జాసియహ్ సూరహ్

ఆది, 01/28/2018 - 18:40

.పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క 45వ సూరహ్ అయిన “జాసియహ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

జాసియహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 45వ సూరా ఇది. “జాసియహ్” అనగ మోకరిల్లడం. ప్రళయదినాన అల్లాహ్ న్యాయధర్మాల ముందు అందరూ మోకాళ్ళు నేలకు తాకేవిధంగా ముందుకు వంగుతారు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 28వ ఆయత్. ఈ సూరాలో “జాసియహ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా ఒకే సారి వచ్చింది. ఈ సూరాలో 37 ఆయత్‍లు, 488 పదాలు మరియు 2085 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 18 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది కేవలం 14వ ఆయత్ తప్ప ఇది మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “దుఖాన్” సూరహ్ మరియు దీని తరువాత “అహ్ఖాఫ్” సూరహ్ అవతరించబడ్డాయి. “జాసియహ్” సూరహ్ ఇంకో పేరు “షరీఅత్”. దీని పేరు “జాసియహ్” అని పెట్టడానికి గల కారణం పూర్తి ఖుర్ఆన్ లో కేవలం “షూరా” అన్న పదం ఈ సూరహ్ లో ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “జాసియహ్ సూరహ్ ను పఠించేవాడు ఎప్పటికీ అగ్నిప్రమాధానికి గురి అవ్వడు, నరక కష్టాలను మరియు అచటి అరుపులను వినడు మరియు దైవప్రవక్త[స.అ] తో పాటు ఉంటాడు”.[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ119].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ119.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11