ఆయతుల్ కుర్సీ ప్రాముఖ్యత

బుధ, 01/31/2018 - 20:31

ఆయతుల్ కుర్సి ప్రాముఖ్యత పవిత్ర మాసూముల హదీసులలో.

ఆయతుల్ కుర్సీ ప్రాముఖ్యత

ఆయతుల్ కుర్సీ పవిత్ర ఖురాన్ యొక్క గొప్ప మరియు అత్యంత పవిత్రమైన ఆయతులలో  ఒకటి, హదీసులలో దాని గురించి చాల రకమైన ఆధ్యాత్మిక ఫలితాలు లిఖింపబడ్డాయి,వాటిలో కొన్నింటిని మేము ఇక్కడ ప్రస్థావిస్తున్నాము:
1. నమాజు స్వీకరింపబడుతుంది
మహాప్రవక్త[స.అ.వ] ఈ విధంగా ఉల్లేఖించారు: "ఎవరైతే ప్రతీ నమాజు తరువాత దీనిని పఠిస్తారో వారి నమజు ఆ దేవుని సన్నిధిలో స్వీకరింపబడును మరియు మరియు అతను ఆపత్తుల నుండి ఆ దేవుని రక్షణలో ఉంటాడు.
2. ప్రతీ నమాజు తరువాత దానిని పఠించటం
మహప్రవక్త ఈ విధంగా సెలవిచ్చారు: "ఎవరైతే దీనిని(ఆయతుల్ కుర్సీని) ప్రతీ నమాజు తరువాత పఠిస్తారో వారిపై ఏడు ఆకాశద్వారాలు తెరువబడి, ఎప్పటి వరకు ఐతే ఆ అల్లాహ్ క్రుపాద్రుష్టితో అతనివైపు చూడడో ఆకాశద్వారాలు మూసుకుపోవు, దాని తరువాత అల్లహ్ ఒక దేవదూతను ఆ వ్యక్తి కర్మచిట్టాలలో తరువాతి రోజు వరకు ఉపకారములు వ్రాయవలెనని మరియు అతని అపరాధములు చెరిపివేయమని ఆజ్ఞాపిస్తాడు".
3. కాటువేసే జంతువుల నుండి రక్షణ
ఇమాం కాజిం[అ.స]ల వారు ఈ విధంగా ప్రవచించారు: "ఎవరైతే ప్రతీ నమాజు తరువాత ఆయతుల్ కుర్సీని పఠిస్తారో వారికి కాటు వేసే విషయుక్త జంతువుల నుండి ఎటువంటి హానీ జరగదు".
4. మీ ప్రయాణాన్ని ఆయతుల్ కుర్సితో ప్రారంభించండి
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: "మీ ప్రయాణాన్ని సద్ఖా[దానం] లేదా ఆయతుల్ కుర్సితో ప్రారంభించండి".
5. వుజూ తరువాత ఆయతుల్ కుర్సీని పఠించడానికి గల పుణ్యం
ఇమాం బాఖర్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: "ఎవరైతే వుజూ చేసిన తరువాత ఒక సారి ఆయతుల్ కుర్సీని పఠిస్తారో వారికి ఆ అల్లాహ్ నలభై సంవత్సరాల తనను ఆరాధించటానికి గల పుణ్యమును వారికి ప్రదానం చేస్తాడు మరియు వారి హోదా నలభై రెట్లు పెంచబడుతుంది".

రెఫరెన్స్
1. ల ఆలియుల్ అఖ్బార్,1వ భాగం,పేజీ నం:208 మరియు 3వ భాగం,పేజీ నం:357
2. మసబీహుద్ దుజా,పేజీ నం:1011
3. ఫురూయె కాఫి,4వ భాగం,పేజీ నం:283.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19