ఉపకారం భావాన్ని ఇస్లాం పరిభాషలో ఎహ్సాన్ పదాన్ని ఉపయోగిస్తారు, ఎహ్సాన్ గురించి సంక్షిప్త వివరణ...
ఉపకారం భావాన్ని ఇస్లాం పరిభాషలో ఎహ్సాన్ పదాన్ని ఉపయోగిస్తారు. అందుకని ముందుగా “ఎహ్‌సాన్” పదానికి అర్థం తెలుసుకుందాం.
మంచి పని చేయడం, ఎదుటివారికి మంచి చేయడం, ఒక పనిని దానికి తగ్గటుగా మరియు పరిపూర్ణంగా చేయడాన్ని “ఎహ్‌సాన్” అంటారు.
ఎహ్‌సాన్ పదం “ఇసాఅహ్” పదానికి ప్రతిపదం, దీని పై ఖుర్ఆన్ నిదర్శనం: “భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ దే. దుష్కర్మలు చేసేవారికి అల్లాహ్ వారి కర్మలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వటానికి, సత్కార్మలు చేసేవారికి వారి కర్మలకు తగ్గట్టుగా పుణ్యఫలం ప్రసాదించటానికి (సన్మార్గ దుర్మార్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి)”[సూరయె నజ్మ్, ఆయత్31]
ఖుర్ఆన్ లో ఎహ్‌సాన్ పదానికి అర్థాలు:
ఎహ్‌సాన్ పదానికి మూడు అర్థాలు ఉన్నాయి, ఈ మూడు అర్థాలు కూడా ఖుర్ఆన్ లో సూచించబడి ఉన్నాయి:
1. మంచి పని చేయడం: ఖుర్ఆన్ నిదర్శనం: “సదాచర సంపన్నులకు మరింతగా అనుగ్రహిస్తాము”[సూరయె బఖరహ్, సూరయె58] మరో ఆయత్ లో ఇలా ఉంది: “వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచర సంపన్నులనే ప్రేమిస్తాడు”[సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్134]
2. ఎదుటివారికి మంచి చేయడం: ఖుర్ఆన్ నిదర్శనం: “అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రిలేని బడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, ప్రక్కనున్న మిత్రుల ప్టల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవారిని, బడాయి కొట్టే వారిని ఎంతమాత్రం ఇష్టపడడు”[సూరయె నిసా, ఆయత్36]
3. పరిపూర్ణంగా మరియు దానికి తగ్గ విధంగా మంచి పనిని చేయడం: ఖుర్ఆన్ నిదర్శనం: “అల్లాహ్ ఆకాశాలనూ, భూమినీ (న్యాయంతో), సమతూకం(సత్యం)తో సృష్టించాడు. మరి ఆయన మీ రూపురేఖలను తీర్చి దిద్దాడు. మీకు చాలా మంచి రూపమిచ్చాడు. కడకు చేరుకోవలసింది ఆయన వద్దకే”[సూరయె తగాబున్, ఆయత్03]
రిఫరెన్స్
https://btid.org/fa/news/94547
వ్యాఖ్యానించండి