మృత్యువు గురించి ఇమాం అలీ[అ.స్]ల వారి ఉపదేశం!

సోమ, 02/26/2018 - 16:45

మృత్యువు మరియు ఇహలోకం యొక్క వాస్తవికత ఇమాం అలి[అ.స్]ల వారి ద్రుష్టిలో.

మృత్యువు గురించి ఇమాం అలీ[అ.స్]ల వారి ఉపదేశం!

ఓ అల్లాహ్ దాసులారా!ఈ లోకాన్ని విడవవలసిందిగా నేను మీకు ఉపదేశిస్తున్నాను,అది మాత్రం మిమ్మల్ని విడవనుంది అయితే మీకు మాత్రం దానిని విడిచి ఉండటం ఇష్టం లేదు,అది మీ దేహాలను కుళ్ళి కృషించిపోయిన యముకలవలె మార్చేయనుంది,ఈ లోకం యొక్క ఉపమానం కొంతమంది బాటసారుల లాంటిది,వారు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన కొద్దిసేపటికే వారి గమ్యం వచ్చేసింది,ఈ లోకం ద్వారా లభించే ప్రతిష్టత మరియు గౌరవాన్ని కోరుకోకండి మరియు దాని ద్వారా లభించే ఆనందదాయకమైన జీవితంతో ఆనందపడకండి,దాని ద్వారా వచ్చే కష్టాలు,కఠినమైన పరిస్థితులలో దానిని తప్పుబట్టకండి,ఎందుకంటే దాని ద్వార లభించే గౌరవం మరియు సుఖం రెండూ అంతరించిపోనున్నాయి మరియు దాని ద్వారా  వచ్చే కష్టాలు కూడా అంతరించిపోయేవే!భూమండలంపై ఉన్న ప్రతీ జీవి నసించిపోవక తప్పదు,మీ ముందు వారి గాధలలో లభించే హితోపదేసాలు మీకు చాలవా?వారి యొక్క గాధలు మీకు గుణపాఠం కాదా?[ఒక వేళ మీరు ఆలొచిస్తే,అర్ధం చేసుకొంటే],మీ ముందు జీవించిన వారిని నువ్వు చూసి లేవా?వెళ్ళిన వారు తిరిగి రాలేదు వారి తరువాత జీవిస్తున్న వారు కూడా శాస్వతంగా బ్రతికి ఉండరు,మీరు ఈ లోకులను చూడటం లేదా?వారు ఏ విధంగా సంసారిక జంఘాటంలో రాత్రింబవళ్ళు గడుపుతున్నారో!ఒక వైపు చూస్తున్నాము చనిపోయిన వాళ్ళ మీద ఏడ్చేవారు ఏడుస్తున్నారు మరోవైపు రోగాల బారిన పడి ఉన్నవారు కూడా ఉన్నారు,ఆ రోగులను పలకరించే వారు వారిని పలకరిస్తూ ఉన్నరు,మరికొందరు ప్రాణాలను విడుస్తున్నారు, మరికొందరు లోకాన్ని అన్వేషిస్తూ ఉన్నారు[లోకవ్యవహారాలలో మునిగి ఉన్నారు] కానీ మ్రుత్యువు వారిని అన్వేషిస్తూ ఉన్నది,మరికొందరైతే మ్రుత్యువు పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు కానీ మ్రుత్యువు వారి పట్ల నిర్లక్ష్యంగా లేదు,మీ ముందు జీవించిన వారి మాదిరిగానే మిగిలిన వారు కూడా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను,చెడు పనులను చేసేటప్పుడు మ్రుత్యువును కూడా గుర్తుంచుకోండి!అది మీ యొక్క అన్ని స్వాధిష్టాలను చెరిపివేయనుంది మరియు శారీరక సుఖాలను కూడా నాశనం చేసేస్తుంది అల్లాహ్ యొక్క తప్పనిసరి హక్కులను పూర్తిచేయటానికి మరియు ఆ అల్లాహ్ ద్వారా మీకు లభించిన లెక్కలేనన్ని అనుగ్రహాలకు మరియు ఉపకారాలకు ధన్యవాదులై ఉండటానికి ఆ అల్లాహ్ నుండి సహాయాన్ని కోరుతూ ఉండండి.

రెఫరెన్స్:నెహ్జుల్ బలఘా,ఖుత్బా నం:97.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9