బఖరహ్ సూరా

శని, 08/26/2017 - 07:51

.ఖుర్ఆన్ యొక్క రెండవ సూరా అయిన బఖరహ్ గురించి సంక్షిప్త జ్ఞానం.

బఖరహ్ సూరా

ఖర్ఆన్ యొక్క రెండవ సూరా బఖరహ్. బఖరహ్ అనగా ఆవు. ఈ సూరా పేరుకు సంబంధించిన ఆయత్ 67వ ఆయత్ “వ ఇజ్ ఖాల మూసా లి ఖౌమిహి ఇన్నల్లాహ యామురుకుమ్ అన్ తజ్‏బహు బఖరా”. ఈ సూరాలో బఖరా పదం 5 సార్లు (4 సార్లు బఖరహ్ మరియు 1 సారి బఖర్) వచ్చింది. మరి పూర్తి ఖుర్ఆన్ లో బఖరహ్ అను పదం 9 సార్లు (4 సార్లు బఖరహ్, 3 సార్లు బఖర్ మరియు 2 సార్లు బఖరాత్) వచ్చింది. ఈ సూరాలో 286 ఆయత్ లు, 6143 పదాలు మరియు 26256 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 282 సార్లు వచ్చింది. ఇది మదీనాలో అవతరించబడింది. దీని కన్న ముందు అవతరించబడ్డ సూరా పేరు ముతఫఫ్పీన్. దీని తరువాత అవతరించబడ్డ సూరా పేరు అన్‏ఫాల్. ఈ సూరాకు బఖరహ్(ఆవు) అని పేరు పెట్టడానికి గల కారణం ఇందులో బనీఇస్రాయీల్ యొక్క ఆవు గురించి చెప్పబడింది. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతలేమిటంటే ఇది ఖుర్ఆన్ యొక్క సూరాలలో అతి పెద్ద సూరా. ఇందులో 130 ఫిఖా ఆదేశాలున్నాయి. నమాజ్ చదివే దిశ మార్చబడిన ప్రస్తావనం ఉంది.
ఈ సూరా యొక్క ప్రతిష్టత గురించి దైవప్రవక్త ఇలా ప్రవచించెను బఖరహ్ సూరాను పఠించిన వారిపై అల్లాహ్ యొక్క దయా మరియు కరుణ ఉంటుంది, మరియు అతనికి అల్లాహ్ మార్గరక్షకుల ప్రతిఫలం ప్రసాదించబడుతుంది.[మజ్మవుల్ బయాన్, భాగం1, పేజీ67]

రిఫ్రెన్స్
తబర్స్, మజ్మవుల్ బయాన్, భాగం1, పేజీ67

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 35