సాహస బాలుడు అయిన మొహమ్మద్ హుసైన్ ఫహ్మీదెహ్ యొక్క వీరత్వంతో కూడి ఉన్న జీవిత చరిత్ర...
మొహమ్మద్ హుసైన్ ఫహ్మీదెహ్ తండ్రి పేరు మొహమ్మద్ తఖీ, ఇతడు 1346 (ఇరాన్ సంవత్సరాలనుసారం)లో ఒక మతానుచార కుటుంబంలో ఖుమ్ పట్టణానికి చెందిన పాంనార్ అనే పేటలో జన్మించాడు. అతడు తన బాల్యాన్ని తన బంధుమిత్రుల పిల్లలు మరియు తన సోదరుడి (ఇతడు కూడా మొహమ్మద్ హుసైన్ ఫహ్మీదెహ్ మరణించిన 3 సంవత్సరాల తరువాత షహీద్ చేయబడ్డాడు) తో కలిసిమెలసి ప్రేమతో తల్లిదండ్రుల ఆధ్వర్యంలో గడిచింది. మొహమ్మద్ హుసైన్ ఫహ్మీదెహ్ 1352వ సంవత్సరంలో స్కూల్ కు వెళ్లడం మొదలు పెట్టాడు. పస్ట్ నుండి ఫోర్త్ క్లాస్ వరకు ఒక ఆధ్యాత్మిక టీచర్ వద్ద చదువుకున్నాడు. ఐదవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు కరజ్ పట్టణానికి వలసి వెళ్లడంతో అక్కడి రెండు స్కూళ్లలో చదువుకున్నాడు. ఈ కాలంలోనే అతడి జీవితంలో కూడా మిగత యువకుల వలే మార్పులు వచ్చాయి. అతడు ఆతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) ను చాలా ఇష్టపడేవాడు, అతడి ఆదేశాలను మనసారా స్వీకరించేవాడు. అతడు ..ఇమామ్(ర.అ) ఏది చెబితే నేను అదే చేస్తాను నేను అతడికి లోబడి ఉన్నాను..
మొహమ్మద్ హుసైన్ ఫహ్మీదెహ్ కు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుర్దిస్తాన్ సంఘటన జరిగింది. కుర్దిస్తాన్ చేరుకున్నాడు కాని చిన్న వయసు అని కమెటీ మెంబర్స అతడిని తిరిగి పంపించి తల్లి అనుమతి లేకుండా కరజ్ పట్టణం నుండి బయటికి రాకూడదు అని ఒప్పందం చేయించాలనుకున్నారు కాని అతడు ఒప్పుకోలేదు. అతడు వారితో మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకండి. ఇమామ్(ర.అ) చెబితే ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. యుద్ధం మొదలైనా రోజుల్లోనే మొహమ్మద్ హుసైన్ ఫహ్మీదెహ్ యుద్ధానికి వెళ్లాలని శత్రువులతో యుద్ధం చేయాలని నిర్ణియించుకున్నాడు.
అతడు యుద్ధానికి వెళ్లుతున్నాడు అన్న విషయం గురించి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కరజ్ కు చెందిన ఒక హాస్పిటల్ లో అతడి ఒక మిత్రుడు ఎడిమిట్ అయి ఉంటే అతడితో వీడ్కోలు కోసం వెళ్లి యుద్ధం గురించి, తన కర్తవ్యం గురించి చెప్పాడు. ఒకరోజు రొట్టెలు కొనుక్కోవడానికి ఇంటి నుండి బయటకు వచ్చి 50 తుమాన్లను తన స్నేహితుడికి ఇచ్చి రొట్టెలు కొని ఇంట్లో ఇచ్చి తను ఖూజిస్తాన్ వెళ్తున్న విషయాన్ని చెప్పాడు. నేను వెళ్తున్న విషయం మూడు రోజుల వరకు తెలియకుండా ఉంచు ఆ తరువాత వాళ్లతో చెప్పు లేకపోతే వాళ్లు నన్ను వెళ్లకుండా అడ్డుపడతారు అని అన్నాడు. తెహ్రాన్ లో ఉన్న ఒక కమెటీకి అతడి నిర్ణయం తెలిసింది వాళ్లు అతడితో మాట్లాడి తన నిర్ణయాన్ని మార్చుకో అని సర్ధి చెప్పారు కాని వాళ్లు విఫలమయ్యారు.
మొహమ్మద్ హుసైన్ ఫహ్మీదెహ్ తన నిర్ణయంలో దృఢత్వం కలిగి ఉండడంతో దక్షణ ఇరాన్ కు చెందిన పట్టణాలకు చేరుకున్నాడు అయితే యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లే గుంపులతో కలిసే వెళ్లాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అఫ్సరీ కాలేజ్ యువత యొక్క విప్లవ గ్రూప్ తో కలిశాడు, ఆ గ్రూప్ యొక్క కమాండర్ వద్దకు వెళ్లి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని కోరాడు కాని అతను ఒప్పుకోలేదు చాలా చేపు బ్రతిమాలి ఒక వారం వరకు కోసం ఖుర్రం షహ్ర్ కు తీసుకొని వెళ్లమని కోరాడు. అతడు ఆ కొద్ది కాలంలో ఏ పని వచ్చినా దానిని ఇష్టంగా ముందుకొచ్చి చేసేవాడు, తన సామర్థ్యాన్ని మరియు ప్రతిభను వ్యక్తం చేస్తూ ఉండేవాడు. ఈ కొద్ది కాలంలోనే ఖుర్రం షహ్ర్ లో తన స్నేహితుడు మొహమ్మద్ రిజా షంమ్స్ తో పాటు గాయపడ్డాడు, వారిద్దరినీ హస్పిటల్ కు తరలించారు. ఆ తరువాత ఆ గ్రూప్ లీడర్ వారిని వ్యతిరేకించినా మరియు గాయాలు ఉన్నా సరే యుద్ధానికి సిద్ధమై ఖుర్రం షహ్ర్ కు చేరుకున్నారు.
కమాండర్ అతడిని యుద్ధం భూమికి వెళ్లకుండా ఆపినప్పుడు అతడి కళ్లు కన్నీళ్లతో నిండి పోయాయి, దుఖంతో కమాండర్ తో ఇలా అన్నాడు.. ..నేను యుద్ధభూమిలో యుద్ధానికి అర్హుడను అని మీకు నేను నిరూపిస్తాను..
రిఫరెన్స్
https://hawzah.net/fa/Article/View/117095/زندگی-نامه-کامل-شهید-محمد-حسین-فهمیده
వ్యాఖ్యానించండి