ఏ అంశాలు మనిషిని అల్లాహ్ సమ్మతానికీ, ప్రసన్నతకు దగ్గర చేస్తాయి? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
ఏ అంశాలు మనిషిని అల్లాహ్ సమ్మతానికీ, ప్రసన్నతకు దగ్గర చేస్తాయి?
అల్లాహ ప్రసన్నతకు దగ్గర చేయు అంశాలు:
1. అల్లాహ్ పట్ల భయభక్తులు మరియు ఆయన పట్ల ఆశ
అల్లాహ్ ఇష్టం మరియు ప్రసన్నత అముల్యమైన స్థానం. దాన్ని పొందడానికి మనం నిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇటువంటి దాసుల గురించి ఉపదేశించెను: “అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఇది తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే”[సూరయె బయ్యనహ్, ఆయత్8] ఈ ప్రసన్నత మరియు ఇష్టం కేవలం అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగివుండే, పాపాలకు దూరంగా ఉండే మరియు ఆయన పట్ల విధేయత కలిగివుండేవారికి మాత్రమే.[1]
2. విశ్వాసం మరియు సత్కార్యాలు
విశ్వాసం మరియు సత్కార్యాలు. ఒకవేళ ఎవరైనా కేవలం దుఆ ద్వార అల్లాహ్ సామిప్యం మరియు ప్రసన్నత పొందగలరు అని భావిస్తున్నట్లైతే వారు దారి తప్పినట్లే; ఎందుకంటే అల్లాహ్ తన దాసుడి నుండి చర్యను ఆసిస్తాడు. ఈమాన్ మరియు అమలె సాలెహ్(విశ్వాసం మరియు సత్కార్యం) గురించి ఖుర్ఆన్ ఇలా సూచిస్తుంది: “అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తముల. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు...”[సూరయె బయ్యనహ్, ఆయత్7,8]
3. ఎక్కువగా ఇస్తగ్ఫార్, వినయం మరియు సద్ఖా దానం
రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: మూడు విషయాలు దాసుడ్ని అల్లాహ్ ప్రసన్నతకు చేరుస్తాయి; ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేయడం, ఇతరువ పట్ల వినయంగా ఉండడం మరియు (అల్లాహ్ మార్గంలో) ఎక్కువగా సద్ఖా దానం చేయడం”[2]
4. అల్లాహ్ శత్రువుల పట్ల శత్రుత్వం
రివాయత్ లో ఇలా సూచించబడి ఉంది: “హజ్రత్ ఈసా(అ.స) తన హవారీయుల(సహచరుల)తో ఇలా ప్రవచించారు: “అల్లాహ్ కు ప్రియమైనవారిగా మరియు ఆయన సామిప్యం పొందే కార్యములు చేయండి: సహచరులు “ఓ రూహుల్లాహ్! ఎలా అల్లాహ్ కు ప్రియమైనవారిగా మరియు ఆయన సామిప్యం పొందేవారిలా అవ్వగలం?” అని ప్రశ్నించారు. దానికి హజ్రత్ ఈసా(అ.స) “పాపాలు చ్సేవారి పట్ల ద్వేషం మరియు వారి పట్ల శత్రుత్వం ద్వార అల్లాహ్ ఇష్టాన్ని వేడుకోండి” అని సమాధానమిచ్చారు.[3]
5. అల్లాహ్ ఇష్టానికి లోబడి ఉండడం
అల్లాహ్ ఇష్టానికి లోబడి ఉండడం ద్వార అల్లాహ్ ప్రసన్నత దక్కుతుంది. రివాయతె ఖుద్సీలో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “నిస్సందేహంగా నా యొక్క ఇష్టం నా విధికి లోబడి ఉన్నవారికే సొంతం”[4] ఈ రివాయత్ ద్వార తెలిసే విషయమేమిటంటే సమ్మతం మరియు ప్రసన్నత కోసం ఇరు తరపుల ఇష్టం అవసరం. అంటే అల్లాహ్ ఇలా చెప్పాలనుకుంటున్నాడు; నీ జీవితంలో నీకు ఏది ప్రసాదించబడినా దానికి ఇష్టంగా స్వీకరించు, దేని పట్ల నిరాశ వ్యక్తం చేయకు, అప్పుడు నేను నిన్ను స్వీకరిస్తాను, ఇష్ట పడతాను” వేరే చాలా రివయతులు దీనిని నిదర్శిస్తున్నాయి.[5]
రిఫరెన్స్
1. తర్జుమ ముజ్మవుల్ బయాన్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్, భాగం27, పేజీ217.
2. కష్ఫుల్ గుమ్మహ్ ఫీ మారిఫతిల్ ఆయిమ్మహ్,(తా-అల్ ఖదీమహ్), భాగం2, పేజీ349.
3. బిహారుల్ అన్వార్, (తా-బీరూత్), భాగం74, పేజీ147.
4. కుల్లియాతె హదీసె ఖుద్సీ, పేజీ158.
5. తస్నీఫు గురరుల్ హికమ్, పేజీ104.
వ్యాఖ్యానించండి