తవల్లా మరియు తబర్రా యొక్క అర్థాలు మరియు ఖుర్ఆన్ దృష్టిలో వాటి వివరణ...

అల్లాహ్ ఔలియాల పట్ల ప్రేమ
ఇస్లాం బోధనలలో అల్లాహ్ ఔలియాలను ఇష్టపపడే అంశం చాలా ముఖ్యమైన అంశం. దీనిని ఇస్లామీయ భాషలో “తవల్లా” అంటారు. షియా వర్గంలో దీనిని ఇస్లామీయ ప్రముఖ 10 అంశాల నుంచి ఒక ముఖ్యంశంగా విశ్వసిస్తారు. దీని అర్ధం అహ్లెబైత్(అ.స) పట్ల ప్రేమ మరియు వారి విలాయత్(అధికారానికి) కు తల వంచడం. “తవల్లా” కు ప్రతి పదం “తబర్రా”. దీని గురించి రివాయతులలో ఇలా ఉల్లేఖించబడి ఉంది: దైవప్రవక్త(స.అ) ప్రవచనం: “అత్యుత్తమ చర్య అల్లాహ్ కొరకు ఇష్టపడడం మరియ ఆయన కోసమే అసహ్యించుకోవడం”[1]
తవల్లా ఖుర్ఆన్ దృష్టిలో:
ఆయతులలో మరియు రివాయతులలో ముస్లిముల కర్తవ్యాల వివరణ క్రమంలో తవల్లా ను ముఖ్యమైనదిగా సూచించబడినది. దైవప్రవక్త(స.అ) అహ్లెబైత్(అ.స)ను ఇష్టపడం పట్ల ఖుర్ఆన్ ఇలా ఆదేశమిస్తుంది: ఓ ప్రవక్తా! వారికి చెప్పు: “దౌత్యకార్యానికి నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటంలేదు. కాని (నా) అహ్లెబైత్ ప్రేమను మాత్రం కోరుతున్నాను”[సూరయె షూరా, ఆయత్23] దైవప్రవక్త(స.అ) యొక్క దగ్గర బంధువులు అనగా హజ్రత్ అలీ(అ.స) హజ్రత్ ఫాతెమా(అ.స) హజ్రత్ హసన్(అ.స) మరియు హజ్రత్ హుసైన్(అ.స) వారి తరువాత వారి సంతానం[2]
తవల్లా మరియు దాని దశలు
1. అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు అహ్లెబైత్(అ.స)-ఇమామలు విలాయత్ ను అంగీకరించడం
2. అల్లాహ్, ఆయన ప్రవక్తల, ఇమాముల మరియు హజ్రత్ ఫాతెమా జహ్రా(అ.స) పట్ల ఇష్టం మరియు ప్రేమ కలిగి ఉండడం
3. విశ్వాసులను మరియు అల్లాహ్ కు ఇష్టమైన వారిని ఇష్టపడడం
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: “ఒకవేళ నువ్వు మంచివాడివోకాదో తెలుసుకోవాలనుకుంటే నీ హృదయాన్ని చూడు, అల్లాహ్ విధేయును ఇష్టపడుతున్నావు మరియు అవిధేయతలను అసహ్యించుకుంటున్నావు అంటే నువ్వు మంచివాడివి మరియు అల్లాహ్ నిన్ను ఇష్టపడతాడు అని అర్ధం. అదే ఒకవేళ విధేయుల పట్ల వైరం మరియు అవిధేయతల పట్ల ఇష్టం కలిగివుంటే నీలోపల ఏదీ లేనట్లే, మరియు అల్లాహ్ నిన్ను ఇష్టపడడు, మనిషి ఎవరిని ఇష్టపడతాడో నిత్యం అతడితో ఉంటాడు”[3]
అల్లాహ్ శత్రువుల పట్ల వైరం
“తబర్రా” అనగా అల్లాహ్ మరియు ఆయన ఔలియాల పట్ల అసహ్యత కలిగివుండడం. ఈ పదం ఖుర్ఆన్ లో 20 సూరహ్ లలో ఉంది. సఘంటు పరంగా తబర్రా యొక్క అర్ధం ఒక అయిష్టమైన సహవాసం నుండి దూరంగా ఉండడం, అసహ్యత అని.[4]
తబర్రా ఖుర్ఆన్ దృష్టిలో
ఖుర్ఆన్ లో ఒక సూరహ్ పేరే దీనికి సంబంధించిన పదంతో నామకరించబడి ఉంది. ముష్రికుల పట్ల అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స.అ) అసహ్యత వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఖుర్ఆన్ యొక్క 20 సూరహ్ లలో 27 ఆయతులలో ముప్ఫైసార్లు ఈ తబర్రా పదానికి సంబంధించిన పదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి “అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది? అని వారిని అడుగు. “నాకూ-నీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ ఉన్నాడు. ఈ ఖుర్ఆన్ ద్వారా నేను మిమ్మల్నీ, ఇది ఎవరెవరి వరకు చేరుతుందో వారందరినీ హెచ్చరించటానికి గాను ఈ ఖుర్ఆన్ నా వద్దకు వహీ ద్వారా పంపబడింది” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియపరచు. అల్లాహ్ తో పాటు మరి కొంతమంది దేవుళ్లు కూడా ఉన్నారని మీరు నిజంగా సాక్ష్యం ఇవ్వగలరా? “నేను మాత్రం అలాంటి సాక్ష్యం (ఇవ్వనుగాక) ఇవ్వను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. “ఆయనే ఒకే ఒక్కడైన ఆరాధ్య దేవుడు. మీరు దైవానికి కల్పించే షిర్క (భాగస్వామ్యం)తో నాకెలాంటి సంబంధం లేదు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పేయ్యి.[సూరయె అన్ఆమ్, ఆయత్19]
అలాగే దైవప్రవక్త(స.అ) కూడా తన వ్యతిరేకుల పట్ల అసహ్యతను వ్యక్తం చేశారు: ఒకవేళ వారు నిన్ను ధిక్కరిస్తూనే ఉంటే, “నా పని నాది. మీ పని మీది. నా పనుల బాధ్యత మీ పై లేదు. మీ పనుల బాధ్యత నాపై లేదు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పెయ్యి.[సూరయె యూనుస్, ఆయత్41] అలాగే వేరే సూరహ్ లలో కూడా తబర్రా గురించి సూచించబడి ఉంది.
ఈ దుఆ చివరిలో మనం అల్లాహ్ ను ఓ అల్లాహ్! అంతిమ దైవప్రవక్త[అ.స] యొక్క సున్నత్ పై నడిచేవానిగా చేయి అని వేడుకుంటున్నాము.
రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్, భాగం66, పేజీ252, హదీస్32
2. అల్ దుర్రుల్ మన్సూర్, సీవ్తీ, భాగం6, పేజీ348.
3. అల్ కాఫీ, కులైనీ, భాగం2, పేజీ127
4. రాగిబె ఇస్ఫెహానీ, ఇబ్నె మన్జూర్, సఫీ పూరీ, “برء” పదం క్రమంలో
వ్యాఖ్యానించండి