సజ్జనులు(అబ్రార్) ఎవరు? మరియు వారు కలిగివున్న ప్రత్యేకతలేమిటి? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

అబ్రార్(సజ్జనులు) ఎవరు?
అబ్రార్ పదం, అరబీ పదం. దాని అర్థం సజ్జనులు, మంచివారు మరియు సత్కార్యములు చేయువారు అని[1]. వీరు విశ్వాసపరంగా అగ్ర స్థానంలో ఉన్నవారు, స్థాయి పరంగా ఊలుల్ అల్బాబ్(వివేకులు)కు ఎక్కువ మరియు ముఖర్రబాన్(అల్లాహ్ కు అతి సామిప్యం కలిగివున్నవారు)కు తక్కువ. ఖుర్ఆన్ లో వారి గురించి చాలా సార్లు సూచించబడి ఉంది: “నిశ్చయంగా సజ్జనులు(విశ్వాసులు) .కాఫూర్. కలుపబడిన మధు పాత్రలను సేవిస్తారు” [సూరయె ఇన్సాన్, ఆయత్5]
ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు, అబ్రార్ పదానికి వివిధ రకాలుగా నిర్వచించారు. ఉదా; అల్లాహ్ పట్ల సంపూర్ణ విధేయత చూపి ఆయనను సంతోషపరిచేవాడు[2] పాపాములకు దూరంగా ఉండేవారు[3] అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు ప్రళయదినం పై విశ్వాసం కలిగివుండేవారు[4] తమ విశ్వాసంలో సత్యవంతులైన విశ్వాసులు[5] కేవలం అల్లాహ్ కోసం మాత్రమే సత్కార్యములు చేయు మంచివారు[6] కొందరు సూరయె ఆలెఇమ్రాన్ యొక్క 193వ ఆయత్ యొక్క వ్యాఖ్యానం లో అబ్రార్ అనగా దైవప్రవక్తలు మరియు ఔలియాలు అని వ్యాఖ్యానించారు.[7]
అబ్రార్ యొక్క సంకేతాలు:
1. తమ మొక్కుబడులను చెల్లించడం: ఖుర్ఆన్: “వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు”[సూరయె ఇన్సాన్, ఆయత్7]
2. ప్రళయదినం పట్ల భయం కలిగి ఉండడం: ఖుర్ఆన్: “ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు”[సూరయె ఇన్సాన్, ఆయత్7]
3. నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు: ఖుర్ఆన్: “అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు”[సూరయె ఇన్సాన్, ఆయత్8]
4. అల్లాహ్ ప్రసన్నత: ఖుర్ఆన్: “పైగా వారిలా అంటారు: మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్నిగానీ, ధన్యవాదాలనుగానీ ఆశించటం లేదు”[సూరయె ఇన్సాన్, ఆయత్9]
5. అంతిమదినాన అల్లాహ్ పట్ల భయం: ఖుర్ఆన్: “నిశ్చయంగా మేము మా ప్రభువు తరపున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము”[సూరయె ఇన్సాన్, ఆయత్10]
చెప్పబడిన లక్షణాలలో ఏ ఒక్క లక్షణం లేకపోయిన అబ్రార్(సజ్జనుల) స్థానం పొందకపోవచ్చు.
చివరి మాట
సజ్జనులు, ఉత్తములు అనీ వారు తమ మొక్కుబడులను చెల్లిస్తారు, ప్రళయదినం పట్ల భయం కలిగి ఉంటారు, నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు, వారి చర్యలు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే అయి ఉంటాయి, అంతిమదినాన అల్లాహ్ పట్ల భయం కలిగి ఉంటారు. ఈ లక్షణాలు కలిగివున్నవారే సజ్జనులు అని ఖుర్ఆన్ సూచిస్తుంది. సజ్జనులు స్థానం పొందడానికి ఈ లక్షణాలు ఉండడం తప్పని సరి.
1. ఖామూసె ఖుర్ఆన్, భాగం1, పేజీ180. ఫర్‌గంగె మొయీన్, మద్ఖలె అబ్రార్. ఫర్‌హంగె అబ్ జద్, అరబీ-ఫార్సీ, పేజీ180.
2. జామెఉల్ బయాన్, మజ్3, భాగం3, పేజీ282. మజ్మవుల్ బయాన్, భాగం2, పేజీ908. అల్ తిబ్యాన్, భాగం3, పేజీ85.
3. కష్ఫుల్ అస్రార్, భాగం10, పేజీ406.
4. అల్ మీజాన్, భాగం20, పేజీ124.
5. కష్ఫుల్ అస్రార్, భాగం10, పేజీ318.
6. అల్ తిబ్యాన్, భాగం10, పేజీ302.
7. కష్ఫుల్ అస్రార్, భాగం10, పేజీ388.
వ్యాఖ్యలు
Excellently explained
Jazakallahu khair
వ్యాఖ్యానించండి