మృత్యువు సమయంలో ఎవరైతే ఆ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మరియు ఇతర మాసూములపై బలమైన విశ్వాసాన్ని కలిగివుంటారో వారిపై షైతాన్ యొక్క నయవంచనలు ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు.
ఎప్పుడైతే మానవునికి మరణ ఘడియలు సమీపిస్తాయో అప్పుడు షైతాన్ లేదా అతని మిత్రులు ఆ మరణించే వ్యక్తి ముందుకు అనేక రూపములలో వస్తారు ఎదో ఒక మాదిరి అతనిని మోసగించి తన ఈమాన్[మతపరమైన విశ్వాసాన్ని] ఎలగైనా అతని నుంచి లాక్కొవాలని కృషి చేస్తారు.
మృత్యువు సమీపించిన మానవునికి ఆ సమయంలో చాల దాహం వేస్తుంది,అప్పుడు షైతాన్ అతని నుండి తన ఈమాన్ ను దూరం చేయడానికి ఈ అవకాశాన్ని అదనుగా భావించి అతని ముందు చల్లటి నీటిని హాజరు పరుస్తాడు,షైతాన్ ను గుర్తించని ఆ వ్యక్తి షైతాన్ ను త్రాగటానికి కొంత నీటిని ఇవ్వమని అడుగుతాడు,దాని జవాబులో షైతాన్ ఆ వ్యక్తితో ఈ విధంగా సంభోదిస్తాడు:
"ఒక వేళ నీవు ఈ చల్లటి నీటిని త్రాగాలి అనుకొంటే నువ్వు "ఈ లోకంలో ఎలాంటి ఆరాధ్యుడు లేడు" అని పలుకు,ఒక వేళ ఆ వ్యక్తి నుండి ఎలాంటి జవాబు రాకపోతే షైతాన్ అతని నుండి తన ముఖాన్ని తిప్పుకొని ఆ వ్యక్తి కాళ్ళ వద్దకు వెళ్ళి ఆ నీటి పాత్రను మెదుపుతాడు,అది చూసి ఆ వ్యక్తి[విస్వాసి] మరలా ఒక సారి త్రాగటానికి నీటిని ఇవ్వమని అడుగుతాడు,నీవు ఈ నీటి త్రాగాలి అనుకొంటే ఈ విధంగా పలుకు:"మొహమ్మద్[స.అ.వ్] నా ప్రవక్త కాదు" ఒక వేళ ఆ వ్యక్తి నీటి కోసం ఆశపడి అదేవిధంగా పలికితే అవిశ్వాసునిగా ఈ లోకన్ని వదిలి వెళతాడు,అప్పుడు షైతాన్ ఆ పాత్ర లోని నీటిని పారబోసి ఆ పాత్రను కూడ పగలగొట్టి "నేను నా పనిని పూర్తి చేసాను ఇక నీతో నాకు పని లేదు" అని చెప్పి వెళ్ళిపోతాడు,ఒక వేళ ఆ వ్యక్తి దేవునిపై బలమైన విశ్వాసం కలిగి వుంటే ఆ విధంగా పలకకుండా షైతాన్ మాటలపై ద్రుష్టి సారించడు.
షైతాన్ నయవంచనలకు లొంగకుండా ఉండాలంటే:
1. ఇతరుల హక్కులో అన్యాయం చేయకూడదు
2. "దువాయె అద్లియ" ఎక్కువగా పఠించాలి
3. మహప్రవక్త[స.అ.వ్] మరియు ఇతర మసూములపై బలమైన విశ్వాసం కలిగి ఉండాలి
4. చెసిన నమజులను చెడగొట్టుకోకుండా వాటిని జాగ్రత్తపరుచుకోవాలి మరియు వాటిని వాటి యొక్క సమయంలో పూర్తిచేయాలి.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:"ఎవరైతే తమ నమాజులను జాగ్రత్తపరుచుకుంటారో మరియు వాటిని వాటికి గల షరతులతో పూర్తిచేస్తారో వారి జీవితపు చివరి ఘడియలలో ఎప్పుడైతే షైతాన్ ఆ వ్యక్తి విశ్వాసాన్ని అతని నుండి దూరం చేయాలని వస్తాడో అప్పుడు మలకుల్ మౌత్[ఇజ్రాఈల్] ఆ షైతాన్ ను అతని దగ్గర నుండి తరిమివేసి అతనికి షహాదతైన్[రెండు షహాదత్ లు]లను చదివిస్తారు".
రెఫరెన్స్:
ఇన్సాన్ అజ్ మర్గ్ తా బర్జఖ్, నేమతుల్లహ్ సాలెహి.
వ్యాఖ్యలు
AllahuAkbar
Allaho akbar. .......mashallah. .
వ్యాఖ్యానించండి