ఖుర్ఆన్ దృష్టిలో అల్లాహ్ కరుణకు నాలుగు కారణాలు. దాని సంక్షిప్త వివరణ.
1. ఖుర్ఆన్ అనుచరుణ
మరియు ఇది(ఖుర్ఆన్) మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది.[అన్ఆమ్:155].
2. ఖుర్ఆన్ పారాయణం సమయంలో నిశ్శబ్దంగా ఉండడం
దివ్యఖుర్ఆన్ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు.[అఅరాఫ్:204].
3. అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నం మరియు ధర్మనిష్ట పాటించడం
విశ్వాసులు అన్నదమ్ములు. కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు[హుజురాత్:10].
4. కష్టనష్టాల పట్ల సహనంగా ఉండడం
సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి...... వారి పై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి.[బఖరహ్:155 మరియు 157]
వ్యాఖ్యానించండి