స్వరం ఏదోరకంగా ప్రసాదించేయబడదు, అది కేవలం దుఆ ద్వార మనకు దక్కదు. దానిని పొందాలనుకుంటే ఖుర్ఆన్ ఉపదేశాలను పాటించడం అవసరం...

స్వరం ఏదోరకంగా ప్రసాదించేయబడదు, అది కేవలం దుఆ ద్వార మనకు దక్కదు. దానిని పొందాలనుకుంటే ఖుర్ఆన్ ఉపదేశాలను పాటించడం అవసరం.
స్వర్గవాసుల ప్రాపంచిక ముఖ్యలక్షణాలు:
1. ఈమాన్ మరియు సత్కార్యం:
ఖుర్ఆన్: “మరెవరు విశ్వసించి, మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు”[సూరయె బఖరహ్, ఆయత్82]
2. మేలు మరియు సజ్జనత్వం:
ఖుర్ఆన్: “వారు ఈ విధంగా పలికినందుకుగాను అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే లభిస్తుంది”[సూరయె మాయిదహ్, ఆయత్85]
3. నమాజ్ మరియు అల్లాహ్ దాసోహానికి కట్టుబడి ఉండడం:
ఖుర్ఆన్: “వారు తమ నమాజుల(వ్యవస్థ)పై నిత్యం కొనసాగుతారు. వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది. అడిగేవారికి, అడగని వారికి కూడా. వారు ప్రతిఫల దినాన్ని దృఢంగా నమ్మే వారే ఉంటారు. వారు తమ ప్రభువు శిక్షకు భయపడుతూ ఉంటారు. నిశ్చయంగా వారి ప్రభువు శిక్ష నిర్భయంగా ఉండదగినది కాదు. వారు తమ మర్మాంగాలను (అక్రమ సంబంధాల నుండి) కాపాడుకుంటారు. అయితే తమ భార్యల విషయంలో, (ధర్మబద్ధంగా) తమ స్వాధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో మాత్రం వారు నిందార్హులు కారు. ఇక ఎవరయినా ఇదిగాక ఇంకా ఏవైనా (ఇతరత్రా అడ్డదారులు అవలంబించ) కోరితే, వారు హద్దు మీరిన వారవుతారు. వారు తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండే వారై ఉంటారు. వారు తమ సాక్ష్యాలపై నిలకడ కలిగి ఉంటారు. ఇంకా – వారు తమ నమాజులను కాపాడుతారు. ఇలాంటి వారే స్వర్గవనాలలో సగౌరవంగా ఉండేవారు”[సూరయె మఆరిజ్, ఆయత్23-35]
ఖుర్ఆన్ శుభవార్త
ఖుర్ఆన్, విశ్వాసులకు శుభవార్తను ఇలా ఇచ్చింది: “అల్లాహ్ ఔలియాలకు ఏవిధమైన భయంకానీ, విషాదం కానీ కలిగే అవకాశం లేదు. ఎందుకంటే (వాళ్ళు) ఆయనను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించినవారు. ఇహపరజీవితాలు రెండింటిలో కూడా వారికి శుభవార్తలే శుభవార్తలు. అల్లాహ్ మాటలు మారవు. ఇదే ఘన విజయం[యూనుస్:62,63,64]
మరో చోట ఇలా ప్రవచించెను: “అల్లాహ్ యే మా ప్రభువు అని పలికి ఆ మాట మీదనే స్థిరంగా నిలబడే వారిపై నిశ్చయంగా దైవదూతలు అవతరిస్తారు. వారు అతనితో ఇలా అంటారు, “భయపడకండి, బాధపడకండి; మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం అనే శుభవార్తను విని ఆనందించండి. మేము ఈ ప్రాపంచిక జీవితంలో కూడా మీకు సహచరులుగా ఉంటాము, పరలోకంలో కూడా. అక్కడ మీరు కోరినదల్లా మీకు లభిస్తుంది; మీరు ఆశించే ప్రతివస్తువూ మీదవుతుంది. ఇవీ మీకు లభించే ఆతిధ్యపు ఏర్పాట్లు, క్షమాశీలుడూ, కరుణామయుడూ అయిన దేవునివైపు నుండి”[ఫుస్సిలత్:30,31,32]
చివరిమాట
అల్లాహ్ విశ్వాసులకు మరణానికి ముందు స్వర్గ శుభవార్తను ఇస్తాడు అని ఖుర్ఆన్ నిదర్శిస్తుంది, మరి ప్రముఖ సహాబీయులు తమ చివరి నిమిషాలలో ఎందుకని "మేము మనిషి పుట్టుక పుట్టకుండా ఉంటే బాగుండేది" అని అన్నట్లూ!!! ఆలోచించడి.
రిఫరెన్స్
వ్యాఖ్యానించండి