అల్లాహ్ తన దాసులు పరిపూర్ణ స్థాయికి చేరడం కోసం రెండు రకాల హుజ్జత్(మార్గదర్శకుల)ను నిశ్చయించాడు, అవేమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
హుజ్జత్ అనగానేమి?
హుజ్జత్ అనగా సాక్ష్యం, నిదర్శనం దాంతో ఎదుటివాడిని లోబరుచుకోవచ్చు లేదా వాదించవచ్చు. ఈ పదం యొక్క బహువచనం “హుజజ్” మరియు “హుజ్జాజ్” ఈ పదం ఖుర్ఆన్ లో చాలా సందర్భాలలో ఉపయోగించబడి ఉంది. ఉదాహారణకు; “ رُسُلاً مُبَشِّرينَ وَ مُنْذِرينَ لِئَلاَّ يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ وَ كانَ اللَّهُ عَزيزاً حَكيماً; మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్ కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని(మేమిలా చేశాము). అల్లాహ్ యే సర్వాధిక్యుడు, మహావివేకి”[సూరయె నిసా, ఆయత్165]
ప్రవక్తలు అవతరింపబడడానికి కారణం, అల్లాహ్ తన తరపు నుంచి సాక్ష్యాలను ప్రదర్శించి ఇక ప్రజలు “మాకోసం మార్గాన్ని చూపించేవారు లేకపోయారు” అని వాదనకు దిగకూడదని. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: ఇంకా వారికి ఇలా చెప్పు: “పరిపూర్ణమైన వాదన అల్లాహ్‌దే. ఆయనే గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గంపై నడిపించేవాడే”[సూరయె అన్ఆమ్, ఆయత్149]
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఉల్లేఖనం: “హిషామ్! అల్లాహ్ ప్రజలపై రెండు హుజ్జత్(వాదన, మార్గదర్శకులు) కలిగివున్నాడు: కనిపించే హుజ్జత్ మరియు కనిపించని హుజ్జత్, కనిపించే హుజ్జత్ దైవప్రవక్తలు మరియు ఇమాములు, కనిపించని హుజ్జత్ బుద్ధి”[3] ఈ రెండింటి ద్వార మనిషి అల్లాహ్ తమ దాసుల నుంచి ఆశించే ఆ పరిపూర్ణ స్థితికి చేరగలడు. ఇక ప్రజలకు మాకోసం మార్గదర్శి లేనందు వల్ల మేము పరిపూర్ణ స్థాయికి చేరలేకపోయాము అని వాదించే అవకాశం ఉండదు ఎందకంటే అల్లాహ్ ఒకవైపు మార్గదర్శకులను పంపి మరో వైపు బుద్ధిని ప్రసాదించి తన సహాయాన్ని ప్రజల అందుబాటులో ఉంచాడు.
అల్లాహ్ మానవాళి హిదాయత్ మరియు ప్రజలు తమ జీవితాలను రుజుమార్గం పై నడిపేందుకు హజ్రత్ ఆదమ్(అ.స) నుండి ఇప్పటి వరకు ఒక లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలను మరియు పన్నెండు మంది ఇమాములను ఒకరి తరువాత మరొకరిని పంపుతూనే ఉన్నాడు. రివాయతులనుసారం భూమి పై అల్లాహ్ యొక్క మార్గదర్శి(హాదీ, హుజ్జత్) లేనటువంటి సమయం ఉండదు. మార్గదర్శి లేని భూమి జీవం లేనటువంటి భూమి. హజ్రత్ ముహమ్మద్(అ.స) అంతిమ ప్రవక్తగా అవతరించబడిన తరువాత అల్లాహ్ ఇమాములను మార్గదర్శకులుగా ఎన్నుకున్నాడు వారిలో మొదటి వారు హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) అయితే చివరి మార్గదర్శి హజ్రత్ హుజ్జత్ ఇబ్నె హసన్(అ.స) అని ఇరువర్గాల వారి ప్రముఖ హదీస్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉంది.
అంతిమ మార్గదర్శి అధికారం
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క 24వ సూరహ్ 55వ ఆయత్ లో ఇలా ప్రవచించెను: “మీలో ఎవరైతే విశ్వసించి, మంచి పనులు చేశారో వారికి అల్లాహ్, వారి పూర్వీకులను భూమి పై ప్రతినిధులుగా చేసినట్లు గానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం ప్రసాదిస్తానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు తప్పకుండా పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పింస్తానని, వారికున్న భయాందోళనల స్థానే తప్పకుండా శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు”[సూరయె నూర్, ఆయత్55]
ఈ ఆయత్ లో అల్లాహ్ చెప్పదలుచుకున్న విషయమేమిటంటే: అల్లాహ్, విశ్వసించి మంచి పనులు చేసేవారితో భూమి పై అధికారాన్ని, సమ్మతించబడ్డ ధర్మన్ని పటిష్టం చేస్తానని మరియు పూర్తి శాంతిభద్రతలు కలిపిస్తానని వాగ్దానం చేసెను.
ఈ ఆయత్ లో ఉద్దేశబడ్డ ఆ సమూహం ఏ సమూహం అని ఖుర్ఆన్ వ్యాఖుల మధ్య అభిప్రాయబేధం ఉంది. కొందరు దైవప్రవక్త(స.అ) కాలంలో అధికారం వారి చేతికి వచ్చింది కాబట్టి, దైవప్రవక్త(స.అ) సహాబీయులని అంటారు. కొందరు దైవప్రవక్త(స.అ) కాలం తరువాత నాలుగు ఖలీఫాల అధికార కాలం అని అంటారు. కొందరు దీని అర్ధాన్ని చాలా వైశాల్యంగా తీసుకుంటారు అందుకు వారు భూమి పై ఉన్న ఈ గుణాలు కలిగి ఉన్న ముస్లిములందరూ అని అంటారు. మరి కొందరు తూర్పూపడమరలను ఒకే అధికారం క్రింద చేసే హజ్రత్ ఇమామ్ మహ్దీ(అ.స) అధికారం అని అంటారు. హజ్రత్ మహ్దీ(అ.స) అధికారంలో అన్ని చోట్లలో సరైన ధర్మం కనిపిస్తుంది, భయాందోళనలు మరియు యుద్ధాలు భూమి పై కనిపించవు, మానవులందరి ప్రార్ధనలు విగ్రాహారాధనల నుండి పవిత్రమవుతాయి. అప్పుడు ఈ ఆయత్ అన్ని విధాలుగా తన అర్ధాన్ని పొందుతుంది. హజ్రత్ మహ్దీ(అ.స) అధికారాన్ని ఇరువర్గాల వారు, వారి రాకతో ఎలాగైతే అన్యాయం మరియు దుర్మార్గాలతో నిండి ఉందో అలాగే ప్రపంచం న్యాయధర్మాలతో నిండిపోతుంది, అని నమ్మతారు.[4]
రిఫరెన్స్
1. ఇబ్నె తాఊస్, అలీ ఇబ్నె మూసా, మర్కజున్ నష్ర్, అల్ ఇఖ్బాలు బిల్ఆమాలిల్ హసనహ్, భాగం1, పేజీ369.
2. ఇబ్నె మన్జూర్, లిసానుల్ అరబ్, భాగం2, పేజీ228 .
3. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగం1, పేజీ16.
4. ఆయతుల్లాహ్ నాసిర్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, సూరయే నూర్ ఆయత్55 వ్యాఖ్యానంలో.
వ్యాఖ్యలు
Mashallah jazakallah
వ్యాఖ్యానించండి