ఇమామ్ మహ్దీ(అ.స) యొక్క పేరు, వారి వంశం మరియు వారి నాయకత్వం గురించి అహ్లె సున్నత్ గ్రంధాలలో....

దౌర్జన్యం మరియు క్రూరత్వంతో నిండిపోయిన ఈ లోకంపై చివరికి ఒక యుగ పురుషునికే అంతిమ విజయం వరిస్తుందని కేవలం ముస్లిములే కాకుండా అన్ని మతాలవారు విశ్వసిస్తారు. కేవలం ఖుర్ఆన్ లోనే కాకుండా అన్ని గ్రంధాలలో దీని ప్రస్థావన వచ్చింది, దివ్య ఖుర్ఆన్ లో అల్లహ్ ఈ విధంగా సూచించెను:
وَلَقَدْ كَتَبْنَا فِى ٱلزَّبُورِ مِنۢ بَعْدِ ٱلذِّكْرِ أَنَّ ٱلْأَرْضَ يَرِثُهَا عِبَادِىَ ٱلصَّٰلِحُونَ
సజ్జనులైన నా దాసులే భూమికి వారసులవుతారని మేము జబూర్(గ్రంథం)లో హితబోధ అనంతరం వ్రాసిపెట్టాము[సూరయె అంబియా, ఆయత్105].
వేరే చోట ఈ విధంగా సెలవిస్తున్నాడు:
وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى ٱلَّذِينَ ٱسْتُضْعِفُوا۟ فِى ٱلْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةًۭ وَنَجْعَلَهُمُ ٱلْوَٰرِثِينَ
“భువిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలనీ, వారికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనీ, వారిని (భూమికి) వారసులుగా చేయాలనీ మేము కోరుకున్నాం”[సూరయె ఖసస్, ఆయత్05].
కానీ అతని పేరేమిటి? మరియు అతను ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు? అన్న దానికి జవాబు హదీసులలొ దొరుకుతుంది, అహ్లె సున్నత్ హదీస్ పుస్తకాలలో సైతం ఇలాంటి హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి. దైవప్రవక్త(స.అ) ఈ విధంగా సెలవిస్తున్నారు: “ప్రళయం సంభవించదు కానీ నా అహ్లెబైత్[వంశం] నుండి ఒక వ్యక్తి అతని పేరు నా పేరు(ముహమ్మద్) అయి ఉంటుంది అతను నాయకత్వ భాద్యతలు స్వీకరిస్తాడు”.[1]
వేరే హదీసులో మహాప్రవక్త(స.అ) ఈ విధంగా ఉపదేశించారు: “అతని పేరు మహ్దీ మరియు అతను ఫాతిమ(స.అ) కుమారులలో నుండి అయ్యి ఉంటాడు”.[2]
ఇతర ఉత్తరాధికారుల లక్షణాలను ప్రస్థావిస్తూ దైవప్రవక్త(స.అ) ఈ విధంగా సెలవిచ్చారు: “నా తరువాత పన్నెండు మంది ఉత్తరాధికారులు ఉంటారు మరియు వారందరు ఖురైష్ వంశస్తులే”.[3]
ఇమామె ౙమాన్(అ.స) సహచరుల ధౌర్యసాహసాలు
హాకిమె నైషాబూరీ, మొహమ్మదె హనఫీయా ద్వార ఉల్లేఖిస్తూ ఇలా అనెను: మేము అలీ(అ.స) వద్ద ఉండగా ఒకవ్యక్తి హజ్రత్ ఇమామ్ మహ్దీ(అ.స) గురించి ప్రశ్నించాడు. ఇమామ్ అతడికి ఇలా సమాధానమిచ్చారు:
“ఆయన చివరి కాలంలో ఒక వ్యక్తి అల్లాహ్! అల్లాహ్! చంపబడాలి అని ప్రచారించినప్పుడు ప్రత్యేక్షమవుతారు. అప్పుడు అల్లాహ్ వారి కోసం ఒక సమూహాన్ని సంగ్రహిస్తాడు, వారందరూ మబ్బుల వలే విడివిడిగా ఉంటారు, వారి హృదయాలను అనుగుణంగా చేస్తాడు. వారు ఎవ్వరికి భయపడరు మరియు వారి జమాఅత్ లో ఎవరైనా చేరితే అది వారిని ఆనందింపజేయదు కూడా...”[4]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నేను, అలీ, హసన్, హుసైన్ మరియు హుసైన్ యొక్క తొమ్మిది మంది ఇమాములే పవిత్రులు మరియు మాసూములు”
అల్ జువైనీ, ఫరాయిదుల్ సమ్‌తైన్, బీరూత్1978, పేజీ160, అల్ జువైనీ యొక్క గొప్పతనం అల్ ౙహబీ యొక్క గ్రంథం “తజ్కిరతుల్ హుఫ్ఫాజ్, భాగం4, పేజీ298 మరియు ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ అల్ దురర్ అల్ కామినహ్, భాగం1, పేజీ67లో ఉల్లేఖించారు.
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నేను ప్రవక్తల నాయకుడిని మరియు అలీ ఇబ్నె అబీతాలిబ్ నా ఉత్తరాధికారుల నాయకుడు, నా తరువాత నా ఉత్తరాధికారులు పన్నెండు మంది, మొదటివారు అలీ ఇబ్నె అబీతాలిబ్ మరియు చివరి వారు మహ్దీ”[5]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “మహ్దీ మా అహ్లెబైత్ల నుండి ఒకరు మరియు మహ్దీ నా కుటంబానికి చెందినవారై ఉంటారు, ఫాతెమా యొక్క సంతానం నుండి”.[6]
దైవప్రవక్త(స.అ) హదీస్ అనుసారం అహ్లెసున్నత్ వారు 12 ఖలీఫాలను నమ్ముతున్నట్లైతే వారి పేర్లు ఏమిటీ?
దైవప్రవక్త(స.అ) అలీ(అ.స)తో ఇలా అన్నారు: “ఓ అబల్ హసన్! నిస్సందేహంగా నా తరువాత పన్నెండు నాయకులు... ఓ అలీ(అ.స) నువ్వు ఆ 12 నాయకుల నుండి మొదటి నాయకుడివి, ఆ తరువాత నీ మరణించే సమయంలో నా కుమారుడు హసన్ ను, అతడు హుసైన్ ను, అతడు సయ్యదుల్ ఆబెదీన్ ను, అతడు ముహమ్మద్ బాఖిర్ ను, అతడు మూసా అల్ కాజిమ్ ను, అతడు అలీ అల్ రిజా ను, అతడు ముహమ్మద్ అల్ తఖీను, అతడు అలీ అన్ నఖీ ను, అతడు హసన్ అల్ ఫాజిల్ ను, అతడు తన కుమారుడు ముహమ్మద్ ఖలీఫాగా నియమించండి.[7]
రిఫరెన్స్
1. ముస్నదే అహ్మద్ బిన్ హంబల్, భాగం1, పేజీ376.
2. సహీహ్ బుఖారి, భాగం4, కితాబుల్ అహ్కాం, పేజీ175.
3. సుననె ఇబ్నె దవూద్, భాగం4, ముస్తద్రకే హాకిం.
4. అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ598, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.
5. అల్ జువైనా, ఫరాయిదుల్ సమ్ తైన్, పేజీ160.
6. ఇబ్నె మాజహ్, అల్ సునన్, భాగం2, పేజీ519, హదీస్6. అబూదావూద్, అల్ సునన్, భాగం2, పేజీ207.
7. అల్ గైబహ్, షేఖ్ తూసీ, పేజీ150-151, హదీస్111.
వ్యాఖ్యానించండి