షైతాన్ వలలో చిక్కుకునే వారి గురించి మరియు చిక్కని వారి గురించి ఖుర్ఆన్ మరియు హదీసుల వివరణ...
షైతాన్ వల్ల కొందరు ప్రభావితులవుతారు అన్న విషయాన్ని ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సూచించెను: “నా దాసులపై నీ అధికారం సాగదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది”[సూరయె హిజ్ర్, ఆయత్42] మరో ఆయత్ లో ఇలా ఉంది: “అయితే వాడితో స్నేహం చేసి, వాడిని అల్లాహ్ కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి(షైతాన్) అధికారం నడుస్తుంది”[సూరయె అన్ఆమ్, ఆయత్149]
పై ఆయతుల ద్వార షైతాన్ కు మనపై అధికారం చేసే అవకాశాలు ఎలా వస్తాయి అనే కొన్ని అంశాలు తెలుసుకోవచ్చు:
1. అల్లాహ్ యొక్క ప్రముఖ దాసులపై షైతాన్ తన అధికారం చెలాయించలేడు
2. షైతాను ను తమ స్వామిగా నిర్ధారించుకునేవారిపై షైతాన్ అధికారం చెలాయిస్తాడు
3. షైతాన్ ను అల్లాహ్ భాగస్వామిగా నిర్ధారించేవారు; అనగా ఒకసారి అల్లాహ్ ను స్వామిగా మరియు మరో సారి షైతాన్ ను స్వామిగా భావించేవారిపై షైతాన్ తన అధికారాన్ని చెలాయిస్తాడు
ప్రజలు షైతాన్ విషయంలో తప్పుడు భావనలు కలిగివుంటారు. వారు తమను తమ ప్రమేయం లేకుండానే షైతాన్ కు లోబడిపోతాము అని భావిస్తారు, నిజానికి ఈ ఆలోచన మిమ్మాటికి అబద్ధం. అల్లాహ్ తన ఆస్తానం నుంచి బయటకు తరిమేసిన షైతాన్ మీ అనుమతి లేకుండా మీ ఆత్మ అనబడే పట్టణంలో ప్రవేశించలేడు. మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనంత వరకు షైతాన్ కు మీపై దాడి చేసే శక్తి ఉండదు.
ప్రశ్న: ఏ అంశాలు షైతాన్ కు మనపై దాడి చేసే అనుమతినిస్తాయి?
సమాధానం: చాలా అంశాలు ఉన్నాయి వాటిలో కొన్ని:
1. చెడు సహవాసం షైతాన్ మనపై అధికారం చెలాయించడానికి గల ముఖ్యకారణాలలో ఒకటి
2. పాపాములతో కూడి ఉన్న పార్టీలు
3. చెడు సినిమాలు చూడడం, మార్గభ్రష్టతకు గురి చేసే పుస్తకాలు చదవడం, రెడియోల ద్వార చెడు కార్యక్రమాలు వినడం, ఇంటర్ నెట్ మొ..
4. తెలియని మరియు నామహ్రమ్ స్ర్తీతో ఒంటరిగా ఉండడం
ఇవే కాకుండా మరెన్నో విషయాలు ఉన్నాయి అయితే వాటిలో ఎక్కువ శాతం పైచెప్పబడిన వాటి క్రమంలోనే వస్తాయి. మేము వీటికి గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అల్లాహ్ నుండి సహాయం కోరాలి[1]
చివరి మాట
విశ్వాసుల హృదయంలో అల్లాహ్ మరియు సైతాన్, ఇద్దరి పట్ల ప్రేమ ఒకేచోట కలిసి ఉండటం అసంభవం. ఈ విషయాన్నే ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది: “అల్లాహ్‌నూ, పరలోకాన్నీ విశ్వసించేవారు, అల్లాహ్‌నూ ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించేవారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించేవారు వారి తల్లిదండ్రులైనా, వారి కుమారులైనా, వారి సోదరులైనా సరే లేదా వారి కుటుంబీకులైనా సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థరంగా నాటాడు, తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి వారికి బలాన్ని ఇచ్చాడు. ఆయన వారిని క్రింద సేలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆ వనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్త! అల్లాహ్ పక్షం వారే సఫలీకృతులయ్యేవారు”[సూరయె ముజాదిలహ్, ఆయత్22]
మరో చోట ఇలా ప్రవచించెను: “విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక నా మార్గంలో జిహాద్ చేయటానికీ, నా ప్రసన్నతను పొందటానికీ(స్వస్థలాన్ని విడిచి ఇళ్లనుండి) బయలుదేరినపుడు నాకూ, మీకూ శత్రువులైన వారితో స్నేహం చేయకండి. అసలు మీరు వారితో స్నేహం ఎలా చేస్తారు; మీ వద్ద వచ్చిన సత్యాన్ని వారు విశ్వసించటానికి నిరాకరించారు కదా!”[సూరయె ముమ్తహినహ్, ఆయత్01]
రిఫరెన్స్
1. అల్ కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగం1, పేజీ16.
వ్యాఖ్యానించండి