షిర్క్ మరియు బహుదైవారాధన మరియు దాని పరిణామాల గురించి ఖుర్ఆన్ నిదర్శనలు...
షిర్క్ అనగ సమానం మరియు సాటిని విశ్వసించడం. అనగ అల్లాహ్ విషయంలో రూపురేఖలు, పోలికలు మరియు ప్రతిమను అంగీకరించడం, అది అల్లాహ్ అస్థిత్వంలో అయినా లేదా గుణవిశేషాలలో అయినా లేదా సృష్టిపరంగా అయినా లేదా ఆరాధన పరంగా అయినా గాని. సాధారణ భాషలో చెప్పాలంటే షిర్క్ అనగ బహుదేవారాధన. ఖుర్ఆన్ దృష్టిలో షిర్క్ మహాపాపం. ఖుర్ఆన్ ఉపదేశానుసారం అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం ఘోరమైన అన్యాయం. వీటినే వివరిస్తూ అల్లాహ్ తన గ్రంథంలో అవతరించిన కొన్ని ఆయత్ ల వివరణ:
షిర్క్, క్షమించరాని పాపము కేవలం తౌబా ద్వారానే క్షమార్హులవుతారు; అల్లాహ్ ఇలా ప్రవచించెను: తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని(షిర్క్ ను) అల్లాహ్ ఏమాత్రం క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపములను క్షమిస్తాడు. అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించిన వాడు ఘోరపాపంతో కూడిన కల్పన చేశాడు.[1]
షిర్క ఘోరమైన అన్యాయం; అల్లాహ్ ఇలా ప్రవచించెను: “లుఖ్మాన్ తన కుమారునికి హితభోధ చేస్తూ ఇలా అన్నాడు: కమారా! అల్లాహ్ కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా షిర్క్ ఘోరమైన అన్యాయం”[2].
షిర్క్ పరిణామాలు
ప్రపంచాని ఒక లెక్కుంది, ఆ లెక్క ప్రకారం మనిషి చేసే ప్రతీ పనికి ఒక పరిణామం ఉన్నట్లే షిర్క్ కు కూడా పరిణామాలు ఉన్నాయి. వాటి గురించి స్వయంగా అల్లాహ్ యే ఖుర్ఆన్ లో ఇలా వివరించెను:
మనము చేసుకున్నదంతా వృధా అవుతుంది; ఖుర్ఆన్ ప్రవచనం: “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది”[3]
అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) అసహ్యపడతారు; ఖుర్ఆన్ ప్రవచనం: “అల్లాహ్ తరపు నుంచీ, ఆయన ప్రవక్త తరపు నుంచీ పెద్ద హజ్ దినాన ప్రజలకు తెలియజేయునది ఏమనగా, అల్లాహ్ ముష్రికులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు అలాగే ఆయన ప్రవక్త కూడా”[4].
వారి అపవిత్ర శరీరం మరియు ఆత్మ కలిగి ఉన్నారు; ఖుర్ఆన్ ప్రవచనం: “విశ్వసులారా! ముష్రికులు అశుద్ధులు. కాబట్టి ఈ ఏడాది తరువాత వారు మస్జిదె హరామ్ దరిదావులకు కూడా రాకూడదు”[5].
స్వర్గంలో ప్రవేశించలేరు; ఖుర్ఆన్ ప్రవచనం: “ఎవడు అల్లాహ్ కు భాగస్వాములగా ఇతరులను కల్పించాడో(ముష్రికీన్) అలాంటి వానికోసం నిస్సందేహముగా అల్లాహ్ స్వర్గాన్ని నిషేదించాడని తెలుసుకోండి”[6].
రిఫరెన్స్
1. సూరయె నిసా, ఆయత్48.
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَنْ يَشَاءُ ۚ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
2. సూరయె లుఖ్మాన్, ఆయత్13.
وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
3. సూరయె జుమర్, ఆయత్65.
وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
4. సూరయె తౌబహ్, ఆయత్3.
وَأَذَانٌ مِنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى النَّاسِ يَوْمَ الْحَجِّ الْأَكْبَرِ أَنَّ اللَّهَ بَرِيءٌ مِنَ الْمُشْرِكِينَ ۙ وَرَسُولُهُ ۚ فَإِنْ تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَكُمْ ۖ
5. సూరయె తౌబహ్, ఆయత్28.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْمُشْرِكُونَ نَجَسٌ فَلَا يَقْرَبُوا الْمَسْجِدَ الْحَرَامَ بَعْدَ عَامِهِمْ هَٰذَا ۚ
6. సూరయె మాయిదహ్, ఆయత్72.
إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ
వ్యాఖ్యానించండి