హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యదార్థగాధ

గురు, 02/01/2018 - 16:44

.దైవప్రవక్త[స.అ] ప్రియ కూమార్తె అయిన హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ఇంటిని సహాబీయులలో కొందరు తగలబెట్టిన విషయం ఒక కల్పిత కథనం కాదు ఒక యదార్థగాధ.

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యదార్థగాధ

ఖుర్ఆన్ మరియు ఇరువర్గాల వారి ఖుర్ఆన్ వ్యాఖ్యానం, హదీస్ మూల గ్రంథాలలో ఉల్లేఖించబడిన హదీసుల మరియు ఉలామాల ప్రస్తావనల ద్వార హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క ప్రతిష్టత, ఆమె గొప్పతనం, ఆమె మహోన్నతం అందరికి తెలిసిందే. కాని కొందరు ఆ మహోన్నతాన్ని మరియు ప్రతిష్టతను చూసీ చూడనట్లుగా వారిని కించపరిచారు. ఇది కప్పిపెట్టే విధమైన విషయం కాదు. ఇది ఒక కల్పిత కథనం కాదు ఒక యదార్థగాధ.  
ఇక్కడ మేము అహ్లె సున్నత్ గ్రంథాల నుండి ఆమెను ఆమె ఇంటిని కించపరచిన అంశాలను వివరించేటువంటి హదీసును ప్రదర్శిస్తున్నాము:
“అబూబక్ర్ ఇబ్నె అబీ షైబహ్” సరైన రావీయుల క్రమం ద్వార ఇలా ఉల్లేఖించెను: “ప్రజలు అబూబక్ర్ తో బైఅత్ చేస్తున్నప్పుడు, అలీ[అ.స] మరియు జుబైర్ లు హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ఇంట్లో చర్చించుకుంటున్నారు. ఈ వార్త ‘ఉమర్ ఇబ్నె ఖత్తాబ్’కు చేరింది. అతను ఫాతెమా జహ్రా[స.అ] ఇంటికి వచ్చి ఇలా అన్నారు: ‘ఓ దైవప్రవక్త[స.అ] కుమార్తె! నీ తండ్రి మా కోసం అతి గౌరవనీయులు, నీ తండ్రి తరువాత స్వయంగా నీవు. కాని అల్లాహ్ సాక్షిగా ఈ ఇష్టం, ఒకవేళ వీళ్ళు నీ ఇంట్లో చేరితే నేను ఈ ఇంటిని తగలబెట్టేయమని ఆదేశించడాన్ని అడ్డుకోదు. ఈ వాక్యాన్ని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అలీ[అ.స] మరియు జుబైర్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, దైవప్రవక్త[స.అ] కుమార్తే అలీ[అ.స] మరియు జుబైర్ తో ఇలా అన్నారు: ‘ఉమర్ నా వద్దకు వచ్చి ప్రమాణం చేసి ఒకవేళ ఇంకోసారి సమావేశం జిరిగితే ఇంటిని తగలబెడతానని చెప్పారు, అల్లాహ్ సాక్షిగా! అతను ప్రమాణం చేశారు, అమలు పరుస్తారు.[ముసన్నఫ్, ఇబ్నె అబీ షైబహ్, భాగం8, పేజీ572, కితాబుల్ మగాజీ].
ఇలాంటి రివాయతులే ఇంకా వేరే గ్రంథాలలో కూడా ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ త్వరలోనే వాటిని కూడా అనువదించి మీ ముందుకు తీసుకొని వస్తాము.

రిఫ్రెన్స్
ముసన్నఫ్, అబూబక్ర్ ఇబ్నె అబీ షైబహ్, కితాబుల్ మగాజీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22