.దైవప్రవక్త[స.అ]తో కలిసి ఉన్నంత మాత్రానా మంచివారుగా మారిపోతారు అని ఉంటే ఖుర్ఆన్ వారిని ఉద్దేశించి వారిలో కపటవర్తనులు కూడా ఉన్నారు అని ప్రవచించేది కాదు.
ఎలాగైతే ఈనాటి సమాజంలో మానవులలో మంచీ మరియు చెడు అని రెండు రకాలు ఉన్నాయో అలాగే సహాబీయులలో కూడా మంచీ మరియు చెడు సహాబీయులు ఉండేవారు. కేవలం వారి మరియు వారి తరువాత వారి మధ్య తేడా ఏమిటంటే వారు దైవప్రవక్త[స.అ] కాలంలో ఉన్నారు వారిని చూశారు, వారితో కలిసి ఉన్నారు. అంతే. చాలా సహాబీయులు కపటవర్తనులుగా ఉండేవారు. అల్లాహ్ గ్రంథం యొక్క చాలా ఆయత్ లలో మరియు దైవప్రవక్త(స.అ) యొక్క చాలా హదీసులలో ఈ మాట నిరూపించబడినది. అల్లాహ్ గ్రంథం నుండి కొన్ని సాక్ష్యాలు. అల్లాహ్ ఇలా ప్రవచించెను:
1. అసలు విషయం ఏమిటంటే అతను వారి వద్దకు సత్యాన్ని తీసుకువచ్చాడు. అయితే వారిలో చాలా మందికి సత్యమంటే అసలేపడదు.[మొమినూన్:70]
2. పల్లెటూరి బైతులు అవిశ్వాసం, కాపట్యంలో మరింత కరడుగట్టినవారు.[తౌబహ్:97]
3. మదీనాలో నివసించే వారిలోనూ కొందరు వంచనలో మహా మొండివారు.[తౌబాహ్:101]
4. మీ చుట్టుప్రక్కల ఉండేవాసులలోనూ, కొందరు వంచకులు(మునాఫిక్లు) ఉన్నారు.[తౌబాహ్:101]
వ్యాఖ్యానించండి