ముజాదిలహ్ సూరహ్

గురు, 02/15/2018 - 10:26

.పవిత్ర ఖుర్ఆన్ యొక్క 58వ సూరహ్ అయిన “ముజాదిలహ్” గురించి సంక్షిప్త వివరణ.

ముజాదిలహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 58వ సూరహ్ ఇది. “ముజాదిలహ్” అనగ పదం “జదల్” నుండి తయారు చేయబడ్డ పదం ఇది, అనగా యుద్ధం మరియు పోట్లాట ఒకసారి ఖడ్గాలతో జరిగితే ఒక్కోసారి నోళ్ళతో జరుగుతుంది. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ముజాదిలహ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 9 సార్లు(పలు రకాలుగా ఉదాహరణకు “జాదల్తుమ్”, “జాదల్తనా”, “జాదిలు”, “తుజాదిలు” మొ॥) వచ్చింది. ఈ సూరహ్ లో 22 ఆయత్‍లు, 474 పదాలు మరియు 2046 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 40 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “మునాఫిఖూన్” సూరహ్ మరియు దీని తరువాత “హుజురాత్” సూరహ్ అవతరించబడ్డాయి. “ముజాదిలహ్” సూరహ్ ను “జిహార్” మరియు “ఖద్ సమిఅ” అని కూడా అంటారు. “ముజాదిలహ్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో మొదటి ఆయత్ లో “ముజాదిలహ్” అను పదం వచ్చింది. అందులో ఒక స్త్రీ ఆమె భర్త విషయంలో దైవప్రవక్త[స.అ] తో సంభాషణ చేసింది. ఈ సూరహ్ కు రెండు ప్రత్యేకతలున్నాయి అవి: 1. ఖుర్ఆన్ లో ఉన్న సూరహ్ లన్నీంటిలో కేవలం ఇందులోనే ప్రతీ ఆయత్ లో “అల్లాహ్” పదం ఉంది. 2. ఇస్లామీయ ఫిఖాకు చెందిన “జిహార్” అంశం ఇందులోనే ప్రస్తావించబడింది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ముజాదిలహ్ సూరహ్ ను పఠించేవాడు ప్రళయదినాన అల్లాహ్ కు సంబంధించిన సమూహానికి చెందినవాడై ఉంటాడు”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ407].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ407.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12