హదీద్ సూరహ్

గురు, 02/15/2018 - 10:19

.పవిత్ర ఖుర్ఆన్ యొక్క 57వ సూరహ్ అయిన “హదీద్” గురించి సంక్షిప్త వివరణ.

హదీద్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 57వ సూరహ్ ఇది. “హదీద్” అనగ లోహము. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని 25వ ఆయత్. ఈ సూరహ్ లో “హదీద్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 6 సార్లు వచ్చింది(“హదీద్” సూరహ్ 25వ ఆయత్ లో, “కహఫ్” సూరహ్ 96వ ఆయత్ లో, “హజ్” సూరహ్ 21వ ఆయత్ లో, “సబా” సూరహ్ 10వ ఆయత్ లో, “ఖాఫ్” సూరహ్ 22వ ఆయత్ లో మరియు “ఇస్రా” సూరహ్ 50వ ఆయత్ లో). ఈ సూరహ్ లో 29 ఆయత్‍లు, 574 పదాలు మరియు 2545 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 32 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “జిల్జాల్” సూరహ్ మరియు దీని తరువాత “ముహమ్మద్” సూరహ్ అవతరించబడ్డాయి. “హదీద్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో 25వ ఆయత్ లో “హదీద్”(లోహము) యొక్క ప్రాముఖ్యత ప్రస్తావనం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఏ వ్యక్తి అయితే హదీద్ మరియు ముజాదిలహ్ సూరహ్ లను నమాజ్ లో పఠిస్తారో అల్లాహ్ వారిని ఎప్పటికీ శిక్షించడు. అతను తన విషయంలో గాని లేదా తన కుటుంబ విషయంలో గాని ఏ విధమైన చేడు(దుస్థితి)ను చూడడు. అతని శరీరం ఎటువంటి అవసరానికి గురికాదు”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ381].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ381.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13