సఫ్ఫ్ సూరహ్

బుధ, 02/21/2018 - 17:58

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 61వ సూరహ్ అయిన “సఫ్ఫ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

సఫ్ఫ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 61వ సూరహ్ ఇది. “సఫ్ఫ్” అనగ క్రమం, వరుస. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని 4వ ఆయత్. ఈ సూరహ్ లో “సఫ్ఫ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 7 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 14 ఆయత్‍లు, 226 పదాలు మరియు 966 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 17 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “తగాబున్” సూరహ్ మరియు దీని తరువాత “జుముఅహ్” సూరహ్ అవతరించబడ్డాయి. “సఫ్ఫ్” సూరహ్ ను “హవారియ్యూన్” మరియు “ఈసా”అని కూడా అంటారు. “సఫ్ఫ్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో ఇస్లామీయ వీరుల సైన్యం సిద్ధమైన విషయం ప్రస్తావనం ఉంది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే “సఫ్ఫ్” సూరహ్ ను పఠిస్తారో మరియు దానిని నమాజ్ లలో నిరంతరం పఠిస్తూ ఉంటారో అల్లాహ్ అతనిని దైవప్రవక్తల మరియు దైవదూతల వరుసలో నిర్ధారిస్తాడు”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ459].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ459.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15