హుసైన్ (అ.స) ఎవరు?

మంగళ, 02/21/2023 - 17:51

కర్బలా మైదానం(భూమి) లో ఇమామ్ హుసైన్ (అ.స) తమ ఆత్మను బలిచ్చి మనకు ఆత్మగౌరవం, శాంతి ప్రియం మరియు చివరి శ్వాస వరకు సిధ్ధాంతాల పై ఓర్పు, సహనం మరియు ధైర్యం తో నిలబడాలని ఉపదేశించారు.

హుసైన్ (అ.స) ఎవరు?

అనంతకరుణామయుడు అపార కృపాసీలుడయిన అల్లాహ్ పేరుతో

సాధారణంగా ఇమామ్ హుసైన్(అ.స) పేరు వినని వారు వుండరు. మీరు ప్రతీ సంవత్సరం ముహర్రం నెలలో ఒక వర్గం వారిని నల్లదుస్తులు ధరించి క్షోభతో హుసైన్ హుసైన్ అంటూ గుండెలు బాదుకుంటూ రోడ్ల పై చూసేవుంటారు. వారిని చూసినప్పుడల్లా ఇంతకి ఈ హుసైన్ ఎవరూ?, ప్రతీ సంవత్సరం ఎందుకు ఇతనికి శ్రధ్ధాంజలి ఘటిస్తారు? అనే ప్రశ్నలు మీలో కలిగి వుండొచ్చు. ఈ రోజు ఆ మహాత్ముని జన్మదినము ఈ సంధర్బముగా ఇమామ్ హుసైన్(అ.స) గురించి సంక్షిప్తంగా మీ ముందు:

దైవప్రవక్త ముహమ్మద్(స.అ.స) అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త. అల్లాహ్, వారికి మార్గదర్శి అంతిమ పుస్తకం అయిన ఖుర్అన్ మరియు అంతిమ ధర్మాన్ని ప్రసాదించి పంపెను. వారు ప్రచారించిన ధర్మం పేరు ఇస్లాం ధర్మం. ఆ ప్రవక్త కు ఒక కుమార్తె ఆమె పేరు ఫాతెమా జహ్‌రా(స.అ). ఆమెలో వుండే ఉన్నత స్వభావాల వలన ప్రవక్త ముహమ్మద్(స.అ.స) అమెను ఆదరించే వారు, ఆమె ప్రవక్త (స.అ.స) వద్దకు వచ్చినప్పుడల్లా నిలబడి తమ కుమార్తేను గౌరవించేవారు. ఆమె వివాహం ప్రవక్త పినతండ్రి కుమారుడయిన హజ్రత్ అలీ(అ.స) తో జరిగింది. వారు ప్రవక్త తమ్ముడు మరియు అల్లుడే కాకుండా అల్లాహ్ తరపు నుండి నియమించ బడ్డ ఇమామ్(మత నాయకుడు) మరియు దైవప్రవక్త యొక్క అసలైన ఉత్తరాధికారి. హజ్రత్ అలీ(అ.స) మరియు జనాబె ఫాతెమా జహ్‌రా(స.అ) లకు  ఇద్దరు కుమారులు, ఇమామ్ హసన్(అ.స) మరియు ఇమామ్ హుసైన్(అ.స). వారు దైవ ప్రవక్త అయిన ముహమ్మద్(స.అ.స) మనుమలు, ఇమామ్ హుసైన్(అ.స)తమ సోదరుడు ఇమామ్ హసన్(స.అ) తరువాత అల్లాహ్ తరపు నుండి నియమించబడ్డ ఇమామ్, ప్రవక్త గారి ఉత్తరాధికారి.

అపకారి, త్రాగుబోతు, హింసకుడు మరియు నిర్దోషులను చంపిన ఘాతకుడయిన యజీద్, అప్పట్లో షామ్(సిరియా) అధిపతిగా వుండేవాడు. ఇలాంటి నీచుడైన యజీద్ తనతో బైఅత్(అనగా తన అజ్ఞానుగుణంగా  వుంటానని ప్రతిజ్ఞ చేయడం) చేయమని ఇమామ్ హుసైన్(అ.స) ను బెదిరించాడు. ప్రవక్త ముహమ్మద్(స.అ.స) ఉత్తరాధికారి మరియు ముస్లిముల ఇమామ్ అయిన ఇమామ్ హుసైన్(అ.స) యజీద్ లాంటి వాడితో ప్రమాణానికి సిధ్ద పడలేదు. అందుకు యజీద్ సైన్యం, వారి పై దాడి చేసి 1400 సంవంత్సరాల క్రితం ముహర్రం నెల 10వ తారీకు హిజ్రీ శకం 61వ సంవత్సరంలో కర్బలా భూమి పై మూడు రోజుల పాటు అన్నపానియాలకు దూరంగా వుంచి వారిని, వారి ప్రాణ స్నేహితులను, అన్నదమ్ములను, వారి కుమారులను, చివరికి 6 నెలల పసిబిడ్డను బాణాలతో, ఖడ్గాలతో అన్యాయంగా నరికి చంపేశారు. ఆ తరువాత వారి స్త్రీల డేరాలకు నిప్పంటించారు. వారిలో జ్వరంతో వున్న ఇమామ్ హుసైన్(అ.స) కుమారునీకి కాళ్ళూ చేతులలో సంకెళ్ళు మెడలో ముళ్ళకంఠహారం వేసి, మిక్కిలి క్షోభతో నిస్సాహాయులుగా మిగిలి వున్న ప్రవక్త ముహమ్మద్(స.అ.స) కుటుంబ స్త్రీల ను మరియు చిన్న పిల్లలను బంధించి అవమానించడానికై ఒక పట్టణం నుండి మరో పట్టణానికి త్రిప్పారు. మనసుని కలచివేసే ఈ సంఘటననే స్మరిస్తూ యావత్ ప్రపంచానికి సత్య అసత్యాల మధ్య బేధాన్ని తెలియచేయుటకు, ఇస్లాం కోసం ప్రాణలను ఆనందంగా త్యాగం చేసేవారెవరో మరియు పైకి ఇస్లాం దూస్తులు ధరించి ఇస్లాం ఆజ్ఞలను వ్యతిరేకించువారు ఎవరో తెలియాలి అని ఇలా ప్రతీ సంవత్సరం శ్రధ్ధాంజలి ఘటించడానికి ముఖ్యకారణం.

ఇస్లాం, హింస మరియు హింసాకారులకు విరుధ్ధం. ఇస్లాం ఎల్లప్పుడూ సత్యం, ధర్మం మరియు శాంతి సందేశాన్నే ఇస్తుంది. చూడడానికి యజీద్ మరియు అతడి సైన్యం ముస్లిములే కాని వాళ్ళకు ఇస్లాం ఉపదేశలతో ఎటువంటి సంబంధం వుండేది కాదు. ఈనాడు ఇస్లాం పేరున యమన్, సిరియా, ఇరాక్ మరియు బెహ్‌రైన్ లో ఏపాపము ఎరగని అమాయకులను చంపుతున్నారు, వీళ్ళూ ఆ యజీదియులతో సమానం. వీళ్ళు కూడా యజీద్‌ వలే కేవలం పేరుకు మాత్రం ముస్లిం జిహాదీలు. తమని తాము వహాబీ మరియు సలఫీ అంటారు కాని నిజానికి వీళ్ళు ఏజాతికీ సంబంధం లేనివారు. మతం పేరుతో జరుగుతున్న రాజకీయ మరియు బలాబలాల యుధ్ధం ఇది. ప్రపంచ ముస్లింలందరూ వాళ్ళను అసహ్యించుకుంటున్నారు. ప్రవక్త ముహమ్మద్ (స.అ.స) గారి నిజమైన ఉత్తరాధికారి అయిన ఇమామ్ హుసైన్(అ.స)తో యజీద్ బైఅత్ చేయించుకోవడానికి ప్రయత్నించాడు కాని ఇమామ్ హుసైన్(అ.స) అన్యాయానికి విరుధ్ధంగా మౌన పోరటం చేస్తూ తమ జన్మస్ధలమైన మదీనాను విడిచి ఏదిక్కులేనివానిగా వుండడానికైనా రాజీపడ్డారు గాని ఆ హింసావాదితో ప్రమాణాన్ని అంగీకరించలేదు. మదీనాను విడిచినపుడు ఇమామ్ హుసైన్(అ.స) “నేను (యజీద్‌ని వెతిరేకిస్తూ) గర్వంతో గాని లేదా దౌర్జన్యానికై గాని మదీనాను వీడవడం లేదు, నేను నా తాతాగారైన ప్రవక్త ముహమ్మద్(స.అస) వుమ్మత్ మేలు కోరకు బయలుదేరాను” అని అన్నారు.

ఇమామ్ హుసైన్(అ.స) యుధ్ధాని కి కూడా యజీదియులు దాడి చేయనంత వరకు కత్తి చేతపట్టలేదు. చివరిక్షణాల వరకు “బ్రతుకూ ఇతరులను బ్రతక నివ్వు” అనే తమ సిధ్ధాంతాలను పాటిస్తూనే వున్నారు. కర్బలా మైదానం(భూమి) లో ఇమామ్ హుసైన్ (అ.స) తమ ఆత్మను బలిచ్చి మనకు ఆత్మగౌరవం, శాంతి ప్రియం మరియు చివరి శ్వాస వరకు సిధ్ధాంతాల పై ఓర్పు, సహనం మరియు ధైర్యం తో నిలబడాలని ఉపదేశించారు. అందుకే షియా ముస్లింలు వారి ఉపదేశాలు మరవకూడదని, అందరికి తెలియాలని ప్రతీ సంవత్సరం వారిని స్మరిస్తూ వుంటారు.  వారి చరిత్ర మరియు ఉపదేశాలు కేవలం ముస్లింలకే కాకుండా నాగరికత, సంస్కృతి ఎదుగుదల కోరే ప్రతీ ఒక్కరికి ఉత్తమమైనవి.

 ఈ రోజు అలాంటి మహాత్ముని జన్మదినము మా మీ అందరికి మంగళప్రదం కావాలి అని మనసారా కోరుతున్నాము.

ఇమామ్ హుసైన్ (అ.స) ఉపదేశాలు
1. అప్రతిష్ఠ జీవితం కన్నా చావు మిన్న

2. నేను గౌరవంగా చావడానికి జీవితం అనుకుంటాను మరియు అవమానంతో జీవితాన్ని గడపడం నా వుద్దేశంలో చావడంతో సమానం.

3. నేను చావుని సౌభాగ్యం మరియు దుర్మార్గులతో జీవించడాన్ని కష్టం అని భావిస్తాను.

4. నేను (యజీద్‌ని వెతిరేకిస్తూ) ఇల్లు వదలడానికి కారణం గర్వం, తిరుగుబాటు మరియు దౌర్జన్యానికి కాదు, నేను నా తాతా గారి వుమ్మత్ మేలు కోరకు బయలుదేరాను. నేను జానాన్ని చెడు నుండి ఆపి రుజు మార్గం వైపుకు పిలుపునివ్వాలనుకుంటున్నాను. నా తాతా గారు ప్రవక్త ముహమ్మద్ మరియు తండ్రి అలీ ఇబ్నె అబీతాలిబ్ గారి మార్గంపై నడవాలని అనుకుంటున్నాను.

5. ఓ అబూసుఫియాన్ (యజీద్ తాతా)ల సంతాన అనుచరులారా ఒకవేళ మీ వద్ద ధర్మం(దీన్) లేక పోయిన, ప్రళయభయం లేకపోయినా, ఈ లోకంలోనైనా సజ్జనునిగా వుండండి.

6. అల్లాహ్ పట్ల భయభీతితో రోధన, నరకం మంటల నుండి విముక్తిని ఇస్తాయి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16