ముమ్తహినహ్ సూరహ్

బుధ, 02/21/2018 - 17:51

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 60వ సూరహ్ అయిన “ముమ్తహినహ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ముమ్తహినహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 60వ సూరహ్ ఇది. “ముమ్తహినహ్” అనగ పరీక్షించబడ్డ స్ర్తీ. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని 10వ ఆయత్. ఈ సూరహ్ లో “ముమ్తహినహ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 2 సార్లు(“ముమ్తహినహ్” సూరహ్ లో 10వ ఆయత్ లో మరియు “హుజురాత్” సూరహ్ లో 3వ ఆయత్ లో) వచ్చింది. ఈ సూరహ్ లో 13 ఆయత్‍లు, 352 పదాలు మరియు 1560 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 21 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “అహ్జాబ్” సూరహ్ మరియు దీని తరువాత “నిసా” సూరహ్ అవతరించబడ్డాయి. “ముమ్తహినహ్” సూరహ్ ను “ఇమ్తిహాన్” మరియు “మవద్దత్”అని కూడా అంటారు. “ముమ్తహినహ్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో 2వ ఆయత్ లో ముహాజిర్ స్ర్తీలను పరీక్షించమనే ఆదేశం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే యౌమియా నమాజ్ లేదా ముస్తహబ్ నమాజ్ లో “ముమ్తహినహ్” సూరహ్ ను పఠిస్తారో అల్లాహ్ అతని హృదయాన్ని ఈమాన్ తో నింపేస్తాడు, కళ్ళను ప్రకాశవంతం చేస్తాడు, దరిద్రం మరియు ఆకలికి గురికాడు, స్వయంగా అతను మరియు అతని సంతానం కూడా పిచ్చి నుండి రక్షింపబడతారు”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ443].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ443.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15