రమజాన్ మాసం యొక్క గొప్పతనం మరియు ప్రతిష్టత మాసూమీన్(అ.స) దృష్టిలో...

రమజాన్ మాసం అల్లాహ్ యొక్క ప్రత్యేక మాసం మరియు గొప్ప మాసం అని అందరికి తెలుసు. దాని గొప్పతనం తెలుసు కోవాలంటే గొప్ప వ్యక్తులు ఈ మాసం గురించి ఏమి చెబుతున్నారు అన్న విషయం తెలుసుకోవాలి.
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: రమజాన్ మాసం, అల్లాహ్ కు సంబంధించిన మాసం. అందులో “లా ఇలాహ ఇల్లల్లాహ్”, తక్బీర్, హంద్, తమ్జీద్ మరియు తస్బీహ్ లను ఎక్కువగా పఠించాలి.[1]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: రమజాన్ మాసంలో క్షమింపబడనివాడు, ఏ మాసంలో క్షమించబడతాడు!?[2]
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: రమజాన్ మాసం యొక్క ఉపవాసాలు మరియు ప్రతీ నెల ఉండే మూడు రోజుల ఉపవాసాలు, హృదయం యొక్క కలతా మరియు కట్రలను నాశనం చేస్తుంది.[3]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: రమజాన్ మొదలయ్యేటప్పుడు, దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించేవారు: “ఓ అల్లాహ్! రమజాన్ మాసం వచ్చేసింది. ఓ అల్లాహ్! ఓ ప్రభువా! రమజాన్ మాసం; ఎలాంటి మాసమంటే అందులో నువ్వు ఖుర్ఆన్ ను అవతరింపజేశావు మరియు దానిని రుజుమార్గం యొక్క స్పష్టమైన సంకేతాలు మరియు ఫుర్ఖాన్(సత్యఅసత్యాలను వేరు చేసేది) గా నిర్దారించావు. ఓ అల్లాహ్! రమజాన్ మాసంలో మా కోసం శుభంగా నిశ్చయించు మరియు అందులో మాకు ఉపవాస దీక్షలు మరియు నమాజులు నిర్వర్తించేందుకు సహాయం అందించు మరియు వాటిని మా నుండి స్వీకరించు.[4]
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: ఉపవాసం ఉన్న నీ సోదరుడికి ఇఫ్తార్ విందు ఇవ్వడం యొక్క ప్రతిష్టత, నీ ఉపవాస దీక్ష కన్న ఎక్కువ.[5]
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: ఒకవేళ ఉపవాసి తన నోరు, చెవులు, కళ్లూ మరియు ఇతర శరీర భాగాలను నియంత్రణలో పెట్టుకోకపోతే, ఆ ఉపవాసం అతడికి ఎటువంటి లాభాన్ని చేకూరుస్తుంది!?”[6]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చి పడితే, అతడు ఉపవాస దీక్షను నిర్వర్తించాలి; ఎందుకంటే అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “సహనం ద్వార సహాయాన్ని కోరండి”, అంటే ఉపవాసం ద్వార.[7]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “సహ్రీ తినండి, ఎందుకంటే సహ్రీలో శుభం ఉంది”[8]
ఇమామ్ సజ్జాద్(అ.స) ఉల్లేఖనం: ఇఫ్తారీ మరియు సహరీ తీసుకునే సమయంలో, “ఇన్నా అన్ జల్నా” నూరహ్ పఠించడం వల్ల, ఆ రెండింటికి మధ్య అతడు అల్లాహ్ మార్గంలో తన రక్తంతో తడిచిన వాడి మాదిరి.[9]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: మూడు విషయాలు అల్లాహ్ కారుణ్యం నుండి; జాగరణ చేసి రాత్రి సమయంలో నమాజ్ చదవడం, సోదరుల(విశ్వాసుల)తో కలవడం మరియు ఉపవాసం ఉండడం.[10]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం.. ఆకాశం యొక్క ద్వారములు రమజాన్ మాసం యొక్క మొదటి రాత్రికి తెరుచుకుంటాయి మరియు దాని చివరి రాత్రి వరకు మూయబడవు.[11]
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: రమజాన్ మాసంలో అల్లాహ్ గ్రంథం నుండి ఒక్క ఆయత్ పఠించినవాడు మిగత నెలలలో పూర్తి ఖుర్ఆన్ పఠించిన వారితో సమానం.[12]
రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం96, పేజీ381, హదీస్6.
2. బిహారుల్ అన్వార్, భాగం8, పేజీ185, హదీస్147.
3. బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ100, హదీస్24.
4. బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ340, హదీస్1.
5. బిహారుల్ అన్వార్, భాగం96, పేజీ317, హదీస్5.
6. మీజానుల్ హిక్మహ్, మొహమ్మద్, మొహమ్మదీ రయ్ షహ్రీ, భాగం6, పేజీ397.
7. బిహారుల్ అన్వార్, భాగం96, పేజీ254, హదీస్30.
8. బిహారుల్ అన్వార్, భాగం62, పేజీ292.
9. అల్ ఇఖ్బాల్, భాగం1, పేజీ240.
10. బిహారుల్ అన్వార్, భాగం96, పేజీ257, హదీస్41.
11. బిహారుల్ అన్వార్(తా-బీరూత్), భాగం93, పేజీ344.
12. బిహారుల్ అన్వార్(తా-బీరూత్), భాగం93, పేజీ341.
వ్యాఖ్యానించండి