దైవప్రవక్త[స.అ] యొక్క ఇస్మత్

శని, 01/27/2018 - 16:34

.దైవప్రవక్త[స.అ] ఇస్మత్ కలిగి ఉన్నారా లేదా అన్న విషయంలో ముస్లిములలో అభిప్రాయబేధం ఉంది. దాని సంక్షిప్త వివరణ.

దైవప్రవక్త[స.అ] యొక్క ఇస్మత్

ఇస్మత్ అనగ ప్రతీ అశుద్ధత మరియు అపవిత్రత నుండి దూరంగా ఉండడం. ఇస్మత్ కలిగి ఉన్న వారిని “మాసూమ్” అంటారు. దైవప్రవక్త[స.అ] యొక్క ఇస్మత్ క్రమంలో ముస్లిములు వివిధ అభిప్రాయాలు కలిగివున్నారు. “ఇస్మత్, ముస్లిముల పై దైవప్రవక్త[స.అ] ఆదేశాలను నిస్సందేహంగా అంగీకరించడానికి విధిగా నిర్ధారింతే ఒక యదార్ధం”. ముస్లిములు దైవప్రవక్త[స.అ] గురించి ఇలా నమ్ముతారు, దైవప్రవక్త[స.అ] తన ఇష్టానుసారం ఏదీ చెప్పారు. అతను చెప్పేది అతని పై అవతరించే “వహీ”యే. కనుక ఒకవేళ ముస్లిములు దైవప్రవక్త[స.అ] ఉపదేశాలు, అహ్కాములు “వహీ” మరియు ఖుర్ఆన్ కాకుండా ఉంటే అవి వారి సొంత అభిప్రాయాలయి ఉండేవి మరి ఎవ్వరూ వాటిని విశ్వసించేవారు కాదు.
ముస్లిములలో కొందరు “అన్నీ అల్లాహ్ తరపునుండే, దైవప్రవక్త[స.అ] కేవలం ప్రవచించే మరియు వార్తను అందజేసే వారు” అని నమ్ముతారు. సహాబీయులలో చాలా సహాబీయులు కూడా ఇలానే విశ్వసించేవారు.
మరి కొందరు “దైవప్రవక్త[స.అ] తమ ప్రవచనములలో మరియు కృత్యములలో ఇస్మత్ కలిగిలేరు అనగా మాసూమ్(పవిత్రులు) కారు, కేవలం ఖుర్ఆన్ ప్రచారం మరియు దాని ఆయత్
లు చదివే సమయంలో మాత్రమే ఇస్మత్ కలిగి ఉన్నారు మిగిలిన వాటిలో సాధారణ మానవులతో సమానం; వారు మంచి పనులూ చేస్తారు మరియు తప్పులు కూడా చేస్తారు” అని నమ్ముతారు.
బుద్ధివివేక మరియు “షరా” పరంగా మాసూమ్(పవిత్రులు) కాని వారి విధేయత మరియు అనుచరణ విధి కాదు. ఎప్పటి వరకు మేము దైవప్రవక్త[స.అ] నుండి తప్పులు సంభవిస్తాయి అని విశ్వసిస్తామో అప్పటి వరకు ఆయన విధేయత మన పై వాజిబ్ అవ్వదు. మరి అపరాధి పట్ల ఎలా విధేయతగా ఉండగలం.[అల్ షీయా హుమ్ అహ్లుస్సున్నహ్]

రిఫ్రెన్స్
తీజానీ సమావీ, అల్ షీయా హుమ్ అహ్లుస్సున్నహ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9