అల్లాహ్ కారుణ్యం పొందడానికి షరత్తులు వివరించబడి ఉన్నాయి అవి ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ప్రతీ సూరహ్ అల్లాహ్ యొక్క అనంత కారుణ్యాన్ని సూచించే రహ్మాన్ మరియు రహీమ్ పేర్లతోనే మొదలవుతుంది. బుద్ధి వివేకాలతో చూసినట్లైతే ఆయన కారుణ్యం ప్రతి నిమిషం మనకు కనిపిస్తుంది. ఖుర్ఆన్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “దయ చూపటాన్ని మీ ప్రభువు తన కోసం విధిగా లిఖించుకున్నాడు”[సూరయె అన్ఆమ్, ఆయత్54]
అల్లాహ్ యొక్క కారుణ్యం విస్తృతమైనది; అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సూచించెను: “అయితే నా కారుణ్యం అన్ని వస్తువులనూ ఆవరించి ఉంది. భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ, జకాతును చెల్లిస్తూ, మా ఆయతులను విస్వసించేవారి పేరు ఈ కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను”[సూరయె అఅరాఫ్, ఆయత్156]
అల్లాహ్ కారుణ్యం పొందడానికి షరత్తులు:
1. విశ్వాసం మరియు సత్కార్యం: అల్లాహ్ వీటి గురించి ఖుర్ఆన్ లో ఇలా సూచించెను: “విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని మాత్రం వారి ప్రభువు తన కారుణ్యంలోకి తీసేసుకుంటాడు. స్పష్టమైన సాఫల్యమంటే ఇదే”[సూరయె జాసియ, ఆయత్30]
2. అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) పట్ల విధేయత: ఖుర్ఆన్ నిదర్శనం: “అల్లాహ్ కూ, ప్రవక్తకూ విధేయత చూపండి – తద్వారా మీరు కనికరించబడే ఆవకాశం ఉంది”[సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్132]
3. అమ్ర్ బిల్ మారూఫ్ మరియు నహ్యి అనిల్ మున్కర్ లను పాటించడం: “విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్ర్తీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్ ను చెల్లిస్తారు. అల్లాహ్ కు, ఆయతన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరి పైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.[సూరయె తౌబహ్, ఆయత్71]
4. ఖుర్ఆన్ ఆయతులను ఆచరించడం: ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “ఇది(ఖుర్ఆన్) మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది”[సూరయె అన్ఆమ్, ఆయత్155]
5. ప్రజల మధ్య సంధి: ఖుర్ఆన్ ఈ విధంగా ఉపదేశిస్తుంది: “విశ్వాసుల అన్నదమ్ములు. కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి – తద్వారా మీరు కరుణించబడవచ్చు”[సూరయె హుజురాత్, ఆయత్10]
వ్యాఖ్యానించండి