షాబాన్ మాసం ప్రతిష్టాత్మకమైన మాసం, అందులో కొన్ని ప్రత్యేక చర్యలు, పద్ధతలు నిర్వర్తించాల్సి ఉంటుంది, వాటి సంక్షిప్త వివరణ...

షాబాన్ మాసం ప్రతిష్టాత్మకమైన మాసం, అందులో కొన్ని ప్రత్యేక చర్యలు, పద్ధతలు నిర్వర్తించాల్సి ఉంటుంది, వాటి సంక్షిప్త వివరణ.:
1. ఇస్తిగ్ఫార్: ప్రతీ రోజు 70 సార్లు ఇలా “అస్తగ్ఫిరుల్లాహల్లజీ లా ఇలాహ ఇల్లా హువర్రహ్మానుర్రహీముల్ హయ్యుల్ ఖయ్యూమ్ అతూబు ఇలైహ్” చదివాలి.
2. ప్రతీరోజీ 100 సార్లు “సలవాత్” మరియు 100 సార్లు “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా” చదవాలి.
3. “మనాజాతే షాబానియహ్” ను చదవాలి. ప్రతీ రోజు జొహ్ర్ సమయంలో మరియు షబె నీమయె షాబాన్ లో చదవాలి. మునాజాత్ చాలా ప్రతిష్టాత్మకమైనవి మరియు ప్రసిద్ధమైనవి. పవిత్ర మూసూములందరూ చదివేవారు. ఇది ఉత్తమ ఇస్లామీయ జ్ఞానంతో కూడి ఉంది, ముఖ్యంగా మనిషి అల్లాహ్ తో ఎలా మునాజాత్ చేయాలి అన్న విషయం పై.
4. ప్రతీరోజు జొహ్ర్ సమయంలో ఇమామ్ సజ్జాద్(అ.స) సలవాత్ ను చదవాలి.
5. వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. మాసూమీనుల వచనానుసారం ఈ మాసంలో ఉండే ఉపవాసం “పెద్ద పెద్ద పాపాలకు పరిహారం”. ఇమామ్ సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: మొదటిరోజు ఉపవాసం ఉన్నవాడు, స్వర్గంలో ప్రవేశిస్తాడు. రెండు రోజులు ఉపవాసం ఉంటే, అల్లాహ్ రాత్రింబవళ్లు కారుణ్య దృష్టితో అతడిని చూస్తాడు. మూడు రోజులు ఉపవాసం ఉన్నవాడికి అల్లాహ్ నిండి మరియు స్వర్గంలో చూస్తాడు.
6. సద్ఖా ఇవ్వడం: ఇమామ్ సాదిఖ్(అ.స) ఉల్లేఖనం ప్రకారం: “అల్లాహ్, ఈ మాసంలో ఇవ్వబడే సద్ఖాను
పెంచుతూ ఉంటాడు, ప్రళయంనాటికి అది ‘ఒహద్’ కొండ మాదిరిగా కనబడుతుంది”.
7. 1000 సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు ముఖ్లిసీన లహుద్దీన్, వలౌ కరిహల్ ముష్రికూన్” అని చెప్పాలి.
8. ప్రత్యేక నమాజ్.. ఈ నెల యొక్క ప్రతీ గురువారం రెండు రక్అతుల నమాజ్ చదవాలి; ప్రతీ రక్అత్ లో ఒకసారి సూరయె ఫాతెహ్ మరియు 100 సార్లు సూరయె తౌహీద్; సలామ్ తరువాత 100 సార్లు సలవాత్. అల్లాహ్ ఇహపరలోకాల కోరికలను తీరుస్తాడు. ఇన్షా అల్లాహ్.
ఈ మాసంలో మన పద్ధతి మరియు ప్రవర్తన
1. పవిత్ర రమజాన్ మాసంను మంచిగా ఆహ్వానించడం. అనగా ఆత్మ పరంగా సిద్ధం కావడం. అలా చేయాలంటే ఈ మాసంలో మనం మనల్ని పూర్తి విధంగా రమజాన్ మాసం కోసం సిద్ధం చేసుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది.
2. ప్రజల పట్ల మంచి ప్రవర్తన మరియు తల్లిదండ్రుల కొరకు మంచి చేయడం.
3. మంచి పనులు చేయమని ఇతరులకు చెప్పడం మరియు చెడును నిషేదించడం.
షబే నీమయె షాబాన్ యొక్క ఆమాల్
షాబాన్ మాసం యొక్క 14వ రోజు రాత్రిని “షబే నీమయె షాబాన్”(అనగ అర్ధ షాబాన్ మాసం యొక్క రాత్రి) అని అంటారు. ఈ రాత్రిని “షబే బరాత్” అని కూడా అంటారు. పవిత్ర మాసూమీన్(అ.స)ల రివాయత్ లలో ఈ రాత్రి జాగరణ చేయాలని తాకీదు చేయబడి ఉంది.
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స)తో “షబే నీమయె షాబాన్” గురించి అడిగినప్పుడు వారు ఇలా ఉల్లేఖించారు: “ఈ రాత్రి ‘షబే ఖద్ర్’ తప్ప అన్ని రాత్రుల పై ప్రతిష్టాత్మకమైన రాత్రి, అందుకని ఈ రాత్రిని అల్లాహ్ సామిప్యాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ఈ రాత్రి అల్లాహ్ తన దాసులను కరుణించి వారి పాపములను క్షమిస్తాడు. ఈ రాత్రి ఎవ్వరినీ ఉట్టి చేతులతో పంపను కేవలం పాపమునకు సంబంధించిన కోరికలు గల వారిని తప్ప, అని అల్లాహ్ స్వయంగా తన పై ప్రమాణం చేశాడు.
ఈ రాత్రంతా నమాజ్, దుఆ మరియు ఇస్తిగ్ఫార్ చేస్తూ జాగరణ చేయడం వల్ల అతిగా పుణ్యం లభిస్తుంది. ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) ఉల్లేఖనం: “ఎవరైతే ఈ రాత్రి జాగరణ చేస్తాడో, అందరి హృదయాలు అజీవంగా ఉండే రోజున అతడి హృదయం జీవముగా ఉంటుంది”
రిఫ్రెన్స్
https://khunahad.ir/فضیلت-و-اعمال-مشترک-ماه-شعبان/
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, షాబాన్ మాసం ఆమాల్ అధ్యాయంలో. రివాయత్లు బిహారుల్ అన్వార్, ఖిసాల్ లాంటి ప్రముఖ పుస్తకాల నుండి.
https://www.erfan.ir/farsi/95888.html
వ్యాఖ్యానించండి