హజ్రత్ ఉమ్ముల్ బనీన్(అ.స)

శుక్ర, 02/24/2023 - 12:26

హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) యొక్క తల్లి హజ్రత్ ఉమ్ముల్ బనీన్(అ.స) గురించి సంక్షిప్త వివరణ...

హజ్రత్ ఉమ్ముల్ బనీన్(అ.స)

పేరు: ఫాతెమా
కున్నియత్: ఉమ్మల్ బనీన్
భర్త: హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)
తండ్రి: హిజామ్
తల్లి: సమామహ్(లేదా లైలా)
సంతానం: అబ్బాస్(అ.స), అబ్దుల్లాహ్, జాఫర్ మరియు ఉస్మాన్(ఈ నలుగురు కూడా కర్బలాలో ఇమామ్ హుసైన్(అ.స)తో పాటు ఇస్లాం రక్షణకై వీరమరణం పొందారు).
సమాధి: జన్నతుల్ బఖీ(మదీనహ్).
ఉమ్ముల్ బనీన్ జన్మించిన తారీఖును చరిత్ర కారులు ఎక్కడా ఉల్లేఖించలేదు. అందువల్ల ఆమె జన్మదినం ఎవరికీ తెలియదు. కాని ఆమె తండ్రీ, తాతముత్తాతలు మరియు మావయ్యలందరూ ఇస్లాం రాకా ముందు “అరేబీయా దేశపు వీరులు” అని చరిత్ర నిదర్శిస్తుంది. అలాగే వాళ్ళ వీరత్వం గురించి కథలుగా చెప్పుకునే వారు. అంతేకాకండా వాళ్ళ వీరత్వంతో పాటు తమ సమూహానికి నాయకత్వం కూడా వహించే వారు. వారి కాలపు అధికారులు వారి మాటను రద్దు చేసే వారు కాదు, వాళ్ళను చాలా గౌరవించే వారు. వీళ్ళ గురించి అరబ్ యొక్క వంశాల గురించి బాగా తెలిసిన అఖీల్ ఇబ్నె అబీతాలిబ్ తన సొదరుడు అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)తో ఇలా అన్నారు: “అరబ్ లో ఆమె పూర్వీకులకు మించిన వీరులు దొరకరు”[1]

వివరణ:

జనాబె ఉమ్ముల్ బనీన్(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క మొదటి ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ(అ.స) యొక్క భార్య. ఈమె కర్బలా యుద్ధంలో ఇస్లాం రక్షణకై తన ప్రాణాలు అర్పించిన హజ్రత్ అబ్బాస్ ఇబ్నె అలీ(అ.స) యొక్క తల్లి. హజ్రత్ ఫాతెమా జహ్రా(అ.స) మరణాంతరం హజ్రత్ అలీ(అ.స) అరబ్ దేశ వాసుల వంశాల పై మంచి అవగాహన ఉన్న తన సోదరుడు అఖీల్ సలహా ప్రకారం ఉమ్ముల్ బనీన్ తో వివాహమాడారు. ఈమెకు నలుగురు కుమారులు, వారు పేర్లు అబ్బాస్, జాఫర్, అబ్దుల్లాహ్ మరియు ఉస్మాన్. వీళ్ళందరూ కర్బలాలో ఇస్లాం రక్షణకై వీరమరణం చేందారు.
జనాబె ఉమ్ముల్ బనీన్(అ.స) కర్బలా సంఘటన వార్త విన్న తరువాత ప్రతీ రోజు మదీనహ్ లో ఉన్న “బఖీ” అనబడే స్మసానానికి వెళ్ళి వారి వీరమరణాన్ని, త్యాగాలను తలుచుకుంటూ మర్సియా చదివే వారు. ఆమె పఠనకు చుట్టుప్రక్కల వారు వచ్చేవారు మరియు వారి ఆమె పఠనకు ప్రభావితులయ్యేవారు. ఒక ఉల్లేఖన ప్రకారం కనికరం ఎరగని హృదయంగల మర్వాన్ ఇబ్నె హకమ్ కూడా ఆమె కవిత్వాలను మరియు మర్సియాలను విని అగిపోయేవాడు మరియు ఏడ్చేవాడు. ఇలా ఆమే రోధన తాను జీవించినంత కాలం సాగింది.[2] చివరికి ఆమె జుమదస్సానియహ్ యొక్క 13వ తారీఖు, హిజ్రీ యొక్క 64వ సంవత్సరంలో మరణించారు.[3]

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) మరణించిన తరువాత, అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) తన సోదరుడు అఖీల్ ను పిలిచి అతనితో తన కోసం వీరుని జన్మనిచ్చేందుకు వీరుల వంశం నుండి ఒక స్ర్రీని వివాహమాడడానికై కోరారు. అఖీల్ ఇబ్నె అబీతాలిబ్, “ఫాతెమా కలాబియహ్”ను ఇమామ్ అలీ(అ.స)తో వివాహం కోసం ఎంచుకున్నారు. ఈమె “బనీ కిలాబ్” సమూహానికి చెందినవారు, ఈ వంశం మరియు సమూహం తమ వీరత్వంలో సాటి లేని వారు. హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) కూడా వారి నిర్ణయాన్ని అంగీకరించారు.
ఆ తరువాత ఇమామ్ అలీ(అ.స) అఖీల్ ను ఉమ్ముల్ బనీన్ తండ్రి వద్దకు పంపారు. తండ్రి ఈ వార్తను విని చాలా సంతోషించారు, అతను తన ఆతురతతో కుమార్తే వద్దకు వచ్చి ఆ శభవార్తను చెప్పారు, ఉమ్ముల్ బనీన్ కూడా చాలా గౌరవంగా మరియు ప్రతిష్ఠతగా ఒప్పుకున్నారు. అలా ఆమె వివాహం ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)తో జరిగింది.
ఇమామ్ అలీ(అ.స) అమెలో ఉన్న వివేకాన్ని, దృడమైన విశ్వాసాన్ని, మంచి స్వభావాన్ని, పవిత్రను చూశారు మరియు ఆమెను గౌరవించేవారు మరియు ఆమె ప్రతిష్ఠతను నిరంతరం కాపాడేవారు.[4]         

ఉమ్ముల్ బనీన్(అ.స) ఇమామ్ అలీ(అ.స) ఇంట్లో మొదటి అడుగు పెట్టిన రోజున, ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్(అ.స) ఇద్దరూ అనారోగ్యంతో ఉన్నారు. వారి మంచం పై విశ్రాంతి తీసుకుంటున్నారు. అబూతాలిబ్ కోడలు ఇంటికి వచ్చీ రాగానే వారిద్దరి వద్దకు వెళ్ళారు, కన్న తల్లిలా వారితో ప్రేమగా మసలుకొని వారికి సేవలు చేశారు.
ఫాతెమా కలాబియహ్, ఇమామ్ అలీ(అ.స) తో కొంత కాలం గడిపిన తరువాత, అతనితో నన్ను నా అసుల పేరు “ఫాతెమా” కు బదులు ఉమ్మలు బనీన్ అని పిలవమని కోరారు. ఎందుకంటే హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పిల్లలు ఆమె అసలు పేరు తమ తండ్రి నోట వింటే వారికి తమ తల్లి ఫాతెమా జహ్రా(స.అ) గుర్తుకు రావచ్చు, అలా వారికి జరిగిన సంఘటనుల గుర్తుకు రావచ్చు, మరియు తల్లి లేని బాధ కలగవచ్చు. ఇలా అవ్వకూడదని అనుకుంటున్నాను. అని అన్నారు.
ఉమ్ముల్ బనీన్ ప్రవర్తన ఫాతెమా జహ్రా(స.అ) సంతానం కోసం ఆమె లేని లోటును తీర్చేసింది. పిల్లలు ఉమ్ముల్ బనీన్(అ.స) లో తమ తల్లి ఫాతెమా జహ్రా(అ.స) ను చూసేవారు. ఉమ్ముల్ బనీన్, దైవప్రవక్త(స.అ) కుమార్తె పిల్లలను తన పిల్లల కన్న ఎక్కవగా ప్రేమించేవారు, మరి ఇలా చేయడం ధర్మకర్తవ్యంగా భావించే వారు. ఎందుకంటే అల్లాహ్ తరపు నుండి పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో వారి పట్ల ప్రేమగా ఉండమని ఆదేశం కూడా ఉంది కాబట్టి.[5]         

రిఫ్రెన్స్
1. ఉమ్ముల్ బనీన్ బానూయే మర్ద్ ఆఫరీన్, పేజీ50, మజల్లాహ్, గుల్ బర్గ్, ముర్దాద్ 1382, షుమారహ్41.
2. సయ్యద్ మహ్దీ సవీజ్, ఉమ్ముల్ బనీన్ [అ.స] సయ్యిదతున్నిసాయిల్ అరబ్, పేజీ84.
3. జబీహుల్లాహ్ మహల్లాతీ, రియాహీనుష్షరీఅహ్, భాగం3, పేజీ294.
4,5. ఉమ్ముల్ బనీన్ బానూయే మర్ద్ ఆఫరీన్, పేజీ50, మజల్లాహ్, గుల్ బర్గ్, ముర్దాద్ 1382, షుమారహ్41.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6