పాపముల నుంచి ఎలా విముక్తి పొందగలము? అన్న విషయం పై ఖుర్ఆన్ మరియు హదీసుల నిదర్శనం...

పాపముల చెడును కడిగేయడం
ప్రశ్నేమిటంటే పాపముల నుంచి ఎలా విముక్తి పొందగలము?. ఇస్లామీయ బోధనల ప్రకారం పాపముల నుంచి విముక్తి చెందడానికి అతి ముఖ్యమైన మార్గం అల్లాహ్ సన్నిధిలో ఇస్తిగ్ఫార్ మరియు తౌబహ్ చేయడం. ఇస్తిగ్ఫార్ మరియు తౌబహ్ అమృతం లాంటివి అవి మనిషి ఆత్మను పవిత్రం చేయడమే కాకుండా మరెన్నో శుభాలను, అనుగ్రహాలను అతడి సొంతం చేస్తాయి.
ఇస్తిగ్ఫార్ మరియు తౌబ్ యొక్క అర్ధం
ఇస్తిగ్ఫార్, క్షమాభిక్షకు నిర్వచనం.[2] ఇస్తిగ్ఫార్ పదం, గఫర(غ ف ر) పదం నుండి తీసుకోబడినది, గఫర అనగా కప్పడం, మూసివేయడం.[3] ఇస్తిగ్ఫార్ ఇస్లామీయ పరిభాషలో అల్లాహ్ ముందు నోటితో లేదా అమలు ద్వార[4] క్షమాపణ[5] పాపములను కప్పిపెట్టమని[6] వేడుకోవడం; మరి ఈ విన్నపం యొక్క లక్ష్యం ఆ పాపముల చెడు ప్రభావముల మరియు అల్లాహ్ శిక్ష నుంచి సురక్షితంగా ఉండడం.
ఇస్తిగ్పార్ ఖుర్ఆన్ మరియు రివాయతుల దృష్టిలో
జీవితంలో ఇస్తిగ్ఫార్ మరియు తౌబహ్ యొక్క ప్రాముఖ్యతను ఖుర్ఆన్ యొక్క చాలా ఆయతులు సూచిస్తున్నాయి. అల్లాహ్ కొన్ని ఆయతులలో తన దాసులను స్పష్టంగా తౌబహ్ చేయమని ఆదేశిస్తున్నాడు: ఓ విశ్వాసులారా! అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలండి-నిష్కల్మషమైన పశ్చాత్తాపభావంతో! మీ ప్రభువు మీ పాపాలను మీనుండి దూరం చేయవచ్చు. క్రింద సెలయేళ్లు ప్రవహించే(స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు.[తహ్రీమ్:8]
నిష్కల్మషమైన పశ్చాత్తాపం నాలుగు షరత్తులు గలదు: 1. హృదయపూర్వకగా పశ్చాత్తాపం, 2. నోటితో ఇస్తిగ్ఫార్, 3. పాపమును విడిచిపెట్టడం మరియు 4. భవిష్యత్తులో మరలా పాపం చేయను అని గట్టి నిర్ణయం[7]
లోపముల పట్ల పవిత్రత
పాపములను చేయడం ఒక రకంగా మనిషిలో ఉన్న లోపం పై నిదర్శనం. నిత్యం మేము అల్లాహ్ ను లోపముల నుండి మమ్మల్ని పవిత్రుడ్ని చేయి అని వేడుకుంటూ ఉండాలి.
లోపముల అంగీకరణ విషయం అయితే మనిషి యొక్క లోపాలను లెక్కపెట్టి ఇక్కడ చెప్పడం ఈ శీర్షిక శక్తికి మించిన విషయం. అల్లాహ్ మరియు మనిషి యొక్క సంబంధాన్ని అలాగే అతడి సంబంధాన్ని తన(ఆత్మ)తో మరియు ఇతరులతో బలహీనం మరియు పాడు చేసే ప్రతీ కారణాన్ని మనిషి యొక్క లోపం అని ఇస్లాం బోధిస్తుంది. ఈ విధంగా చెడు లక్షణాలు మరియు పాపములు మనిషి కోసం లోపాలుగా భావించవచ్చు. వీటన్నీంటి నుంచి దూరమై అల్లాహ్ ఆశ్రయాన్ని పొందగము. అప్పుడే మనిషి విశ్వాసిగా మరియు ధర్మనిష్టగలవాడిగా మారగలడు.
ధర్మనిష్ఠగలవారి హృదయం
ధర్మనిష్ట కలిగివున్నవారు అత్యుత్తమ వ్యక్తులు. ఖుర్ఆన్ మరియు రివాయతులు వారిని గొప్పవారుగా నిర్ధారించడమే కాకుండా వారి ప్రత్యేక లక్షణాలు కూడా సూచిస్తున్నాయి. ఇమామ్ అలీ(అ.స) ఒక ఉపన్యాసంలో ఇలా ఉపదేశించారు: “ధర్మనిష్ఠగలవారు ఈలోకంలో కొన్ని ప్రతిష్టతలు గలరు: వారి మాటలు సత్యమై ఉంటాయి, వారి వస్త్రధారణ సాధరంగా ఉంటుంది, వారి నడకలో అణుకువ ఉంటుంది, అల్లాహ్ చేత హరామ్ గా నిర్ధారించబడినవాటి పట్ల వారి కళ్లు క్రిందికి ఉంటాయి, వారు తన చెవులను మంచి జ్ఞానం కోసం పరిమితం చేస్తారు, వారు కష్టసుఖాలలో ఒకే రకంగా ఉంటారు”[8]
ధర్మనిష్ఠ ప్రాపంచిక ఫలితాలు
ఖుర్ఆన్ లో ధర్మనిష్ఠ యొక్క ఫలితాలను మూడు రకాలుగా వివరించడం జరిగింది. 1. ప్రాపంచిక ఫలితాలు. 2. పరలోక ఫలితాలు. 3. నిరంతర ఫలితాలు. వాటి సంక్షిప్త వివరణ
ప్రాపంచిక ఫలితాలు
1. ఉపాది సమకూర్చబడుతుంది: “ఎవడయితే అల్లాహ్ కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ (సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు అతను ఊహించనయినాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు”[తలాఖ్:2, 3]
2. ఖుర్ఆన్ సన్మార్గం చూపుతుంది: “ఈ గ్రంథం (ఖుర్ఆన్) లో ఏ మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది”[బఖరహ్:2]
3. శుభాలు కురుస్తాయి: “విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నవారి కోసం అల్లాహ్ భూమ్యాకాశాల శుభాల ద్వారాలను తెరుస్తాడు”[ఆరాఫ్ సూరహ్:96]
పరలోక ఫలితాలు
1. నిశ్చయంగా భయభక్తులు గలవారు(స్వర్గ) వనాలలో, సుఖసౌఖ్యాలలో ఉంటారు.[తూర్:17]
2. అన్నింటి కంటే అత్యుత్తమ సామాగ్రి దైవభీతియే.[బఖర:197]
3. అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు.[మాయిదహ్:27]
4. ఎవడు అల్లాహ్ కు భయపడతాడో అతని పాపాలను అల్లాహ్ అతని నుండి రూపుమాపుతాడు. అతనికి గొప్ప పుణ్యఫలాన్ని వోసగుతాడు.[తలాఖ్:5].
5. మేము భయభక్తులు కలిగివున్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో మోకాళ్లపై పడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము.[మర్యామ్:72].
ధర్మనిష్ఠ నిరంతర ఫలితాలు
1. ఎవరు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహ్ కు భయపడుతూ, ధర్మనిష్ట కలిగి ఉంటారో వారే విజయం సాధించేవారు.[నూర్:52].
2. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు.[హుజరాత్:13]
3. నిశ్చయంగా అల్లాహ్, భయభక్తులుగల వారిని ప్రేమిస్తాడు.[తౌబహ్:4]
4. అల్లాహ్ భయభక్తిగలవారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి.[బఖర:194]
5. ఓ వివేకవంతులారా! అల్లాహ్ కు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.[మాయిదహ్:100]
6. అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు. అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు.[తలాఖ్:3]
ఓ అల్లాహ్! నీ దయాగుణం మరియు కారుణ్యం ద్వార మనందరి పాపములను క్షమించి మనకు మరో అవకాశాన్ని ప్రసాదించు.
రిఫరెన్స్
1. షంసుల్ ఉలూమ్, భాగం8, పేజీ4982
2. లిసానుల్ అరబ్, భాగం5, పేజీ26. అన్ నిహాయహ్, భాగం3, పేజీ373.
3. ముఫ్రదాత్, పేజీ609
4. కష్ఫుల్ అస్రార్, భాగం2, పేజీ46
5. అల్ తహ్రీర్ వల్ తన్వీర్, భాగం4, పేజీ92
6. తఫ్సీరె నమూనహ్, భాగం24, పేజీ290
7. నెహ్జుల్ బలాగహ్(సుబ్హీ సాలెహ్), పేజీ303
వ్యాఖ్యానించండి