అల్లాహ్ పట్ల నమ్మకం కలిగి ఉండడం అంటే అల్లాహ్ పై తవక్కుల్ కలిగి ఉండడం అని అర్ధం, దీని గురించి సంక్షిప్త వివరణ...

అల్లాహ్ పట్ల నమ్మకం కలిగి ఉండడం అంటే అల్లాహ్ పై తవక్కుల్ కలిగి ఉండడం అని అర్ధం. అందుకు ముందుగా మనం అరబీ పదమైన “తవక్కుల్” యొక్క అర్థం తెలుసుకుందాం.
తవక్కుల్ అర్ధం:
తవక్కుల్ పదం వికాలత్ అనే పదం నుండి తీసుకోబడింది. ఖుర్ఆన్ మరియు హదీసులనుసారం; తవక్కుల్ అనగా అల్లాహ్ పై నమ్మకం మరియు భరోసా ఉంచడం, ఆయనను మన స్వామి మరియు వకీలుగా నిర్ధారించుకోవడం. తవక్కుల్ అనగా మనిషి తన అన్ని చర్యలలో అల్లాహ్ ను తన వకీల్ గా నిర్ధారించి, ఆయన పై నమ్మకం కలిగి ఉండాలి; ఎందుకంటే శక్తులన్నీంటిలో అల్లాహ్ వి కాబట్టి కేవలం ఆయన మాత్రమే ప్రభావం చూపించడగలడు.[1]
తవక్కుల్ యొక్క అర్థాన్ని స్పష్టంగా వివరిస్తున్న దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) జిబ్రయీల్(అ.స)ను “తవక్కుల్ అనగానేమి?” అని ప్రశ్నించారు. జిబ్రయీల్ ఇలా సమాధానమిచ్చారు: “ఈ విధంగా జ్ఞానం కలిగివుండడం; సృష్టితాలు లాభనష్టాలు కలిపించలేరు, దేన్ని ప్రసాదించలేరు మరియు దేని నుండి దూరం చేయలేరు (అంటే) సృష్టితాల పట్ల నిరాశ చెందడం. ఎప్పుడైతే ఒక దాసుడు ఇలా ఆలోచిస్తాడో, అప్పుడు అల్లాహ్ తప్ప మరెవ్వరి కోసం పని చేయడు, అల్లాహ్ తప్ప మరొకరి పై నమ్మకం ఉంచడు, ఇతరులను లెక్క చేయడు, కేవలం ఆయనను మాత్రమే ఆశిస్తాడు, మరొకరిని తన హృదయంలో చోటివ్వడు. ఇది నిజమైన తవక్కుల్ కు అర్థం”[2]
తవక్కుల్ యొక్క హద్దు:
అబూబసీర్(ర) ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ద్వార రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా అన్నారు: “ప్రతీ దానికి ఒక హద్దు అనేది ఉంటుంది” నేను “స్వామీ! అల్లాహ్ పట్ల తవక్కుల్(నమ్మకం) కలిగి ఉండడం కు హద్దేమిటి?” అని ప్రశ్నించాను. వారు “యఖీన్”(నిశ్చయత) అని సమాధానమిచ్చారు. యఖీన్ యొక్క హద్దేమిటి? అని ప్రశ్నించాను. దానికి ఇమామ్ “అల్లాహ్ కు తప్ప మరెవ్వరితో భయపడకుండా ఉండడం” అని సమాధానం ఇచ్చారు.[3] ఒకవేళ మనిషి యొక్క యఖీన్ పరిపూర్ణ స్థితిలో ఉంటే అల్లాహ్ పై పూర్తి తవక్కుల్ కలిగి ఉండవచ్చు.
రిఫరెన్స్
1. ఫర్ హంగె సిపాత్, అబా ఇస్మాయిలీ యజ్దీ, పేజీ301.
2. బిహారుల్ అన్వార్, మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, భాగం68, పేజీ138, హదీస్23.
3. అల్ కాఫీ, కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, భాగం2, పేజీ57.
వ్యాఖ్యానించండి