.ముస్లిములలో కొందరు నమ్మే విధంగా దైవప్రవక్త[స.అ] యొక్క సహాబీయులందరు గౌరవనీయులు మరియు వారు ఎటువంటి తప్పులు చేయలేరు అంటారు. దాని వివరణ సంక్షిప్తంగా.
సహాబీయులు కూడా సాధారణ మనుషులు, వారు మాసుములు కారు, సాధారణ ప్రజల వలే వాళ్ళ పై కూడా అవే విషయాలు వాజిబ్ చేయబడ్డాయి ఏవైతే మానవులందరి పై వాజిబ్ చేయబడ్డాయో, ఏఏ హక్కులు సహాబీయులవో అవే హక్కులు సాధారణ ప్రజలవి కూడాను, అన్న విషయాలలో ఎటువంటి సందేహము లేదు. ఔను!, వారికి దైవప్రవక్త[స.అ]తో తోడుగా ఉండే ఘనత లభించింది. అది కూడా ఆ సహాబీ దైవప్రవక్త[స.అ] తోడుగా ఉండడాన్ని గౌరవప్రదమని భావించినట్లైతే, దానిలో లోటు చేయకపోయినట్లైతే., లేకపోతే అతడు రెండితల శిక్షకు అర్హుడిగా నిర్ధారించబడతాడు. ఎందుకంటే అల్లాహ్ యొక్క ధర్మం ప్రకారం దూరంగా ఉన్న వాళ్ళకు అంతగా శిక్షించబడదు ఎంతైతే దగ్గర వారికి ఇవ్వబడుతుందో. ఎందుకంటే దూరంగా ఉన్న వారు, దైవప్రవక్త(స.అ) నుండి నేరుగా ఒక హదీస్
ను విన్న, దైవప్రవక్త[స.అ] కాంతిని చూసిన మరియు అతని అద్భుతకృత్యాలు తిలకించిన మరియు స్వయంగా దైవప్రవక్త[స.అ] నుండి జ్ఞానం పొందిన వ్యక్తికి సమానం కాలేరు. దైవప్రవక్త[స.అ] కాలం తరువాత జీవించిన వారు ఆయనను చూడలేదు, నేరుగా ఆయన నోట ప్రవచనములను వినలేదు.
దైవప్రవక్త[స.అ]తో పాటు ఉండే ఆ సహాబీ దైవప్రవక్త[స.అ]తో పాటు ఉన్నాగానీ అతని హృదయంలో ఈమాన్ ప్రవేసించలేదు, బలవంతంగా ఇస్లాంను స్వీకరించాడు, లేదా దైవప్రవక్త[స.అ] కాలంలో ఆ సహాబీ ధర్మనిష్ఠ మరియు భీతితో ఉన్నాడు కాని దైవప్రవక్త[స.అ] మరణాంతరం ఇస్లాం నుండి మరలిపోయి మర్తద్
గా మారిపోయాడు. బుద్ధి మరియు అంతరాత్మ, ఇలాంటి సహాబీ కన్న మనకాలంలో జీవించే, ఖుర్ఆన్ మరియు సున్నత్
ను నిరంతరం ఆశ్రయించి దాని ఆదేశాలను గౌరవించేవాడు ప్రతిష్టుడు, అని అంటాయి.
మరి దీనినే ఖుర్ఆన్ మరియు హదీస్, బుద్ధి మరియు అంతరాత్మ సరైనవిగా నిర్ధారిస్తున్నాయి. ఎవరికైన ఖుర్ఆన్ మరియు హదీస్ యొక్క కొంచెం జ్ఞానం ఉన్నా సరే అతను ఈ యదార్థంలో సందేహించలేడు మరియు దీని నుండి ఫరారు కాలేడు. ఉదాహారణకు అల్లాహ్ ఈ వచనాన్ని తిలకించండి: “ఓ దైవప్రవక్త సతీమణులారా! మీలో ఎవరయినాసరే స్పష్టంగా అసభ్యకరమైన చేష్టకి పాల్పడినట్లయితే ఆమెకు రెండింతల శిక్ష విధించబడుతుంది. ఇది అల్లాహ్
కు చాలా తేలిక”[అహ్జాబ్:30].
వ్యాఖ్యానించండి