అహ్ఖాఫ్ సూరహ్

బుధ, 01/31/2018 - 04:23

.అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 46వ సూరహ్ అయిన “అహ్ఖాఫ్” సూరహ్ గురించి సంక్షిప్త వవిరణ.

అహ్ఖాఫ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 46వ సూరహ్ ఇది. “అహ్ఖాఫ్” అనగ ఆద్ అనే సమూహానికి చెందిన ప్రదేశం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 21వ ఆయత్. ఈ సూరహ్ లో “అహ్ఖాఫ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరహ్ లో 35 ఆయత్‍లు, 646 పదాలు మరియు 2668 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 6 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “జాసియహ్” సూరహ్ మరియు దీని తరువాత “జారియాత్” సూరహ్ అవతరించబడ్డాయి. ఈ సూరహ్ ను “అహ్ఖాఫ్” సూరహ్ అని నామకరణానికి కారణం ఇందులో "ఆద్" సమూహ ప్రస్తావన. ఆ సమూహం . “అహ్ఖాఫ్” అను ప్రదేశంలో ఉండేవారు. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే ప్రతీ రాత్రి లేదా శుక్రవారం “అహ్ఖాఫ్” సూరహ్ ను పఠిస్తారో, ఈ ప్రపంచంలో ఎవ్వరికి భయపడడు మరియు ప్రళయదినాన ఇన్ షా అల్లాహ్ అన్ని భయాల నుండి సురక్షితంగా ఉంటాడు.”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ136].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ136.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16