నజ్మ్ సూరహ్

మంగళ, 02/06/2018 - 04:01

.పవిత్ర ఖుర్ఆన్ యొక్క 53వ సూరహ్ అయిన “నజ్మ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

నజ్మ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 53వ సూరహ్ ఇది. “నజ్మ్” అనగ నక్షత్రం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “నజ్మ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 13 సార్లు(“నజ్మ్” 4 సార్లు మరియు “నుజూమ్” 9 సార్లు) వచ్చింది. ఈ సూరహ్ లో 62 ఆయత్‍లు, 360 పదాలు మరియు 1432 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 3 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మక్కా లో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఇఖ్లాస్” సూరహ్ మరియు దీని తరువాత “అబస్” సూరహ్ అవతరించబడ్డాయి. “నజ్మ్” సూరహ్ నామకరణానికి కారణం “నజ్మ్” పదంతో ఈ సూరహ్ మొదలవ్వడం. ఈ సూరహ్ యొక్క ప్రాముఖ్యత మేరాజ్ సంఘటన ప్రస్తావన. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఏ వ్యక్తి అయితే నిరంతరం “నజ్మ్” సూరహ్ ను పఠిస్తాడో అతడు ప్రజలకు ప్రియుడవుతాడు, ప్రజలు అతడిని ప్రశంసిస్తారు, అతడిని గౌరవిస్తారు. క్షమించబడి ఈ లోకం నుండి వెళతాడు(మరణిస్తాడు)”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ284].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ284.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11