హుజురాత్ సూరహ్

ఆది, 02/04/2018 - 04:45

.ఖుర్ఆన్ యొక్క 49వ సూరహ్ అయిన “హుజురాత్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

హుజురాత్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 49వ సూరహ్ ఇది. “హుజురాత్” అనగ గదులు. హుజ్రహ్ యొక్క బహువచనం అనగ గది. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని 4వ ఆయత్. ఈ సూరహ్ లో “హుజురాత్” అను పదం ఒకసారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా ఒకే సారి సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 18 ఆయత్‍లు, 353 పదాలు మరియు 1533 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 27 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “ముజాదిలహ్” సూరహ్ మరియు దీని తరువాత “తహ్రీమ్” సూరహ్ అవతరించబడ్డాయి. “హుజురాత్” సూరహ్ నామకరణానికి కారణం “హుజురాత్” పదం ఇందులో మాత్రమే ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే “హుజురాత్” సూరహ్ ను రాత్రింబవళ్ళు పఠిస్తారో అతను దైవప్రవక్త దర్శించుకున్న వారి నుండిగా నిర్ధారించబడతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ214].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ214.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18