దైవప్రవక్త(స.అ) కు పోయి ఉండే హజ్రత్ అలీ అక్బర్(అ.స) గురించి సంక్షిప్త వివరణ...

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
అలీ అక్బర్(అ.స) షాబాన్ నెల 11వ తేదీన జన్మించారు. ఇతను ఇమామ్ హుసైన్(అ.స) యొక్క కుమారుడు. ఇతను దైవప్రవక్త(అ.స)కు పోలి ఉండేవారు. ఇతను ఆషూరా రోజు కర్బలా యుద్ధంలో ఇస్లాం మరియు మానవత్వ విలువలను రక్షించడానికై తన ప్రాణాలను అర్పించారు. ఇతని వయసు కర్బలా యుద్ధం సమయంలో 25 సంవత్సరాలు. కొందరు 18 సంవత్సరాలని మరికొందరు 20 సంవత్సరాలని కూడా ఉల్లేఖించారు. ఇతను బనీ హాషిం నుండి అందరి కన్న ముందు తన ప్రాణాలను అర్పించారు.
ఇతని వీరత్వం, ధైర్యం, వివేకం, దీన్ పట్ల అవగాహనా, విధేయత కర్బలా ప్రయణంలో ముఖ్యంగా ఆషూరా రోజున స్పష్టంగా తెలిసొచ్చింది. అతని మాటలే దీనికి నిదర్శనం. ఇమామ్ “ఖస్లు బనీ మకాతిల్” అన్న విశ్రాంతి నిలయం దాటిన తరువాత ఇమామ్ హుసైన్(అ.స) తమ గుర్రం పైనే నిద్రలో జారుకున్నారు, కొద్దిసమయంలోనే కళ్ళు తెరిచి మూడు సార్లు “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్” మరియు “అల్ హందు లిల్లాహ్” అన్నారు. అలీ అక్బర్(అ.స) తన తండ్రితో దానికి కారణం అడగగా ఇమామ్ ఇలా అన్నారు: “నేను స్వప్నంలో ఒక రౌతును ‘ఈ సమూహం మరణం వైపుకు ప్రయాణిస్తుంది’ అంటుండగా చూశాను. అలీ అక్బర్(అ.స) “మేము యదార్థం వైపు లేమా!” అని అడిగారు. దానికి ఇమామ్: “ఎదుకనీ లేమూ” అన్నారు. అప్పడు అలీ అక్బర్ “అయితే సన్మార్గంలో ప్రాణాలు అర్పించడానికి భయమేందుకు!” అని అన్నారు.
అలాగే ఆషూరా రోజున యుద్ధానికి వెళ్ళేందుకు అందరి కంటే ముందు అనుమతి కోరింది కూడా ఇతనే. ఇతనిని యుద్ధానికి పంపించడం అహ్లెబైత్(అ.స) మరియు ఇమామ్ కు చాలా కష్టం అనిపించింది. ఇతను ఆషూరా రోజున తన వీరత్వంతో కూడిన దాడితో శత్రువుల హృదయాలను భయానికి గురిచేశారు. ఒకసారి తండ్రి వద్దకు వచ్చి తరిగి యుద్ధానికి వెళ్ళారు, చివరి శ్వాస వరకు శత్రువులతో పోరాడుతూనే ఉన్నారు. చివరికి “ముర్రహ్ ఇబ్నె మున్ఖజె అబ్దీ” అనేవాడు అతనిపై దాడి చేసి చంపాడు. శత్రువు అతని దేహన్ని కత్తులతో ఖండఖండాలు చేశారు.
ఇతని సమాధి కర్బలా పట్టణంలో తన తండ్రి సమాధి యొక్క పాదాల వద్ద ఉంది.[1]
షాబాన్ మాసం 11వ తేదిను ఇరాన్ దేశం మరియు పలు అహ్లెబైత్(అ.స) పట్ల విధేయత కలిగివున్న దేశాల వారు ఆ రోజులు “రోజె జవాన్” అంటే యువకుల రోజు అని నామకరించారు. ఉత్తమ యువకుడు, ఇతను తన యువ వయసులో అల్లాహ్ ఆరాధన మార్గాన్ని ఎన్నుకున్నారు, వృద్ధులకు మించిపోయారు. వారు ఖుర్ఆన్ పఠనాన్ని చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. కర్బలాలో వారి ప్రాణ త్యాగం, ఇస్లాం మరియు మానవాళి విముక్తి కోసం తన ప్రాణాల సైతం లేక్క చేయకుండా ఆకలితో శత్రువులతో పోరాడడం. అల్లాహ్, ఆయన ప్రవక్త(స.అ) మరియు తమ ఇమామ్ పట్ల విధేయతకు నిదర్శనం.
అందుకని ఈనాటి యువకులకు హజ్రత్ అలీ అక్బర్(అ.స) ను తమ ఐడియల్ గా చేసుకొని తమ యువ వయసుకు అర్థం ఉండేలా తీర్చిదిద్దుకోవాలి. అల్లాహ్ మనందరిని అల్లాహ్ కోసం జీవితాన్ని గడిపే యోగ్యత ప్రసాదించు గాక...
రిఫ్రెన్స్
1. జవాదె ముహద్దిసీ, ఫర్హంగె ఆషూరా, పేజీ324, నష్రె మారూఫ్, ఖుమ్, 1374.
వ్యాఖ్యానించండి