పరధ్యానం మరియు నిర్లక్ష్యం

బుధ, 04/12/2023 - 12:13

ఒక సమాజం లేదా ఒక సమూహం పరధ్యానం మరియు నిర్లక్ష్యానికి గురి అయితే, వారు గందరగోళానికి లోనౌతారు, వారి మతపరమైన నైతికం దెబ్బతింటుంది దాంతో వారు తమ జీవితాన్ని చాలా సులువుగా పాపముల ద్వార నాశనం చేసుకుంటారు....

పరధ్యానం మరియు నిర్లక్ష్యం

పరధ్యానం మరియు నిర్లక్ష్యం ఘోరమైన ప్రమాధం, ఒక సమాజం లేదా ఒక సమూహం వీటికి గురి అయితే, వారు గందరగోళానికి లోనౌతారు, వారి మతపరమైన నైతికం దెబ్బతింటుంది దాంతో వారు తమ జీవితాన్ని చాలా సులువుగా పాపముల ద్వార నాశనం చేసుకుంటారు.
పరధ్యానం మరియు నిర్లక్ష్యం మాట మధ్యలో వస్తే ఎదురుకునే ప్రశ్న; మనిషి తన జీవితంలో దేని పట్ల పరధ్యానం మరియు నిర్లక్ష్యం కలిగి ఉంటాడు? దేని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు అన్న విషయం చాలా స్పష్టమైన విషయం; వాటి గురించి క్రింద సూచించబడి ఉంది:
1. అల్లాహ్ ఆరాధన మరియు ఆయన పట్ల తన దాసోహం విషయంలో నిర్లక్ష్యం
2. ప్రళయం మరియు నిత్యజీవితం పట్ల నిర్లక్ష్యం
3. పేదవారి మరియు నిస్సహాయుల సహాయం పట్ల నిర్లక్ష్యం
4. అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల నిర్లక్ష్యం
5. మన మత మరియు సమాజ పరమైన బాధ్యతల పట్ల నిర్లక్ష్యం మొ...
పరధ్యానం మరియు నిర్లక్ష్యం యొక్క ఉత్తమ చికిత్స ఖుర్ఆన్ ఉపదేశాలనుసారం:
1. అల్లాహ్ స్మరణ: “మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ ఉంది, అని చెబుతూ ఉండు”[సూరయె కహఫ్, ఆయత్24]
2. ఖుర్ఆన్ పఠించడం: “ముమ్మాటికీ కాదు (వాస్తవమేమిటంటే) ఈ ఖుర్ఆన్ ఒక హితబోధిని. కాబట్టి ఇక కోరినవారు దీని ద్వారా ఉపదేశం గ్రహించవచ్చు”[సూరయె ముద్దస్సిర్, ఆయత్54,55]
3. అనుగ్రహాలు మరియు వాటిని ప్రసాదించినవాడి స్మరణ: “(ఓ ప్రవక్తా! వారికి చెప్పు): వీరు గనక సన్మార్గం పై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్లు త్రాగించి ఉండేవారం. తద్వారా వారిని ఈ విషయంలో పరీక్షించటానికి! మరెవడు తన ప్రభువు ధ్యానం నుండి ముఖం త్రిప్పుకుంటాడో అతన్ని అల్లాహ్ కఠినమైన శిక్షకు లోను చేస్తాడు.[సూరయె జిన్, ఆయత్16,17]
4. గతించినవారి చరిత్ర గుణపాఠం: “వీరికి పూర్వం ఎన్నో సమూహాలను మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాలలో (ప్రస్తుతం) వీళ్లు తిరుగుతున్నారు. ఈ విషయం కూడా వారికి సన్మార్గం చూపటం లేదా? నిశ్చయంగా ఇందులో వివేచన గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి”[సూరయె తాహా, ఆయత్128]
5. మృత్యువు స్మరణ: “మీరెక్కడ ఉన్నాసరే, మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నాసరే (అది మిమ్మల్ని వదలదు). వారికేదైనా మంచి జరిగితే, ఇది అల్లాహ్ తరఫున లభించింది, అని అంటారు. అదే వారికేదైనా కీడు కలిగితే, ఇదంతా నీ మూలంగానే జరిగింది, అని నిందిస్తారు. ఇవన్నీ వాస్తవానికి అల్లాహ్ తరఫుననే సంభవించాయి, అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియజేయి. అసలు వీరికేమైపోయిందీ? ఏ విషయాన్ని కూడా వీరు బొత్తిగా అర్థం చేసుకోరే?!”[సూరయె నిసా, ఆయత్78]
అల్లాహ్ మనకు తమ ఉత్తమ దాసులలో నిర్ధారించుగాక!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16