ఖద్ర్ రాత్రుళ్లు

ఆది, 04/09/2023 - 06:56

షబే ఖద్ర్ యొక్క ప్రాముఖ్యత మరియు ఆ రాత్రుళ్లలో చేయవలసిన ఆమాల్ గురంచి సంక్షిప్త వివరణ...

ఖద్ర్ రాత్రుళ్లు

ఖద్ర్ రాత్రుళ్లు అనగా పవిత్ర రమాజన్ మాసం యొక్క 19, 21 మరియు 23వ రోజుల రాత్రుళ్లు. ఈ రాత్రుళ్లను షబ్‌హా-ఎ-ఖద్ర్(ఖద్ర్ రాత్రుళ్లు) అని అంటారు. పవిత్ర ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా ఈ రాత్రి షబె ఖద్ర్ అని పిలవబడటానికి ఎన్నో కారణాలున్నాయి, వాటిలో కొన్ని కారణాలు:

1. లైలతుల్ ఖద్ర్ అంటే గొప్ప రాత్రి అని అర్ధం, ఖద్ర్ అంటే గౌరవం లేదా ప్రతిష్టత లేదా ఘనం అని అర్ధం. షబ్ అంటే రాత్రి మరియు ఖద్ర్ అంటే ప్రతిష్ట, అంటే ప్రతిష్టాత్మకమైన రాత్రి అని అర్ధం. పవిత్ర ఖుర్ఆన్ ఈ విధంగా సెలవిస్తుంది: నిశ్చయంగా మేము దీనిని(ఈ ఖురానును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేసాము[సూరయె ఖద్ర్, ఆయత్1].
2. ఈ రాత్రిలో ఎక్కువ సంఖ్యలో దైవదూతలు భూవికి విచ్చేస్తారు, అలాంటప్పుడు ఈ భూమి ఇరుకైపోతుంది. అందువలన ఈ రాత్రిని ఖద్ర్ అని అంటారు. ఖద్ర్ అంటే "ఇరుకు లేదా బిగుసుకుపోవటం" అని అర్ధం.
3. షబె ఖద్ర్ కు వేరొక అర్ధం “విధి”, అంటే ఈ రాత్రిలో అల్లాహ్ దాసుల యొక్క విధి(భాగ్యం) వచ్చే ఏడాది వరకు నిర్ణయించబడుతుంది. తఫ్సీరె అల్ బుర్హాన్ లో ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఈ విధంగా ఉల్లేఖించారు: షబె ఖద్ర్ లో అల్లాహ్ దాసుల యొక్క అన్ని వ్యవహారాలు, వచ్చే షబె ఖద్ర్ వరకు నిర్ణయించబడతాయి, వాటిలో మంచిచెడ్డలు, ఆజ్ఞ పాలన లేదా తిరస్కరణ, జననమరణాలు, జీవుల యొక్క జీవనాధారం మరియు ఆ సంవత్సరంలో జరగబోయే ప్రతీ విషయం నిర్ణయించబడుతుంది, అది కేవలం ఆ అల్లాహ్ కు తెలుసు.
4. కొందరు షబె ఖద్ర్ యొక్క అర్ధాన్ని “దివ్య ఖుర్ఆను అవతరణకు ఖరారు చేయబడిన రాత్రి” అని కూడా వివరించటం జరిగింది.[1]

షబే ఖద్ర్ 19, 21 మరియు 23 యొక్క ఆమాల్
1. గుస్ల్(ప్రత్యేక తల స్నానం): “షబే ఖద్ర్ గుస్ల్ చేస్తున్నాను అల్లాహ్ సామిప్యం కొరకు” అని చెప్పి లేదా మనసులో భావించుకొని తల స్నానం చేయాలి.
2. రెండు రక్అత్ ల నమాజ్: అల్లాహ్ సామిప్యం పొందేందుకు “షబే ఖద్ర్ యొక్క 2 రక్అత్ నమాజ్ చదువుతున్నాను” అని నోటితో చెప్పాలి లేదా మనసులో అనుకోవాలి.
నమాజ్ యొక్క పద్ధతి: ప్రతీ రక్అత్ లో ఒకసారి సూరయే ‘హంద్’ మరియు 7 సార్లు సూరయే ‘ఖుల్ హు వల్లాహు అహద్’ చదవాలి, మిగిలినవన్నీ ఉదయం నమాజ్ మాదిరే చదవాలి. నమాజ్ తరువాత 70 సార్లు “అస్తగ్ ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్” అని చదవాలి.
3. ఖుర్ఆన్ యొక్క ప్రత్యేక అమలు: ఖుర్ఆన్ ను తెరిచి ముందు పెట్టుకొని ఈ దుఆను చదవాలి  “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మ స్వల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బి కితాబికల్ మున్జలి వ మా ఫీహి వ ఫీహిస్ముకల్ అక్బర్, వ అస్మావుకల్ హుస్నా, వ మా యుఖాఫు వ యుర్జా, అన్ తజ్అలని మిన్ వుతఖాయిక మినన్ న్నార్”.
ఆ తరువాత ఖుర్ఆన్ తలపై పెట్టుకొని ఈ దుఆను చదవాలి:
అల్లాహుమ్మ బిహఖ్ఖి హాజల్ ఖుర్ఆని వ బి హఖ్ఖి మన్ అర్సల్తహు బిహ్, వ బి హఖ్ఖి కుల్లి మొమినిన్ మదహ్ తహు ఫీహి వ బి హఖ్ఖిక అలైహిం, ఫలా అహద ఆరఫు బిహఖ్ఖిక మిన్కా బిక యా అల్లాహు – 10 సార్లు, బి ముహమ్మద్ -10 సార్లు, బి అలీయ్యి -10 సార్లు, బి ఫాతిమహ్ – 10 సార్లు, బిల్ హసన్ -10 సార్లు, బిల్ హుసైన్ -10 సార్లు, బి అలీయ్యిబ్ని హుసైన్ -10 సార్లు, బి ముహమ్మదిబ్ని అలీ – 10 సార్లు, బి జాఫరిబ్ని ముహమ్మద్ -10 సార్లు, బి మూసబ్ని జాఫర్ -10 సార్లు, బి అలీయ్యిబ్నిమూసా – 10 సార్లు, బి ముహమ్మదిబ్ని అలీ – 10 సార్లు, బి అలీయ్యిబ్ని ముహమ్మద్ -10 సార్లు, బిల్ హసనిబ్ని అలీ -10 సార్లు, బిల్ హుజ్జతిబ్నిల్ హసన్ – 10 సార్లు. ఆ తరువాత మీ కోరికలను అల్లాహ్ తో కోరుకోవాలి.
4. జియారతే ఇమామ్ హుసైన్(అ.స).
5. 100 రక్అత్ షబే ఖద్ర్ నమాజ్.

19, 21వ రాత్రి యొక్క ప్రత్యేక ఆమాల్
ఈ రెండు రాత్రుళ్లలో పై చెప్పబడిన ఆమాల్ తో పాటు క్రింద చెప్పబడిన ప్రత్యేక ఆమాల్ ను నిర్వర్తించాలి.
1. అస్తగ్ఫిరుల్లాహ రబ్బీ వ అతూబు ఇలైహ్” 100 సార్లు.
2. అల్లాహుమ్మల్ అన్ ఖతలత అమీరిల్ మొమనీన్” 100 సార్లు.
ఈ రాత్రుళ్ళలో పఠించవలసిన పలు దుఆల కోసం మీరు మఫాతీహుల్ జినాన్ గ్రంథాన్ని చూడగలరు.( షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రమజాన్ నెల ఆమాల్ అధ్యాయంలో.)

షబే ఖద్ర్ ఆమాల్
23వ రాత్రి 19, 21 మరియు 23వ రోజు చేయాల్సిన ఆమాల్ తో పాటు క్రింద చెప్పబడిన 23వ రోజు యొక్క ప్రత్యేక ఆమాల్ ను నిర్వర్తించాలి.
1. అన్కబూత్(సురహ్:29), రూమ్(సురహ్:30) మరియు దుఖాన్(సురహ్:44) సూరహ్ లు పఠించాలి.
3. వెయ్యి సార్లు సురయే ఇన్నా అన్జల్నాహ్(సూరహ్:97) ను పఠించాలి.
4. “అల్లాహుమ్మ కుల్లే వలియ్యికల్ హుజ్జతిబ్నిల్ హసన్...” దుఆ ను చదవాలి.
5.100 రక్అత్ షబే ఖద్ర్ నమాజ్ ఆచరించాలి.
6. “జౌషనె కబీర్” దుఆను పఠించాలి.
7. “దుఆయే తౌబహ్” చదవాలి.
8. “దుఆయే మకారిముల్ అఖ్లాఖ్” ను చదవాలి.
9. రాత్రంతా ఖుర్ఆన్ పఠన, దుఆ మరియు నమాజ్ చదువుతూ గడపాలి.
10. ఇంట్లో పిల్లలను కూడా ఈ రోజు రాత్రి ఆమాల్ నిర్వర్తించడానికై సిద్ధం చేయాలి మరియు వారిని కూడా ఆమాలు చేయు సమయంలో తోడుగా ఉంచాలి.[2]

రిఫరెన్స్
1. షబె ఖద్ర్ ఖల్బె మాహె రమజాన్,నాసిర్ బాఖిరి,బీద్ హింది,ఇంతెషారాతె దఫ్తరె తబ్లీఘాతె ఇస్లామియె హౌజయె ఇల్మియయె ఖుం,1376.
2. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రమజాన్ నెల ఆమాల్ అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12