాలంలో ఇమామ్ అలీ(అ.స) పై లఅనత్ చేసిన వారిలో ఒకడు.
E. ఇస్లాంకు ముందు మరియు ఆ తరువాత వ్యభిచారంలో ప్రసిద్ధి చెందిన వారిలో ఒకడు.
F. తప్పుడు రివాయతులు మరియు హదీసులను తయారు చేయడం వారిలో ఒకడు. మొ...
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, ఆమాలె మాహె షాబాన్ అధ్యాయంలో.
https://www.erfan.ir/farsi/95888.html
వ్యాఖ్యానించండి