ఖుర్ఆన్ గ్రంథంలో స్వర్గం యొక్క పేర్లు మరియు ఆ స్వర్గంలో నిత్యం ఎవరు ఉండగలరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

పవిత్ర గ్రంథం అయిన ఖుర్ఆన్ లో స్వర్గం యొక్క పేర్లు ప్రస్థావించబడి ఉన్నాయి. వాటిలో కొన్ని
1. దారుస్సలాం(శాంతి నిలయం)
ఆయత్: అల్లాహ్ మిమ్మల్ని శాంతి నిలయం వైపుకు పిలుస్తున్నాడు. ఇంకా, తాను కోరిన వారికి ఆయన రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు(సూరయె యూనుస్, ఆయత్25).
2. దారుల్ ఇర్స్ (వారసత్వంగా లభించే నివాస స్థానం)
ఆయత్: మేము మా దాసులలో భయభక్తులు కలిగి ఉండేవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే(సూరయె మర్యం, ఆయత్63).
అల్లాహ్ స్వర్గాన్ని తన దాసులకు(విస్వాసులు) వారసత్వంగా ఇస్తున్నాడు, ఒక మాటలో చెప్పలంటే స్వర్గానికి నిజమైన వారసులు విస్వాసులే అని చెప్పవచ్చు.
3. దారుర్ రిజా (కోరుకునేది లభించే ప్రదేశం)
ఆయత్: ఈ దుర్మార్గులు తాము చేసుకున్న దానిపై భయపడటం నువ్వు చూస్తావు. అది (ఆ పాపం) వారిపై పడి తీరుతుంది. మరెవరయితే విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారు స్వర్గవనాలలో ఉంటారు. వారు కోరినదల్లా వారికి వారి ప్రభువు వద్ద లభిస్తుంది. అదే అసలు గొప్ప అనుగ్రహం[సూరయె షూరా, ఆయత్22].
4. దారుల్ మఖాం(నిత్యం ఉండే ప్రదేశం)
ఆయత్: వారిలా అంటారు: 'మా నుంచి దుఃఖాన్ని దూరం చేసిన అల్లాహ్‌కు (శతకోటి) కృతజ్ఞతలు. నిశ్చయంగా మా ప్రభువు అమితంగా క్షమించేవాడు, సత్కార స్వభావుడు, "ఆయన తన కృపతో నిత్యం ఉండే నెలవులో మమ్మల్ని దించాడు. అందులో మాకు బాధగానీ, అలసటగానీ ఉండట్లేదు[సూరయె ఫాతిర్, ఆయత్34,35].
5. ఫౌజుల్ అజీం (అతి పెద్ద సాఫల్యం)
ఆయత్: నిస్సందేహంగా అల్లాహ్ ముస్లింల నుండి, వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు; చంపుతారు, చంపబడతారు. దీనిపై తౌరాతులోనూ, ఇంజీలులోనూ, ఖుర్‌ఆన్‌లోనూ సత్యమైన వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్‌ను మించిన వాడెవడుంటాడు? కాబట్టి మీరు ఖరారు చేసిన ఈ వర్తకానికిగాను సంబరపడండి. ఘనవిజయం అంటే ఇదే[సూరయె అత్-తౌబా, ఆయత్111].
స్వర్గం నిత్య నిలయం
అల్లాహ్ ను నిత్యం ఓ అల్లాహ్! స్వర్గాన్ని నా స్థావరం మరియు నిలయంగా ఖరారు చేయి అని వేడుకుంటూ ఉండాలి.
స్వర్గం ఎవరి నిత్య నిలయంగా నిర్ధారించబడుతుంది? అన్న విషయం పై సంక్షిప్త వివరణ.
1. అల్లాహ్ పట్ల భయం మరియు చెడువాంఛల వ్యతిరేకత
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సూచించెను: “మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో, అతని నివాసం స్వర్గమవుతుంది”[సూరయె నాజిఆత్, ఆయత్40,41]
2. అణుకువ మరియు మంచి నైతికం
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “స్వర్గవాసులు నాలుగు సంకేతాలు కలిగివుంటారు” ముఖంలో నవ్వు, మంచినోరు, దయగల హృదయం, ప్రసాదించే చెయ్యి కలిగి ఉంటారు[1]
3. బాధితులకు సహాయం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “దుర్మార్గుల నుండి బాధితులకోసం న్యాయాన్ని తీసుకున్నవాడు, స్వర్గంలో నా సహవాసి అయి ఉంటాడు”[2]
4. స్వర్గం దానగుణం కలిగివున్న వారి గృహం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “దానశీలి అల్లాహ్, ప్రజలు మరియు స్వర్గానికి దగ్గరగా మరియు నరకాగ్నికి దూరంగా ఉంటాడు కాని పీనాసి అల్లాహ్, ప్రజలు మరియు స్వర్గానికి దూరంగా మరియు నరకాగ్నికి దగ్గరగా ఉంటాడు”[3]
5. స్వర్గం ఆనాధలను మరియు పేదవారికి న్యాయం కలిపించేవారి నిలయం
ఖుర్ఆన్ ఉల్లేఖనం: “అది (వాస్తవం) కాదు. అసలు విషయం ఏమిటంటే మీరు అనాధలను ఆదరించరు. నిరుపేదలకు అన్నం పట్టే విషయంలో ఒకర్నొకరు ప్రోత్సాహించుకోరు”[సూరయె ఫజ్ర్, ఆయత్17,18]
చివరిలో ఓ ప్రార్థించేవారి కోరికలను ప్రసాదించేవాడా! మమ్మల్ని నిజమైన ముస్లిములుగా మరియు అహ్లెబైత్(అ.స) అనుచరులుగా నిర్ధారించి షైతాన్ మనల్ని లోబరుచుకోకుండా చూసి స్వర్గాన్ని మన నిత్యనిలయంగా నిర్ధారించు.
అల్లాహ్ తమ దాసుల కార్యములు అంగీకరించే మరియు నిరాకరించే విషయాన్ని ఖుర్ఆన్ లో ఇలా వివరించెను: ఓ ముహమ్మద్(స.అ) ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి నజరానా సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు అప్పుడు రెండవతను, “నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు, “అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు” అని అన్నాడు.[సూరయె మాయిదహ్, ఆయత్27]
చివరిలో ఓ స్పష్టమైన యదార్థం వైపుకు దారి చూపమని అల్లాహ్ ను వెడుకుంటున్నాము.
రిఫరెన్స్
1. సరె మష్ఖ్ అజ్ సుఖనానె హజ్రత్ అలీ(అ.స), పేజీ58.
2. అమాలీ(తూసీ), పేజీ683, హదీస్1454.
3. ఇర్షాదుల్ ఖులూబ్(తర్జుమా రిజాయీ), భాగం1, పేజీ328.
వ్యాఖ్యలు
Excellent
వ్యాఖ్యానించండి