ఒక విశ్వాసి బలంగా ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉన్నప్పుడే అతడు తన ధర్మం యొక్క మూల విశ్వాశాలను పూర్తి విధంగా తెలుసుకొని వాటిని ఇతర ప్రజల కోసం వివరించగలడు, చేర్చగలడు, ప్రకటించగలడు...

ఒక విశ్వాసి బలంగా ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉన్నప్పుడే అతడు తన ధర్మం యొక్క మూల విశ్వాశాలను పూర్తి విధంగా తెలుసుకొని వాటిని ఇతర ప్రజల కోసం వివరించగలడు, చేర్చగలడు, ప్రకటించగలడు...
రివాయతులనుసారం మేము అల్లాహ్ ను ఆయన ఆదేశాలను స్థాపించడానికై, అమలు చేయడానికై శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ఉండాలి. అంటే ఇస్లాం ఆరోగ్యాన్ని ప్రాముఖ్యత ఇస్తుంది. ఆయతులు మరియు రివాయతులలో దీని గురించి చాలా వివరంగా ఉంది. “నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువబోకు”[సూరయె ఖసస్, ఆయత్77] ఈ ఆయత్ యొక్క ప్రాపంచిక భాగం అనగా అర్థం ఆరోగ్యం, బలం, అవకాశం, యవ్వనం మరియు ఉల్లాసం ను మరువబోకు, వీటి ద్వార పరలోకాన్ని పొందగలవు.[1] ఒక రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “పోగొట్టుకోనంత వరకు వాటి ప్రాముఖ్యత తెలిసిరానటువంటి రెండు అనుగ్రహాలు: యవ్వనం మరియు ఆరోగ్యం”[2]
ఆరోగ్యంపై ఇస్లాం ప్రత్యేక దృష్టి ఉంది అనే విషయాన్ని ఈ హదీస్ వ్యక్తం చేస్తుంది. ఇస్లామీయ ఆదేశాలనుసారం సృష్టి యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టి చూస్తే ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ అని తెలుస్తుంది. మానవుని సృష్టిలక్ష్యం అల్లాహ్ ఆదేశాలను స్థాపించడం, వాటి పట్ల విధేయత కలిగివుండడం. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా వివరించెను: “నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే”[సూరయె జారియాత్, ఆయత్56]
అల్లాహ్ ఆదేశాలు స్థాపించడం అనగానేమి?
అల్లాహ్ ఆదేశ స్థాపనకు మరియు ఆరోగ్యానికి చాల దగ్గర సంబంధం ఉంది. ఆరోగ్యంగా లేని వారు అల్లాహ్ ఆదేశాలను స్థాపించే విషయంలో నిస్సహాయులుగా ఉంటారు. ఇస్లామీయ రివాయతుల ద్వార అల్లాహ్ ఆదేశ స్థాపన అనగా ఏమిటి అని చూస్తే చాలా విషయాలు ముందుకు వస్తాయి; ఇక్కడ వాటి నుంచి కొన్ని మీకోసం:
1. ఉపవాసం ఉండడం,
2. నమాజ్ చదవడం మరియు (నిర్ణిత సమయాలలో) జాగరణలు చేయడం,
3. అమ్ర్ బిల్ మారూఫ్ మరియు నహ్యి అనిల్ మున్కర్(మంచి పట్ల ప్రోత్సాహం మరియు చెడు నుండి ఆపడం),
4. పేదవారిని ఆదుకోవడం,
5. అల్లాహ్ మార్గంలో హజ్ మరియు జిహాద్ ను నిర్వర్తించడం,
6. ఇమామ్ మరియు వారి ప్రతినిధుల పట్ల విధేయత కలిగివుండడం, వారిని సహకరించడం.
ఇవన్నీ జరగాలంటే ఆరోగ్యంగా ఉండడం అవసరం. ఇదే దుఆయె కుమైల్ లో ఈ విధంగా సూచించబడి ఉంది: “నీ సేవ కోసం నా శరీరభాగాలకు శక్తిని ప్రసాదించు, నా హృదయాన్ని ఆలోచన పరంగా పటిష్ఠించు”[3]
ఆరోగ్యం, మనిషికి మంచి అవకాశం. అది మనిషికి ప్రసాదించిన అనుగ్రహం. చాలా మందికి ఈ అనుగ్రహం యొక్క విలువ దాన్ని పోగొట్టుకోనంత వరకూ తెలిసి రాదు. మనకు ప్రసాదించబడిన ఈ అనుగ్రహాన్ని మన సృష్టికర్త అనుచరణలో ఖర్చు చేయాలి, ఆయన ఆచరణ కోసం సమర్పించుకోవాలి. నమాజ్ చదవటం, ఉపవాస దీక్షను నిర్వర్తించటం, మొదలగువాటితో పాటు కుటుంబ సభ్యులను పోషించటం కోసం పని చేయటం, పేదవారికి సహాయం చేయటం, లాంటివి కూడా అల్లాహ్ కు విధేయత చూపటమే.
అనారోగ్యానికి లేదా శరీరం బలహీనతకు గురి అవ్వక ముందే ఆ అనుగ్రహం విలువను తెలుకోండి...
ఇమామ్ అలీ[అ.స] ఇలా ప్రవచించెను: అల్లాహ్ కోసం, కేవలం అల్లాహ్ కోసం ఆరోగ్యంగా మరియు బలంగా ఉన్నంత వరకు, అలాగే కష్టాల్లో పడక ముందు మరియు బలహీనులు అవ్వక ముందు, ఈ అనుగ్రహం మీ నుండి తీసుకోక ముందే మీరు మీ మేడను వంచండి(అనగా దైవారాధనలో గడపండి).[4]
ఈ హదీసు ద్వారా తెలిసే విషయమేమిటంటే మనం బలంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అల్లాహ్ పట్ల మనం చూపించే విధేయత విలువైనది. యవ్వనంలో పాపాలన్నీ చేసి లేదా ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఇస్లాం ఆదేశాలను పట్టించుకోకుండా వృధ్యాపంలో లేదా అనారోగ్యంలో అల్లాహ్ పట్ల చూపించే విధేయతకు అంత విలువ ఉండదు.
రిఫరెన్స్
1. మఆనియుల్ అఖ్బార్, పేజీ325, హదీస్1. అమాలీ అల్ సదూఖ్, పేజీ228-229, హదీస్10.
2. తస్నీఫు గురరుల్ హికమ్, పేజీ324, హదీస్7532.
3. ముస్బాహుల్ ముతహజ్జిద్ వ సిలాహుల్ ముతఅబ్బిద్, భాగం2, పేజీ849.
4. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారు ఇహ్యాయిత్తురాసిల్ అరబీ, భాగం8, పేజీ307, బీరూత్, 1403.
వ్యాఖ్యానించండి