దైవప్రవక్త[స.అ] ఇస్మత్

ఆది, 01/28/2018 - 07:12

."దైవప్రవక్త[స.అ] ఇస్మత్ కలిగిఉన్నారు వారు ఎటువంటి తప్పుడు పని చేయరు" అన్న విశ్వాసం సరైనా లేక “దైవప్రవక్త[స.అ] వహీ విషయంలోనే ఇస్మత్ కలిగి ఉన్నారు, మరి మిగిలిన విషయాలలో సాధారణ మానవుని వలే తప్పులు చేస్తారు” అన్న విశ్వాసం సరైనదా.

దైవప్రవక్త[స.అ] ఇస్మత్

“దైవప్రవక్త[స.అ] ఇస్మత్ కలిగిఉన్నారు మరియు అల్లాహ్ తరపు నుండి అవతరించే ఆదేశాలనే ప్రచారం చేస్తారు” అన్న ఈ మాట ద్వార స్పష్టంగా నిరూపితమయ్యే విషయమేమిటంటే ఈ విశ్వాసం కలిగి ఉన్న వారే అసలైన సున్నత్ అనుచరులు; ఎందుకంటే వారు ఒక మాసూమ్ మరియు పవిత్రమైన వ్యక్తి సున్నత్
ను అంగీకరించారు, అతని విధేయతను విధిగా భావించారు. స్పష్టమయ్యే ఇంకో విషయమేమిటంటే “దైవప్రవక్త[స.అ] వహీ విషయంలోనే ఇస్మత్ కలిగి ఉన్నారు, మరి మిగిలిన విషయాలలో సాధారణ మానవుని వలే తప్పులు చేస్తారు” అని నమ్మే వారు, దైవప్రవక్త[స.అ] సున్నత్ నుండి చాలా దూరంగా ఉంటారు; ఎందుకంటే వారు, సున్నత్
లో పొరపాటు జరిగింది మరియు దానిని వ్యతిరేకించడం జాయిజ్ మరియు సమ్మతిగా నమ్ముతారు:
كَانَ ٱلنَّاسُ أُمَّةٗ وَٰحِدَةٗ فَبَعَثَ ٱللَّهُ ٱلنَّبِيِّ‍ۧنَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِيَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ فِيمَا ٱخۡتَلَفُواْ فِيهِۚ وَمَا ٱخۡتَلَفَ فِيهِ إِلَّا ٱلَّذِينَ أُوتُوهُ مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَٰتُ بَغۡيَۢا بَيۡنَهُمۡۖ فَهَدَى ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ لِمَا ٱخۡتَلَفُواْ فِيهِ مِنَ ٱلۡحَقِّ بِإِذۡنِهِۦۗ وَٱللَّهُ يَهۡدِي مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٍ
అనువాదం: "మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారివెంట (అనగా ప్రవక్తల వెంట) సత్యబద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే) స్పష్టమైన అదేశాలు వొసగబడిన తరువాత కూడా పరస్పర వైరభావం, అసూయ మూలంగా అందులో విభేధించుకున్నారు. అందుచేత అల్లాహ్ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు".[బఖరా,213].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17